Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
చేతులు కాలితే....చేయండిలా!

కాలిన గాయం చిన్నదిగా వుంటే భయం, ఆందోళనలు అవసరం లేదు. చేయికాల్చుకున్న పిల్లాడికి ముందుగా ప్రధమ చికిత్స చేయండి. మీరు ఖంగారు పడకుండా వుంటేనే ఈ పని చేయగలుగుతారు. కాలిన వెంటనే తక్షణం చేయాల్సిందేమంటే, కాలిన శరీర భాగంపై నీరు పోయండి. అయితే కాల్పు చాలా తక్కువగా వుంటేనే నీరు పోయటం మంచిది. లేదంటే...బాగా కాలిన గాయానికి నీరు చేరి ఉబ్బిపోతుంది. కనుక అధికంగా కాలితే నీరు పోయకండి.
కాలిన గాయాలకు పసుపు బాగా పనిచేస్తుంది. పండుగ వేడుకలనాడు పసుపు కనుక అందుబాటులో పెట్టుకుంటే కాలిన గాయాలకు తక్షణ ప్రధమ చికిత్స చేయవచ్చు. పసుపు యాంటీ సెప్టిక్ గా రాయటం వలన కాలిన గాయాలు ఇన్ఫెక్షన్ కు గురికాకుండా వుంటాయి. పసుపు లేదా ఇతర యాంటీ సెప్టిక్ క్రీము అందుబాటులో లేకుంటే, ఒక ఉల్లిపాయను సగానికి తరిగి కాలిన భాగంపై గట్టిగా రాయండి. డెట్టాల్ లేదా సావలోన్ వంటివి కూడా కాలిన భాగాలకు తక్షణమే రాయవచ్చు. స్పిరిట్ , ఆల్కహాల్ వంటివి కూడా కాలిన గాయాలకు పనిచేస్తాయి. కాని పిల్లలు బహుశ వీటి తీవ్రతకు తట్టుకోలేకపోవచ్చు.
పిల్లల గుడ్డలుకు నిప్పు అంటుకుంటే, వెంటనే వాటిపై నీరు పోయకండి. నీరు గుడ్డను వారి శరీర చర్మానికి అంటుకుపోయేలా చేస్తుంది. అది మరింత ప్రమాదకరం. తక్షణమే వారిని ఒక దుప్పటిలో చుట్టేయండి లేదా వీలైనంత మేరకు వారి శరీరం నుండి దుస్తులను లాగేయండి.
పిల్లల చేతి కాల్పులు కొద్దిపాటివైతే, చేసే ప్రధమ చికిత్స సరిపోతుంది. మీకు అది చాలదనిపిస్తే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళండి. సురక్షితమైన దీపావళి జరుపుకోండి.



Click it and Unblock the Notifications
