Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
పిల్లలు పోట్లాటలు చేయకుండా...

మరి ఈ పరిస్ధితులలో స్కూలు యాజమాన్యాలు పిల్లల మధ్య పోట్లాటలు జరుగరాదని కొన్ని తీవ్ర చర్యలు చేపడుతున్నాయి. స్కూలు యాజమాన్యాలకు సహకరిస్తూ ఇంటివద్ద తల్లితండ్రులు కూడా కొంతమేరకు పిల్లల తగవులను గమనించి వాటిని అరికట్టేందుకు ప్రయత్నించాలి. అందుకుగాను కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాం పరిశీలించండి. మీ పిల్లలను తగవులు చేయని వారిగా తీర్చిదిద్దండి.
ఏ పోట్లాట జరిగినా దానిపై పిల్లవాడితో చర్చించండి. ఇతర కుటుంబ సభ్యులను కూడా తమ అనుభవాలను తెలుపమని కోరండి. పిల్లవాడు తన పోట్లాట గురించి చెపుతూంటే, శ్రధ్ధగా వినండి. తన తగవును గురించి చర్చించినందుకు అభినందించండి. మీ మద్దతు తప్పక వుంటుందని తెలుపండి. పిల్లవాడి స్కూలును సంప్రదించి వారి విధానాలను తెలుసుకోండి. అక్కడి సిబ్బంది, టీచర్లు ఈ సమస్యను ఏ రకంగా పరిష్కరిస్తారనేది తెలుసుకోండి.
పోట్లాటలకు గల కారణాలు తెలుసుకోండి. వాటిని తొలగించండి. అది కనుక ఆహారం, డబ్బు, ఇతర పరికరాలకు సంబంధించినది అయితే, మీ బిడ్డకు సరైన లంచ్ లేదా స్కూలుకు వెళ్ళేటపుడు ఏ పరికరాలు తీసుకెళ్ళకుండా వుండేలా చూడండి. మీ బిడ్డ భద్రత కొరకు ఎల్లపుడూ వేరొకరితో కలసి వుండమనండి. ఇద్దరు లేదా ముగ్గురుగా వుండటం ఒంటరిగా వుండేకంటే శ్రేయస్కరం. స్కూల్ బస్, బాత్ రూమ్ లేదా పోట్లాటలు జరిగే చోట మీ పిల్లవాడు ఇతర పిల్లలతో కలసి వుండాలని తెలుపండి.
వీలైనంత వరకు పిల్లల పోట్లాటలపై ప్రశాంతంగా పరిష్కరిస్తూ కొనసాగండి. పోట్లాడే పిల్లాడు మీ పిల్లాడి పై దాడి చేస్తే, తిట్టవద్దని తగవు ఆపమని చెప్పాలని, మాట్లాడకుండా దూరంగా వచ్చేయాలని నేర్పించండి. తేలికగా కోపం తెచ్చుకోని పిల్లాడు పోట్లాడే వారి లక్ష్యానికి దూరంగా వుంటారని తెలుపండి. పిల్లల పోరాటాలను మీరు కూడా పోరాడవద్దు. పోట్లాడే పిల్లల తల్లితండ్రులతో నిర్మాణాత్మకంగా మాట్లాడండి. స్కూల్ లోని యాజమాన్యం మీ మధ్య వర్తిగా వ్యవహరిస్తే మరింత మంచిదని తెలుసుకోండి.



Click it and Unblock the Notifications