Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
పిల్లల తల వెంట్రుకలు బాగా ఎదగాలంటే?

1. పిల్లల జుట్టు వారంలో 3 లేదా 4 సార్లు కడిగేలా చూడండి. జుట్టు పొట్టిగా వుంటే నీటితో రెగ్యులర్ గా కడిగేయవచ్చు. అవసరం అనుకుంటే రోజూ తల స్నానం చేయించండి.
2. పిల్లల తల జుట్టు వాష్ చేయటానికి నో టియర్స్ షాంపూ ఉపయోగించండి. వీటిలో రసాయనాలు వుండవు. వారి కళ్ళు మండకుండా వుంటాయి.
3. పిల్లల తల రుద్దేటపుడు మెల్లగా వేళ్ళతో రుద్దండి. గోళ్ళు ఉపయోగించవద్దు.
4. పిల్లకు పొడవు జుట్టు వుంటే హెయిర్ కండిషనర్ రాయండి. జుట్టు చిక్కు పడకుండా తేలికగా దువ్వవచ్చు.
5. తలంటు తర్వాత వెడల్పు పళ్ళ దువ్వెనతో వెంట్రుకలు దువ్వండి. చిక్కు పడకుండా వుంటాయి. పిల్లల దువ్వెన పెద్దలు వాడకండి. తల ఎక్కువ సార్లు రోజులో దువ్వితే జుట్టు పెరుగుతుందనేది సరికాదు. అధికంగా దువ్వితే, జుట్టు ఊడే ప్రమాదముంది.
6. జుట్టు రెగ్యులర్ గా కట్ చేస్తూ వుంటే ఎదుగుదల బాగుంటుంది. పిల్లలు ఆనందించే పార్లర్ లో అందంగా కట్ చేయించి వారికి రూపలావణ్యాలు కలిగించండి.
7. జుట్టు ఊడకుండా వుండాలంటే ఎపుడూ ముడి వేయండి.
8. పిల్లలు అందంగా వుండాలంటే, రంగు రంగుల క్లిప్పులు, రిబ్బన్లు ఇతర సాధనాలు అమర్చండి.
9. ఆడపిల్లలైతే వారి తల వెంట్రుకలపై మరింత శ్రధ్ధ పెట్టాలి. వెంట్రుకల కుదుళ్ళ ఆరోగ్యం అవసరం. అందుకుగాను ప్రతిరోజూ మంచి నూనెతో కుదుళ్ళలో మసాజ్ చేస్తూ వుండండి.
ఈ చర్యలు పాటిస్తే, మీ పిల్లల తల వెంట్రుకలు అందంగా, ఆరోగ్యంగా ఎదుగుతాయి. చిన్నతనంలో తల వెంట్రుకలపై తీసుకున్న జాగ్రత్తలు వారు పెద్దవారైనప్పటికి కొనసాగి వారి రూప లావణ్యాలు మెరుగుగా వుంటాయి.



Click it and Unblock the Notifications
