Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
తల్లితండ్రుల సమావేశాలకు హాజరవుతున్నారా?

పిల్లలగురించిన చర్యలన్నీ మీకు తెలియాలి. పిల్లలు ఎంతపనికైనా సరే సాహసిస్తారు. చివరకు ప్రోగ్రెస్ రిపోర్టులపై సంతకాలు సైతం ఫోర్జరీ చేస్తారు. వీరి సంగతి పూర్తిగా తెలుసుకోకుండా ప్రోగ్రెస్ రిపోర్టుతో సంతోషపడిపోవడం సరి కాదు. మీరు సమావేశాలకు హాజరైతే తప్ప మీ పిల్లవాడి స్కూలు ప్రవర్తన మీకు తెలియదు. పిల్లాడు సిగ్గుపడుతున్నాడా, భయపడే రకమా? లేక టీచర్లను, తోటి విద్యార్ధులను టీజ్ చేస్తున్నాడా? మున్న్నగు అంశాలకై మీరు తప్పక మీటింగులకు హాజరు కావాలి.
పిల్లలు స్కూలులో చేర్పించేటపుడు మెత్తగా వున్నా తర్వాతి రోజులలో వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయని గమనించండి. ఒక్కొకపుడు, స్కూలు బోధనలు పిల్లవాడికి సరికాకపోవచ్చు కూడాను అటువంటపుడు మీ అభిప్రాయాలను తెలియజేయటానికి ఈ మీటింగులు సరైనవి. ఈ సమావేశాలలో మీరు ఇతర విద్యార్ధుల తల్లితండ్రులను కూడా కలిసి పిల్లల సమగ్ర బాగోగులు చర్చించవచ్చు. సమయంలేనందువలన సమావేశాలకు హాజరు కవటంలేదనేది ఒక కుంటిసాకు మాత్రమే. పిల్లవాడి భవిష్యత్తు దృష్ట్యా తల్లి తండ్రులలో ఎవరో ఒకరు వీటికి తప్పక హాజరై బిడ్డ భవిష్యత్తు మెరుగుపడేలా చూడాలి.



Click it and Unblock the Notifications
