Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
పిల్లలకు, పెద్దలకు కూడా సుఖమే!

పిల్లాడు భయపడి గొడవ చేస్తూ వుంటే...మీరు మాత్రమే బాగా నియంత్రించగలరు. వారిని, వారి ఏడుపులను లొంగదీయటం వేరెవరి తరం కాదు. చేతిలో సిజర్స్, కత్తి వంటివాటిని చూస్తే చాలు వారు ఏడుపు మొదలుపెట్టేస్తారు. పిల్లలకు కూడా ఎలా పడితే అలా హెయిర్ కట్ చేయటానికి వీలులేదు. వారికి కూడా బాబ్, లేయర్స్, బౌల్ కట్ మొదలైనవి వున్నాయి. వీరు స్కూలుకు వెళ్ళే పిల్లలు కనుక నలుగురి పిల్లలతో సమానంగా స్టైల్ మెయిన్టెయిన్ చేయాల్సి వుంటుంది. అయితే, మీరు పిల్లాడికి ఇంటివద్దే మీరు హెయిర్ కటింగ్ చేసేయాలనుకుంటే, అందుకుగాను కొన్ని చిట్కాలు పరిశీలించండి.
హెయిర్ కట్ కు అవసరమైన వస్తువులు - ఒక చిన్న టవల్, చిన్న సైజు కత్తెర, సన్నని దువ్వెన, తడి చేయటానికి నీరు ఒక స్ప్రేయింగ్ కేన్ లో, వీలైనంత పెద్ద పోర్టబుల్ అద్దం, హెయిర్ క్లిప్పులు. వీటితో పాటు అదనంగా ఒక టివి లేదా ల్యాప్ టాప్ వంటివి వుంటే కూడా పిల్లాడు కదలకుండా కూర్చుంటాడు.
పిల్లాడిని భయపెట్టకండి - ఇదే మొదటిసారైతే, వాడికి మీరు చేసే పని వివరించండి. సరదాగా వుంటుందనండి. వాడికి నచ్చిన పాటలు వినిపించండి. లేదా వాడికి నచ్చిన ఏదేని ఒక చాక్లెట్ కూడా నోటిలో పెట్టేయండి. ఇక దానిని వాడు తింటూ కూర్చుంటాడు. మీ పని మీరు చేసేయవచ్చు. ఒకే సారి ఎపుడూ సడన్ గా బార్బర్ ఛైర్ లో వాడిని కూర్చోపెట్టకండి. పిల్లవాడు ఆందోళన చెంది భయపడిపోతాడు. మరోమారు మీ మాటలు నమ్మి మీ వద్దకు రాడు.
హెయిర్ కట్ కు సిద్ధం చేయండి - భుజం చుట్టూ టవల్ కప్పి టివీలో కార్టూన్ సినిమా చూపిస్తూ కూర్చోపెట్టండి. స్ప్రేయర్ తో నీటిని తలపై చల్లండి. లేదా దువ్వెన తడి చేసి వెంట్రుకలు సగానికి దువ్వండి. లేదా ముందుకు, వెనక్కు పూర్తిగా దువ్వండి. తలపై నీరు చల్లితే కొంతమంది పిల్లలు ఏడుస్తారు. జాగ్రత్త.
పిల్లాడి దృష్టి మరల్చండి - కత్తెర ధ్వని, వెంట్రుకలు తెగి కిందపడటం వంటివి పిల్లాడిని భయపెడతాయి. అందుకని కార్టూ న్ సినిమా చూపించి మెల్లగా మీ పని మీరు చేయండి.
కటింగ్ ఎలా చేయాలి? - తల వెంట్రుకలు ముందు, వెనుక, పక్క భాగాలుగా గుర్తించి ఒక్కొక్క భాగం ఒకోసారి దువ్వుతూ చేయాలి. చేస్తున్నంత సేపూ పిల్లాడు కార్టూన్ సినిమా చూస్తూనే వుండాలి.
మీరు చేసే పని తేలికగా వుందనుకుంటే, ఇక పిల్లాడు ఏ అభ్యంతరం చెప్పక చక్కని హెయిర్ కట్ కు సహకరిస్తాడు.



Click it and Unblock the Notifications