Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పిల్లల్లో జలుబు.. పెద్దలకు ఆందోళన..?

కారణం జలుబు వల్ల వారి ముక్కులు మూసుకుపోవడం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అనిపించడం, నిద్ర పోకపోవడం వంటివి చూసి పిల్లల్లో జలుబు ఇంతగా ఎందుకు చేస్తుంది? ప్రత్యేకంగా ఈ సీజన్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఎందుకు వేధిస్తుంటుంది? ఇది ఏమైనా ఆరోగ్య సమస్యా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మందులు ఏం వాడాలి? అని సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. జలుబు చేసింది, ఏమీ తినడం లేదు, రాత్రుళ్లు నిద్రపోవడం లేదు, ఊరికే ఏడుస్తున్నాడు?... ఇలాంటి ఫిర్యాదులు తల్లిదండ్రులు పదే పదే వైద్యుల వద్దకు తీసుకువస్తుంటారు. పిల్లలకు జలుబు ఎందుకు వస్తుందో తెలుసుకుంటే, ఆందోళన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
1. సాధారణంగా పుట్టిన నెల రోజుల వయసు నుంచే పిల్లలకు జలుబు రావడం మొదలవుతుంటుంది. మందులు వాడినా వాడకపోయినా ఏడు రోజుల్లో తగ్గిపోయే జలుబుకు ఎన్నో ఇతర కారణాలు ఉన్నాయి. జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పెద్దవాళ్లకు జలుబు ఉండి, పిల్లలకు దగ్గరగా లేదంటే వారి మీదనే దగ్గడం, తుమ్మడం చేస్తే వెంటనే అది పిల్లలకు వస్తుంది.
2. వైరస్‌తో పాటు శుభ్రత లోపించడం దుమ్ము వల్ల కూడా జలుబు వస్తుంటుంది. ముక్కులో అడినాయిడ్స్, గొంతులో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పిల్లలకు జలుబు ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరిలో జలుబు తగ్గడానికి కూడా ఎక్కువ రోజులు పట్టవచ్చు.
3. పెద్దలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం వల్ల, అందులో ఉండే వైరస్ ఎక్కడైనా వ్యాపిస్తుంది. ఇలాంటి చోట ఉండే పిల్లలను జలుబు ఎక్కువగా వేధిస్తుంది. ఉమ్మి ద్వారా టి.బి., స్వైన్‌ఫ్లూ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుంది.
4. తల్లిపాలు తాగని పిల్లల్లో తరచూ జలుబే కాదు ఏ ఇన్ఫెక్షన్ అయినా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. జలుబుకి ఆహారం విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే ముక్కులు మూసుకుపోవడం వల్ల పిల్లలు సరిగా తినలేరు. అందుకని తక్కువ తక్కువ ఆహారాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు ఇస్తుండాలి. రెండు- మూడు గంటలకు ఓసారి పాలిచ్చే తల్లులు పిల్లలకు జలుబు ఉన్నప్పుడు ఎక్కువ సార్లు ఇస్తుండాలి.
5. వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల పిల్లలకు ఐదేళ్ళ వయసు తర్వాత నుంచి జలుబు దానంతట అదే తగ్గుతూ ఉంటుంది. కాబట్టి జలుబు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే... శుభ్రత, జాగ్రత్తలతో ఈ సమస్య పిల్లల్ని మరీ బాధించకుండా చూడవచ్చు.
6. జలుబు ఎక్కువగా ఉండి గాలి పీల్చుకోవడానికి కష్టపడుతుంటే, ఆహారం తీసుకోవడానికి, నిద్రపోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతుంటే సెలైన్ డ్రాప్స్ రెండు చుక్కలు ముక్కులో వేయాలి. అవి కూడా నాలుగైదు రోజులకు మించి వాడకూడదు.
7. గాలిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు ఆవిరిపట్టాలి. వేడినీటిలో కొద్దిగా వేపరైజర్స్ వేసి ఆవిరి పట్టాలి. అయితే చంటి పిల్లలు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. పొగలు కక్కే వేడినీటికి మరీ దగ్గరగా తీసుకెళ్లకూడదు.
8. పిల్లలకు జలుబు చేసినప్పుడు ముక్కు కారుతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా నీరు ఎక్కు వగా తాగిస్తే ‘మ్యూకస్' తేలికగా బైటికొస్తుంది. దగ్గే పిల్లలకు కఫం బయటికి రావాలన్నా నీరు తాగించాలి.పిల్లలకు ఆటపాటల్లో నీరు చెమటగా త్వరగా బైటికొస్తుందని పెద్దలు గ్రహించాలి.
9. ఇంట్లో తీసుకునే కొన్ని చిట్కా వైద్యాల ద్వారా కూడా ఈ సమస్యను నయం చేయవచ్చు. దగ్గు, గొంతులో గర గర తగ్గడానికి గోరు వెచ్చని నీరు తాగిస్తూ ఉండాలి. పెద్దపిల్లలైతే వామునీరు, తులసి నీరు, కొద్దిగా మిరియాలు పాలలో కలిపితీసుకోవచ్చు.
10. పిల్లల్లో జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు వేడినీళ్ళ స్నానం చాలా బాగా పనిచేస్తుంది. ఇది పిల్లల శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. జలుబు చేసినప్పుడు పిల్లలు చల్లటి నీటిని తాకడం వల్ల, చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జులుబు ఎక్కువ అవ్వడంతో పాటు, జ్వరం కూడా వచ్చే అవకాశం ఎక్కువ.



Click it and Unblock the Notifications
