Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
పిల్లల భవిష్యత్తుకు మార్గదర్శకత ఎలా?

1. తల్లితండ్రులు పిల్లలను వారి కెరీర్ కొరకు బలవంతం చేయరాదు. ఇలా చేస్తే అది వారిని తప్పుదోవ పట్టిస్తుంది. వారికి వారే వారికి ఆసక్తి కల రంగాలలో కెరీర్ ఎంపిక చేసుకోడానికి అనుమతినివ్వాలి. ఏ మాత్రం బలవంతం చేసినా వారి భవిష్యత్తు అధ్వాన్నం కాగలదని తల్లితండ్రులు గుర్తించాలి. తల్లితండ్రులకు అది సరికాదని తెలిసినా, వారు ఎంపిక చేసుకునేదానిని ఇష్టపడాలి. ఈ విషయంలో పిల్లల ఎంపికలను తల్లితండ్రులు తక్కువగా అంచనాలు వేయరాదు.
2. నెట్ వర్కింగ్ - పిల్లలు వివిధ రంగాల నిపుణులతో సంబంధాలు ఏర్పరచుకొని వాటి బాగోగులపట్ల తెలుసుకోడానికి గాను తల్లితండ్రులు సహకరించాలి. అందుకుగాను వారికి తగిన ఏర్పాట్లు చేసి ఆయా రంగాల వారితో ముచ్చటించి ఇంటర్వ్యూలవంటివి ఇప్పించాలి. అందుకు తగిన సమాచారం పూర్తిగా వారికి అందుబాటులోకి వచ్చేలా చూడాలి.
3. అభిరుచి పరీక్షలు - తల్లితండ్రులు పిల్లలు తమకు నచ్చిన రంగాలలో పరీక్షలు వ్రాయటానికి అనుమతించాలి. ఈ పరీక్షలు పిల్లలకు బలమైన పునాదులుగా వుండి వారి బలహీనతలను తొలగించి వారికి ఆయా రంగాలపై శ్రద్ధ కలిగించేలా చేస్తాయి. వారికి మంచి అవగాహన కలుగుతుంది. ఈ అభిరుచి పరీక్షలలో వారికవసరమైన ఐక్యూ పరీక్షలు, పర్సనాలిటీ పరీక్ష మొదలైనవి వుంటాయి. ఈ పరీక్షలు వ్యక్తి ఆసక్తిపై సరైన అవగాహన నిస్తాయి.
4. తల్లి తండ్రులు సాధారణంగా తమ పిల్లలకు ఎంత గ్రేడు వచ్చింది అనేది చూస్తూంటారు. మంచి గ్రేడ్ అయితే బిడ్డకు మంచి కెరీర్ వస్తుందని భావిస్తారు. కాని ఇది సరికాదు. ఇది అన్నివేళలా సరికాకపోవచ్చు. విద్యలో వారు బాగా రాణించినప్పటికి, అది వారి భవిష్యత్తు ఉజ్వలతకు సహకరించకపోవచ్చు. విద్య అవసరమే కాని అదంతా పుస్తక సమాచారం లేదా విద్య అని గ్రహించాలి. విజ్ఞానం అనంతం. పిల్లలకు ఇది కావాలి ప్రతి విషయంలోను వారికి ప్రాక్టికల్ అవగాహన కావాలి. పుస్తకాల విద్య ఆధారంగా పిల్లల భవిష్యత్తును నిర్ణయించరాదు.
5. సరైన ప్రవర్తనాతీరు పిల్లలకు నేర్పించండి. ఏ అంశమైనా సరే ముందుగా వారు అర్ధం చేసుకొని సరైన రీతిలో దానిని ఆచరించేందుకు వారికి నేర్పించండి. ప్రవర్తనా తీరు అనుభవంతో మొదటినుండి రావాలి. అతనిపై అతనికి విశ్వాసం కలగాలి. పిల్లలు విజయవంతులవ్వాలంటే, చిన్న వయసునుండే మెళకువలు అలవర్చుకొని ఆ కాలంలో వుండే అవకాశాల పట్ల అవగాహన కలిగివుండాలి. ఉదాహరణకు కార్పోరేట్ రంగంలో ప్రవేశించాలంటే, పరిశ్రమలు, వాటి లోతుపాతులు, దానిలోగల నియమ నిబంధనలు వంటివి తెలుసుకొని వుండాలి.
మీరు చేపట్టే ఈ చర్యలు మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తాయనటంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications
