Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
పిల్లలను చురుగ్గా..ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ ఫుడ్స్
ఆరోగ్యకరమైన భోజనం తయారు చేయడానికి కొన్ని ప్రణాళికలు సహాయపడుతుంది. కానీ పనిచేసే తల్లిదండ్రులకు ఇది చాలా కష్టంగా ఉంటుంది. సమయానికి ఇంటికి చేరుకోవడం. వారి పిల్లలకు సంబంధిచిన ఎక్స్ట్రా కారికులమ్ యాక్టివిటీస్ లో పాల్గొనడం లేదా వారి ఇచ్చే భోజనం ఇవ్వడం అన్ని చూసుకోవాలంటే కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా పిల్లలకు ప్రాసెస్ ఫుడ్ అంటే మాకరోనీ మరియు చీజ్ లేదా పిజ్జా వంటివి ప్రతి ఆహారంలోనూ అందిస్తున్నారు.
ఇలాంటి ఆహారాలు చిన్నతనం నుండి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఊబకాయంతో పాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలను చిన్నవయస్సులోనే ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు కాకుండి పిల్లల కోసం కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన న్యూట్రీషియన్ ప్యాక్డ్ సూపర్ ఫుడ్ అంటే గుడ్లు, నట్స్, చెక్క, మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు పిల్లలకు ప్రత్యేకంగా అంధించాలి
ఒక పేరెంట్ గా, మీ పిల్లల పెరుగుదలకు మరియు మెదుడు మరియు శరీరం అభివృద్ధికి ప్రోత్సహించే ఆహారాలను పూర్తి పోషకాంశాలు కలిగిన ఆహారాలను ఇవ్వాలి. ఇటువంటి న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు, పీచు, కొవ్వులు, పిండి పదార్థాలు మరియు మాంసకృత్తులు కలిగి ఉంటాయి.
పసిపిల్ల పోషణకు 10 న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్స్:

గుడ్లు: గుడ్లు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరియు వీటిలో సహజంగా కాల్షియం శరీరం గ్రహించడానికి సహాయపడే విటమిన్ డి ఇందులో ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఒక గ్లాసు పాలతో పాటు గుడ్డును అంధించడం వల్ల వారు సంతృప్తికరంగా అనుభూతిని కలిగి ఉండటమే కాదు ఎక్కువ సమయంలో కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది ఈ పోషకాంశం.

ఓట్ మీల్: కొన్ని పరిశోధనల ప్రకారం ఓట్ మీల్ తిన్న పిల్లలు పాఠశాలలో మంచి ఏకాగ్రతను పొందుతున్నారు. అదేవింధంగా అన్నింట్లోను దృష్టి సారిస్తున్నారు. అని కనుగొన్నారు. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు అంటే ఓట్ మీల్, ఇవి చాలా తేలికగా మరియు నిదానంగా జీర్ణం అవుతాయి. దాంతో పిల్లల్లో ఎక్కువ సమయం శక్తి స్థిరంగా ఉండటానికి ఈ ఆహారాలు సహాయపడుతాయి.

పండ్లు: వివిధ రకాల పండ్లలో ఏ పండైనా సరే పిల్లలకు ఆరోగ్యకరమే. పిల్లలు పండ్లు తినడం వల్ల పిల్లలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరలల్స్ పుష్కలంగా అందుతాయి. మరియు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇవి పిల్లలను చురుకుగా ఉంచుతుంది. మరి పుష్కలమైన న్యూట్రీషియన్స్ పొందడానికి అన్ని రకాల పండ్లను (బెర్రీస్, మెలోన్స్, కివి ఫ్రూట్స్, మరియు ఆరెంజ్ )పిల్లలచేత తినిపించండి.

నట్స్: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు అభివృద్ధి కోసం, అలాగే గుండె ఆరోగ్యానికి అవసరం అయ్యే మంచి ఫ్యాట్స్(కొవ్వు) ను కలిగి ఉంటాయి. పిల్లలకు రోజూ ఉదయం చిన్న మొత్తంలో ఇటువంటి కొవ్వు పదార్థాలను అంధించడం వల్ల వారికి తగినంత శక్తిని పొందుటకు వారు పెరుగుదలకు అన్నివిధాల బాగా సహాయడుతాయి.

పాలు: మెదడుకు మరియు శరీరం కోసం ఇంధనాన్ని(శక్తిని) అందించడానికి పాల ఉత్పత్తులు ప్రోటీన్ మరియు కాల్షియం బాగా సహాయపడుతాయి. పిల్లల్లో బ్రెయిన్ టిష్యుష్ అభివృద్ధికి మరియు పిల్లల్లో బలమైన ఎముకల పెరుగుదలకు మరియు బలమైన దంతాలను పొందడానికి పాలు బాగా సహాపడుతాయి.

ఆకుకూర: ఐరన్, క్యాల్షియం, మరియు ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ ఎ అండ్ సి పోషకాంశాలను కలిగిన ఒక అద్భుతమైన ఆహారం ఆకుకూరలు. ఆకుకూరలు పెద్దలకు మాత్రమే కాదు పిల్లల బ్రెయిన్ మరియు బోన్ పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

పెరుగు: బలమైన ఎముకలు మరియు దంతాలను రూపొందించడానికి పెరుగులోని క్యాల్షియం, ఇతర పోషకాంశాలు బాగా సహాపడుతాయి. అంతే కాదు, పెరుగు తేలికగా జీర్ణం అవ్వడానికి మరియు పేగులో చెడు బ్యాక్టీరియాను నివారించడానికి ఇవి బాగా సహాపడుతాయి. కాబట్టి లోఫ్యాట్ పెరుగును తీసుకొని, వారికి ఇష్టమైన పండును చేర్చి అంధించండి.

తృణధాన్యాలు: తృణధాన్యాలను బ్రెడ్ మరియు ఇతర చిరుధాన్యాలలో చూడవచ్చు. పిల్లలు సాధారణంగా ఇటువంటి ఆహారాలను బాగా ఎంజాయ్ చేస్తారు. వీటిలో ఫోలిక్ ఆమ్లం, ఇనుము, జింక్ మరియు B విటమిన్లు మరియు అలాగే కొన్ని విటమిన్ డి మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. పిల్లలకు ఇటువంటి ఆహారాలను(తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలను) ముఖ్యంగా బ్రెడ్ మరియు పాస్తా వంటివి ఇవ్వడాన్ని మొదలు పెట్టండి.
అక్రోట్లన

వాల్ నట్స్(అక్రోట్స్): అక్రోట్స్ ఇవి ఒకరకమైన పండ్లు. ఒక అద్భుతమైన ప్రోటీన్ స్నాక్. మరియు వీటిని చాలా సులభంగా మీ పిల్లల లంచ్ బాక్స్ లో చేర్చేయవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి మెదుడును చురుగా ఉంచడంలో బాగా సహాయపడుతాయి. బుద్ది మాద్యంను మరియు ఇతర వ్యాధులను నిర్మూలించడానికి ఇవి బాగా సహాయపడుతాయి. బేక్ చేసిన ఆహారాలు మరియు ఇతర ధాన్యపు ఆహారాలతో పాటు వాల్ నట్స్ ను కట్ చేసి సలాడ్స్ గా గార్నిష్ చేసి ఇవ్వొచ్చు.

క్యాబేజ్: క్యాబేజ్ కూరిఫెరస్ వెజిటేబుల్, ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అతి సులభంగా జీర్ణం అవ్వడానికి మరియు రోగనిరోధకతను ఎదుర్కోవడానికి బాగా సహాయపడుతాయి. వీటిని వివిధ రకాల కాంబినేషన్ తో మిక్స్ చేసి పిల్లలకు అంధించడం వల్ల చాలా ఇష్టంగా తింటారు.



Click it and Unblock the Notifications