Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
సెలవులలో మీ పిల్లలకు ఏమి నేర్పిస్తారు
సాదారణంగా పిల్లల జీవితంలో సెలవులు అనేవి చాలా అద్భుతమైన మరియు ఎదురుచూస్తున్న సమయంగా ఉంటాయి. పిల్లల రోజూవారీ జీవితం పాఠశాల,అదనపు తరగతులతో మరియు హోంవర్క్,పరీక్షల భారంతో ఉంటుంది. పిల్లలు సెలవుల సమయంలో మాత్రమే ఎటువంటి నియమాలు లేకుండా ఆటలు ఆడుకొని ఆనందిస్తారు. కానీ,సెలవులను కేవలం ఫన్ మరియు క్రీడలతో వృధా చేయకూడదు. తల్లిదండ్రులు వారి పిల్లలను బిజీగా ఉంచాలి.అంతేకాక వారి మనస్సులలో ఏదో ఒక ఆలోచన వచ్చేలా చేయాలి.
సెలవుల్లో TV చూడటం మరియు కంప్యూటర్ గేమ్స్ ఆడటం వంటి వాటితో ఎక్కువ సమయం గడపకూడదు. అయితే వారికీ ట్యూషన్ మరియు హాబీ క్లాసులు పెద్ద భారం మరియు ఒత్తిడి కాకుండా ఉండేలా చూడాలి. సెలవుల సమయంలో పిల్లలకు నేర్పటానికి కొన్ని విషయాలు క్రింద వివరించబడ్డాయి: -

1. స్విమ్మింగ్
పిల్లలు తప్పనిసరిగా స్విమ్మింగ్ చేయాలి. స్విమ్మింగ్ అనేది సరదాగా చేసే ఒక వ్యాయామం వంటిది అని చెప్పవచ్చు. ఇది సెలవుల్లో మీ పిల్లలకు నేర్పడానికి ఒక విషయంగా చెప్పవచ్చు. పిల్లల కోసం స్విమ్మింగ్ పాఠాలు సెలవుల సమయంలో అందుబాటులో ఉంచాలి. స్విమ్మింగ్ అనేది ఒక అలసిపోయే వ్యాయామం వలె ఉంటుంది. దీనిని నేర్చుకోవటానికి సెలవులు ఉత్తమ సమయం అని చెప్పవచ్చు.2. ఆర్ట్&క్రాఫ్ట్
ఆర్ట్&క్రాఫ్ట్ పాఠాలు మీ పిల్లల మనస్సులను విస్తృతం చేస్తాయి. ఈ తరగతుల వలన పిల్లల ఊహాత్మక ద్వారాలు తెరిచి వారి ఆలోచనలను మెరుగుపరుస్తాయి. వాటిలో డ్రాయింగ్,స్కెచ్చింగ్,వివిధ రకాల చిత్రాలు మొదలైన ముఖ్యాంశాలను చేర్చవచ్చు.
3. డాన్స్
మీ పిల్లలు గ్రూవ్ కలిగి ఉంటే సెలవుల సమయంలో డాన్స్ నేర్పించవచ్చు. డాన్స్ ఎల్లప్పుడూ తాజాదనం మరియు శక్తిని ఇస్తుంది. డాన్స్ పాఠాలు నేర్చుకోవటం వలన క్రమశిక్షణ మరియు పని మీద దృష్టి కలగటానికి సహాయం చేస్తుంది.
4. సంగీతం
సంగీతం అనేది సెలవుల సమయంలో మీ పిల్లలకు నేర్పడానికి ఒక ఉత్తమ విషయంగా ఉంది. సంగీతంలో గానం మరియు వివిధ సంగీత పరికరాలను వాయించటం రెండింటిని నేర్చుకోవచ్చు. సంగీతం కూడా పిల్లల మనస్సు మరియు ఆత్మ ప్రశాంతంగా ఉండెటట్లు చేస్తుంది. సంగీతం పాఠాలు బోధించడానికి సహనం ఉండాలి. మీ పిల్లలకు సంగీతం మరియు గానంలలో ఆసక్తి ఉంటే ప్రోత్సహించండి.
5. శిబిరాలు మరియు సెలవులు
మీ పిల్లలకు నిర్వహణ పాఠాలు బోధించడానికి కుటుంబం వెకేషన్ లేదా ఒక వేసవి శిబిరంనకు తీసుకోని వెళ్ళవచ్చు. మీ పిల్లలను శిబిరాలకు పంపితే వారు తమ సొంత వస్తువులు మరియు నగదును నిర్వహణ చేయుట,ఒంటరిరిగా ఎలా జీవించాలో తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. కుటుంబ వెకేషన్ కు వెళ్ళినప్పుడు మీరు యాత్ర ప్రాముఖ్యతను మరియు గమ్యం వివరాలను పిల్లలకు తప్పనిసరిగా చెప్పాలి.
పిల్లలు శీఘ్ర అభ్యాసకులు మరియు మంచి పరిశీలకులు అవుతారు. సెలవుల్లో మీరు మీ పని కొరకు మీ పిల్లల సహాయం కోరవచ్చు. వారితో ఒక స్టాల్ ఏర్పాటు చేయిస్తే వారికీ పాకెట్ మనీ మరియు క్రొత్త స్నేహితులు వస్తారు. సెలవులు అనేవి మీరు వారికి జీవితం,ప్రేమ మరియు డబ్బు పాఠాలను బోధించడానికి సరైన సమయం అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications
