Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
పిల్లల్లో అతిసార నివారించడానికి 7 ఉత్తమ చిట్కాలు
మీ పిల్లలు తరచుగా అతిసారం వలన బాధపడుతున్నారా? దీనివలన పిల్లలికి చాలా అసౌకర్యంగా ఉంటుంది. అవునా! మీ సుఖవంతమైన ఇంట్లోనే మీ పిల్లలకు సౌకర్యంగా ఉపశమనాన్ని ఇచ్చే నిర్దిష్ట నివారణలు ఉంటే? నిజంగా ఇది గొప్ప విషయం, అవునా !
అతిసారం నుండి మీ పిల్లలకు ఆశ్చర్యకరంగా గొప్ప ఉపశమనాన్ని ఇచ్చే పది సాధారణ గృహ నివారణలు క్రింద ఇచ్చాము. అవి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి!

1. మెంతులు:
మెంతులు, ఈ అతిసార వ్యాధికి ఉత్తమ గృహ నివారణలలో ఒకటిగా పనిచేస్తాయి. వీటిలో జిగురు, పిండిపదార్థముల నుండి గాని తీయబడ్డ ద్రవ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి, అందువలన అతిసార వ్యాధికి సహజ నివారణగా పనిచేస్తాయి. మెంతులు, మలం గట్టిపరచేందుకు మరియు పల్చనైన నీళ్ళ విరేచనాల వలన కలిగే అసౌకర్యాన్ని తొలగించటంలో సహాయపడతాయి.
వీటివలన కలిగే ఉత్తమ ఫలితాల కోసం, ఒక కప్పు పెరుగులో ఒక టీస్పూన్ మెంతులు కలిపి ఇవ్వండి. ఇలా రోజుకి రెండు నుండి మూడుసార్లు తీసుకోండి.
2. అల్లం:
అల్లం జీర్ణక్రియ మరియు జీర్ణకోశ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అతిసారవ్యాధి చికిత్సలో ఆరోగ్యకరంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే, రక్తపోటుతో బాధపడుతున్నవారు మాత్రం ఈ అతిసారవ్యాధికి చికిత్సకు అల్లం ఉపయోగించకూడదు.
3. ఆపిల్ పళ్లరసం వినెగార్:
వినెగార్ తో కలిసిన ఆపిల్ పళ్లరసం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అతిసారానికి కారణమయిన బాక్టీరియాతో పోరాడటానికి అనేక యాంటీబాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. ఇది సాధారణంగా ఒక రక్షణ పూత వలె పనిచేసే పెక్టిన్ అనే రసాయనాన్ని కలిగి ఉన్నది మరియు పొట్ట లోపల పేగుల నొప్పులను తొలగిస్తుంది.
4. అరటిపండ్లు:
అరటిపండ్లు మలాన్ని గట్టిపరచటంలో సహాయపడుతుంది. అరటి పండ్లలో కూడా ,ఆపిల్ పళ్లరసం వినెగార్ లో ఉండే పెక్టిన్ ఉంటుంది. ఈ పెక్టిన్ పేగుల నొప్పులు సడలింఛి, ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది మరియు ప్రేగులలో ఉన్న అదనపు ద్రవాన్ని గ్రహించటంవలన మలంలో ఉన్న ద్రవ పదార్ధం తగ్గి, అతిసార వ్యాధి నివారణకు సహాయపడుతుంది. అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటంవలన ఎలెక్ట్రోలైట్స్ భర్తీ చేయటంలో సహాయపడతాయి.
5. యోగర్ట్:
పెరుగులో 'లైవ్-కల్చర్స్ ' అనే స్నేహపూరిత బాక్టీరియా ఉంటుంది. ఈ రకమైన బ్యాక్టీరియా పేగుకు ఒక రక్షిత పొరను అందిస్తుంది మరియు విషబాక్టీరియాను తొలగించే లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి చేస్తుంది.
6. వైట్ రైస్:
గంజి,అతిసారవ్యాధి నివారణలలో ఉత్తమంగా పనిచేస్తుంది. బంగాళాదుంపతోపాటు బియ్యం గంజికి ఒక గొప్ప మూలం మరియు తెల్ల బియ్యం సులభంగా జీర్ణమవుతాయి. ఘాటు బియ్యం అతిసారవ్యాధితో బాధపడేవారు అసలు వాడకూడదు, వైట్ రైస్ సాధారణంగా అతిసారవ్యాధిని పరిష్కరించడానికి సహాయపడుతుంది. బియ్యం చిన్న పరిమాణంలో ప్రారంభం చేయండి మరియు క్రమంగా పరిమాణం పెంచుతుపొండి.
7. బంగాళ దుంపలు:
స్టార్చి ఆహారాలు అతిసారవ్యాధి చికిత్సలో ఉత్తమంగా పనిచేస్తాయి. మీరు బంగాళాదుంప గురించి ఆలోచించండి మరియు గంజి గురించి ఆలోచించండి. అందువలన, బంగాళాదుంపలు అతిసారం ఉత్తమ నివారణగా పనిచేస్తుంది. మీరు మీ కడుపు సౌకర్యవంతంగా ఉంచుకోవటానికి సాదాగా ఉడికించిన బంగాళదుంపలు తినడం అవసరం. గుర్తుంచుకోవలిసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వేపుడుగా వేయించిన బంగాళాదుంపలు,ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా కారంతో కూరగా చేసిన బంగాళాదుంపలు తినకూడదు. ముఖ్యంగా అతిసారవ్యాధితో బాధపడుతున్నప్పుడు అసలు తినకూడదు. మీ అతిసారాన్ని తగ్గించుకోవడానికి గంజి చాలా అవసరం, కానీ మీరు నూనె వాడకుండా లేదా సుగంధ ద్రవ్యాలు వాడకుండా గంజిని తీసుకోండి. గుర్తుంచుకోండి.
మీరు అతిసారంతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీరు, బియ్యం నీరు మరియు పండ్లు లేదా కూరగాయల రసాలు, ద్రవపదార్థాలు తెస్సుకోవటం మంచిది. గంజి లాంటి ఏ ద్రవపదార్తమైనా తీసుకోవటం మంచిది.



Click it and Unblock the Notifications
