Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
జననాంగ భాగంలో కుట్లుపడితే.... !

చాలామంది డాక్టర్లు రతి చేయాలంటే బిడ్డ పుట్టిన తర్వాత నాలుగునుండి ఆరు నెలలకాలం ఆగాలని చెపుతారు. ఈ సమయంలో మహిళకు గర్భాశయం కొంత బలం పుంజుకుంటుంది రక్తస్రావం ఆగుతుంది. యోనికి గల గాయాలు తగ్గుతాయి. ఈ అంశంలో చేసిన ఒక స్టడీలో టర్కీ లో మహిళలు ఆరు వారాలలో 42 శాతం మంది, అమెరికా, బ్రిటన్ లలో ఆరు వారాలలో 57 శాతంమంది మూడు నెలల కాలంలో 82 నుండి 85 శాతం మంది రతిక్రీడ చేసినట్లు వెల్లడైంది.
డెలివరీ తర్వాత మహిళలో హార్మోన్ల మార్పులు కూడా అనేక రకాలుగా జరిగి బాధిస్తాయి.
బిడ్డ పుట్టిన తర్వాత మహిళల హార్మోన్లలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ కారణంగా సుమారు మూడు నెలల తర్వాత కూడా యోని పొడిబారే అవకాశం వుంటుంది. తల్లిపాలు ఇచ్చే మహిళలు సహజంగా రతియందు ఆసక్తి లేక వుంటారు. రతిలో నొప్పి కలిగి బాధాకరంగా భావిస్తారు. దీనికి కారణం వీరిలో ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గుతుంది. కొంతమంది మహిళలకు డెలివరీలో కనుక అధిక సమస్యలేర్పడితే, వారిలో రతియందు ఆసక్తి అధిక కాలం కోల్పోతారు.
మహిళ గర్భాశయం సరైన ఆరోగ్యం సంతరించుకోకుండానే, బిడ్డ పుట్టిన వెంటనే కొద్దిరోజులకే రతిక్రీడ చేస్తే రక్తనాళాలలో గాలి అడ్డుపడే ప్రమాదం వుంది. ప్రధానంగా రతిక్రీడలో మహిళ మోకాళ్ళు ఆమె ఛాతీకి ప్రెస్ చేయటం వంటివి చేస్తే ఈ సమస్య వస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా వచ్చే సమస్య. ప్రెగ్నెన్సీ తర్వాత సాధారణంగా రతికి అడ్డుపడే సమస్యలు గర్భాశయంలోని ఇన్ ఫెక్షన్ మరియు యోని వద్ద కలిగే కొన్ని కోతలు, చినుగులు వంటివి అని చెప్పాలి.
మహిళకు ప్రసవం అయిన సంవత్సరంలో తక్కువ రతి ఆసక్తి వుంటుంది. కొంతమంది మహిళలు 8 నెలలకే రతికి సిద్ధం అవుతారని కూడా చెపుతారు. బిడ్డ పుట్టిన తర్వాత మహిళల శరీరపటుత్వం తగ్గి ఆకర్షణ కోల్పోతుంది. వారిలో వచ్చే శారీరక మార్పులు వారికి అసౌకర్యంగా వుంటాయి. ఎపుడూ నిద్ర అధికంగా పోవాలని ప్రయత్నిస్తారు. తన భాగస్వామితో రతికి అంగీకరించరు. కనీసం అంటే ఆరు నెలల కాలం వరకు వీరు రతికి అంగీకరించరు.



Click it and Unblock the Notifications
