Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ప్రసవం తర్వాత పొట్టతగ్గించడం ఎలా...?

గర్భం దాల్చినప్పుడు సాధాణంగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తన లో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లగా కుంచించుకుపోతూ, ఆరు వారాలకు గానీ యథాతథస్థితికి చేరదు. గర్భిణిగా ఉన్న సమయంలో గర్భాశయంతో పాటు పొట్ట కండరాలు కూడా బాగా సాగి, పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా ఉంటుంది. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడంవల్ల శరీర ధర్మాన్ని బట్టి చర్మంపై తెల్లటి/ఎర్రటి/ నల్లటి చారికలు (స్ట్రెచ్‌మార్క్స్) ఏర్పడతాయి.
డెలివరీ తరువాత సాధారణంగా పొట్ట ముందుకు పెరుగుతుంది . పెళ్ళైన కొత్త లో పొట్ట ప్లాట్ గా ఉంటుంది ... ప్రేగ్నేన్సి తరువాత గర్భాశయం పైకి పెరుగు వస్తుంది . ఎత్తు ఎక్కువగా ఉన్నా స్త్రీలలో కటిభాగానికి , చాటికి గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భాశయం నేరుగా పైకి పెరుగుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నా వారిలో గర్భాశయం ముందుకు పెరుగుతుంది. ఇలా పెఫుగు తున్న గర్భాశయం ను పొందుపరచేందుకు కడుపు కండరాలు సాగుతాయి.
డెలివరీ తర్వాత గర్భాశయం యధాస్థానం లోకి వెళ్ళిపోతుంది ... కాని సాగిపోయిన కడుపు కండరాలు మాత్రము అలాగే ఉండిపోతాయి . కొంతవరకు మాతమే వెనక్కి ముడుచుకుంటాయి . మన కడుపులో ఉండేవి పేగులు . . అవి మన కడుపు కండరాలు బిగుతుగా ఉన్నఅప్పుడు కడుపులోనే తైట్ గా అమరి ఉంటాయి. కడుపు కండరాలు సాగిపోయినపుడు అవి గ్రావిటీ వల్ల ముందుకు పడతాయి. దాంతో పొట్ట ఎత్తుగా అవుతుంది. దాని పై వ్యక్తి బరువు పెరిగితే పొట్టలో జమఅయ్యే కొవ్వు వల్ల పొట్ట మరింత ఎత్తుగా కనబడుతుంది .
డెలివరీ తర్వాత బాగా విశ్రాంతి తీసుకోవడం, ఆహారం ఎక్కువగా తినడం వల్ల చాలామందికి బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. వాకింగ్, అబ్డామినల్ వ్యాయామాలు చేస్తూ, పరిమితమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల, ప్రసవమైన వెంటనే కాకపోయినా కొన్ని నెలలకు కడుపు సాధారణంగా చాలావరకూ అయిపోవచ్చు. ముఖ్యంగా కొవ్వు పెరగకుండా చూసుకోవాలి. యోగా ద్వార పొట్ట సంభందిత ఎక్సర్ సైజులు చేయాలి. డెలివరీ తర్వాత అబ్దోమినల్ బెల్ట్ కట్టుకోవాలి. కడుపులో గాలి కలిగించే ఆహారాలు తీసుకోకూడదు.సెల్లో తెరం ట్రీట్ మెంట్ కుడా ఉపయోగ పడుతుంది, ఇది బరువును తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
