Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
పాలు పట్టే దశలో తల్లికి అనారోగ్యం కలిగితే?

తీవ్రమైన గుండె వ్యాధుతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్ తో మనోవేదనకు గురైన వారు కూడా తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటువంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం శ్రేయస్కరం. తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమనేది ఎన్నో పరిశోధనలు నిరూపించాయి.కనుక మహిళలు అనవసరమైన అపోహలు వీడి బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. మహిళ కూడా అనేక కాన్పు తదనంతర ఆరోగ్య సమస్యలనుండి నివారించబడుతుంది.
శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు పాలు పట్టడంపై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు, ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా మంచిది.
బిడ్డను తొమ్మిది నెలలు మోసి తల్లి తన రక్తమాంసాలను పంచి ఇచ్చి బిడ్డకు జన్మనిస్తుంది. తొమ్మిది నెల ల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. ఇక ఆపై శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావడం ప్రారంభమవుతాయి. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఓ భాగంగా కొనసాగుతూ వస్తోంది. కనుక మహిళలు దీనిని గుర్తించి, తాము జన్మనిచ్చిన పిల్లల ఆరోగ్య రీత్యా, తమ ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా పుట్టిన వెంటనే బిడ్డకు పాలు పట్టడం మొదలుపెట్టాలి.



Click it and Unblock the Notifications
