Latest Updates
-
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే!
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు!
పెళ్లిళ్ల సీజన్ వచ్చినా, ఏదైనా శుభకార్యాలకు వెళ్లినా.. అక్కడ వడ్డించే భోజనం రుచే వేరు. అందులోనూ వేడి వేడి పూరీలతో పాటు వడ్డించే బంగాళాదుంప మసాలా కూర రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ కమ్మని వాసన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే బంగాళాదుంప మిశ్రమం, అక్కడక్కడా తగిలే జీడిపప్పు, పచ్చిబఠానీల రుచి మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఇలాంటి అద్భుతమైన రుచిని కేవలం ఫంక్షన్లలోనే కాదు, మన ఇంట్లో కూడా అంతే పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం పూరీలకే కాదు చపాతీ, దోశల్లోకి కూడా అదిరిపోయే కాంబినేషన్.

పూరీ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చి శెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10 నుండి 12
కరివేపాకు - 1 రెమ్మ
పచ్చిమిర్చి - 3
అల్లం తరుగు - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 2
పసుపు - అర టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 500 మి.లీ
బంగాళాదుంపలు - అర కిలో
శెనగపిండి - 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
క్యారెట్ ముక్కలు - పావు కప్పు
పచ్చి బఠానీలు - పావు కప్పు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
పాలు - పావు కప్పు
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
పూరీ మసాలా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు వేసి దోరగా వేయించాలి. అందులో జీడిపప్పు వేసి రంగు మారేంత వరకు వేయించాక.. కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రాకూడదు. ఇప్పుడు అందులో పసుపు, ఇంగువ, ఉప్పు వేసి కలిపాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత అర లీటరు నీళ్లు పోసి మరిగించాలి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా ఉడికించి చిదిమి పెట్టుకున్న
బంగాళాదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
కూర కాస్త చిక్కబడటం కోసం పావు కప్పు నీళ్లలో కలిపి పెట్టుకున్న
శెనగపిండి మిశ్రమాన్ని పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇష్టమైతే ఈ
దశలో పావు కప్పు పాలు పోసుకోవచ్చు.
-కూర పెళ్లిళ్లలో వడ్డించే కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే పూరీ మసాలా రెడీ. వేడివేడిగా పొంగిన పూరీలతో ఈ మసాలాను సర్వ్ చేస్తే, ఇంట్లో వాళ్లంతా వేళ్లు నాకుతూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications