Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా?
సృష్టిలోని సమస్త జీవకోటి కాలచక్రం నియమాలకు లోబడి నడవాల్సిందే. హిందూ ధర్మగ్రంథాలు, పురాణాల ప్రకారం.. కాలచక్రం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు ప్రధాన అంచెలుగా విభజించబడింది. ప్రస్తుతం మనం కాలచక్రంలో అత్యంత క్లిష్టమైన, ఆఖరి దశ అయిన కలియుగంలో జీవిస్తున్నాము. ఈ యుగం పేరు వినగానే అధర్మం, అన్యాయం, స్వార్థం, అణచివేత గుర్తుకువస్తాయి.
కలియుగంలో మానవుడు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి, అడ్డదారుల్లో పయనించడానికి ఎక్కువగా ఆకర్షితుడవుతున్నాడు. పనులన్నీ కనురెప్పపాటే వ్యవధిలో జరిగిపోవాలనే ఆరాటం, అత్యాశ మనుషులను మెషీన్లుగా మారుస్తున్నాయి. కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? భూమిపై ఇది ఎన్నో కలియుగం? యుగాంతం ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తాయి.

ముందుగా మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన వాస్తవం ఏమిటంటే.. భూమిపైకి కలియుగం రావడం ఇదే మొదటిసారి కాదు. విష్ణు పురాణం స్పష్టం చేస్తున్న ప్రకారం..సృష్టి ఆరంభం నుండి భూమి ఇప్పటికే 27 యుగ చక్రాలను పూర్తి చేసుకుంది. అంటే ఇప్పుడు మనం ఉన్నది 28వ కలియుగంలో. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన అనంతరం క్రీ.పూ. 3102 ప్రాంతంలో ఈ 28వ కలియుగం ఆరంభమైందని పురాణాలు చెబుతున్నాయి.
ఒక యుగచక్రం ముగిశాక మరో యుగచక్రం మొదలవ్వడం ప్రకృతి నియమం. ఈ కలియుగం ముగిసిన తర్వాత ధర్మం తిరిగి నాలుగు పాదాలపై నడిచే సత్యయుగం (స్వర్ణయుగం) మళ్లీ ఉద్భవిస్తుంది. అయితే అందుకు మనం ఇంకా ఎంతకాలం వేచి చూడాలి? అంటే హిందూ గ్రంథాల ప్రకారం కలియుగం మొత్తం జీవితకాలం 4,32,000 సంవత్సరాలు. ఇందులో మనం గడిపింది కేవలం 5,100 నుంచి 5,500 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ఈ శకం అంతమై, కొత్త యుగం మొదలవ్వడానికి ఇంకా లక్షలాది సంవత్సరాల సమయం ఉంది.

కానీ కలియుగాంతం సమీపించే కొద్దీ భూమిపై పరిస్థితులు అత్యంత భయానకంగా మారతాయి. విపరీతమైన కరువు కాటకాలు, అంతుచిక్కని వ్యాధులు, అమానవత్వం ప్రబలుతాయి. ఆశ్చర్యకరంగా మానవుల సగటు ఆయుర్దాయం కేవలం 12 నుంచి 20 ఏళ్లకు పడిపోతుందని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి. భూమిపై పాపం పండిపోయి, దుర్మార్గుల అకృత్యాలు మితిమీరిన ఆ మహా విపత్కర సమయంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం దాల్చుతాడు.
కల్కి పురాణం ప్రకారం.. ఒక బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. 64 విద్యల్లో ఆరితేరిన ఆ స్వామి, తెల్లని అశ్వంపై కూర్చుని, చేతిలో అత్యంత పదునైన ఖడ్గాన్ని ధరించి ఉగ్రరూపంలో వస్తాడు. ఆయన రాకతో దుష్టశక్తుల సంపూర్ణ వినాశనం జరిగి, ధర్మసంస్థాపన జరుగుతుంది. అయితే కల్కి రాకకు ఇంకా ఎంతో సమయం ఉంది.
నైతిక విలువలు క్షీణిస్తున్న ఈ ప్రస్తుత కాలంలో మనం ప్రశాంతంగా జీవించాలంటే ఆధ్యాత్మికతే దిక్సూచి. అణువణువునా ప్రతికూలత నిండి ఉన్న ఈ యుగంలో మానసిక ధైర్యం, స్థైర్యం, సానుకూల శక్తి లభించాలంటే చిరంజీవి ఆంజనేయ స్వామిని ఆరాధించడం అత్యుత్తమ మార్గం. నిత్యం హనుమాన్ మంత్రాలను జపించడం ద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అద్భుతమైన మానసిక శాంతి, బలం చేకూరుతాయి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులోని సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడంది. దీనిని నిరూపించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని నమ్మడం వ్యక్తుల వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications