Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది?
నాన్ వెజ్ ప్రియులందరినీ ఏకం చేసే ఒక ప్రత్యేకమైన వంటకం లివర్. ఇంట్లో వండినా, రెస్టారెంట్ లో ఆర్డర్ చేసినా లివర్ ఫ్రై, లివర్ మసాలా పేర్లు వింటేనే నోరూరిపోతుంది కొందరికి. కానీ లివర్ కేవలం నాలుకకు రుచినిచ్చే వంటకం మాత్రమే కాదు.. ఎన్నో అద్భుతమైన పోషకాలకు నిలయం. అయితే, ఆరోగ్యం విషయానికి వస్తే అందరిలోనూ ఒక సందేహం మెదులుతుంది. చికెన్ లివర్ తినాలా? మటన్ లివర్ తినాలా? ఏది తింటే ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుంది? అని.
చికెన్ లివర్ త్వరగా అరుగుతుందని కొందరంటే, మటన్ లివర్ లోనే అసలైన బలం ఉందని మరికొందరు వాదిస్తుంటారు. మరి ఇందులో ఏది నిజం? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.

చికెన్ లివర్
చూడటానికి పరిమాణంలో చిన్నగా ఉన్నా చికెన్ లివర్ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో సెలీనియం అనే ముఖ్యమైన మూలకం ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తుంది. అలాగే కంటిచూపును మెరుగుపరచడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన విటమిన్ A, విటమిన్ B12 ఇందులో పుష్కలంగా ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు సరైన పద్ధతిలో నూనె తక్కువగా వేసి వండుకుని తింటే, శరీరంలోని చెడు కొవ్వు సులభంగా కరుగుతుంది.
మటన్ లివర్
మటన్ లివర్ రుచికి చాలా మంది ఫిదా అవుతారు. ఎవరికైతే రక్తహీనత ఉండి తరచూ నీరసంగా అనిపిస్తుందో, వారికి ఇది ఒక అద్భుత ఔషధం లాంటిది. ఇది శరీరంలో రక్తాన్ని వృద్ధి చేసి, అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. జింక్, కాపర్, విటమిన్ డి ఇందులో మెండుగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి, రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. శారీరక బలాన్నిచ్చే అత్యుత్తమ ఆహారాల్లో ఇది ముందు వరసలో ఉంటుంది.
ఏది బెస్ట్ ఆప్షన్?
చికెన్, మటన్.. ఈ రెండు రకాలలోనూ ప్రోటీన్, ఐరన్ నిండుగా ఉంటాయి. మీకు జీర్ణకోశ సమస్యలు ఉన్నా, సులభంగా బరువు తగ్గాలనుకున్నా చికెన్ లివర్ ఎంచుకోవడం బెటర్. అదే మీ శరీరంలో రక్తం తక్కువగా ఉండి, తక్షణ బలం పుంజుకోవాలనుకుంటే మాత్రం మటన్ లివర్ పర్ఫెక్ట్ ఛాయిస్.
వీరు మాత్రం కాస్త జాగ్రత్త
లివర్ లో ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ, కొందరు దీనికి దూరంగా ఉండటమే మేలు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, దీర్ఘకాలికంగా అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దీనిని తీసుకోకూడదు. అలాగే ఇందులో విటమిన్ A మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకే మితంగా తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
