Latest Updates
-
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.!
ప్రసవం తర్వాత పని చేయడం మంచిదా...చెడ్డదా...?
ప్రసవం తర్వాత చాలా మంది డాక్టర్స్ మహిళలకు ఇచ్చే మొదటి సలహా కొత్త తల్లికి కనీసం రెండు.. మూడు వారాల పాటు రెస్ట్ అవసరం అంటారు. ఆ తర్వాత కొత్త తల్లి శరీరంలో మార్పులకు అనుగుంగా ఎటు వంటి సమస్య లేకపోయినట్లైతే వారిపరిస్థితులను బట్టి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళమంటారు. ఏదైనా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఆచరించడం ఉత్తమం. యాహు కంపెనీ చీఫ్ ఎక్సిక్యూటీవ్ మారిస్సా మేయర్ డెలివరీ అయిన రెండవ రోజు నుండి తన ఉద్యోగ బాద్యతలను స్వీకరించి పనిచేయడం మొదలు పట్టిందట. ఈ ఎక్సిక్యూటివ్ రెండవ రోజు నుండే ఇంటి నుండి వర్క్ చేయడం మొదలు పెట్టి వారానికో లేదా రెండు వారాలకొకసారి ఆఫీసుకు వెళ్లేవారట. కాబట్టి కొత్తగా తల్లి అయిన వారు ఉద్యోగస్తులైతే... డెలివరీ అయిన వెంటనే ఉద్యోగబాద్యతలు చేపట్టవచ్చా? డెలివారీ తర్వాత పని చేయడం వల్ల లాభ, నష్టాలు ఏంటో చూద్దాం....
ప్రసూతి సెలవులు తప్పనిసరి: ప్రసవం తర్వాత కొత్త తల్లికి తన పసిబిడ్డతో ఎక్కువ కాలం గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రసవం తర్వాత తల్లి రెండు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రసవం తర్వాత తన బిడ్డ తల్లిపాలను ఆరు నెలల వరకూ... కనీసం మూడు నెలల వరకైనా పట్టించాలి. ఇక రెండవది కొత్త తల్లికి కొన్ని రోజులు పాటు రెస్ట్ అవసరం. పనిచేసి ప్రతి మహిళకు రెండు లేదా మూడు నెలల పాటు మెటర్నీటి సెలవులు ఉంటాయి. ఆ సమయంలో ప్రసవం తర్వాత పోయిన ఎనర్జీలను, పూర్వపు శారీరక రూపాన్ని తిరిగి పొందేందుకు, పనిచేయడానికి కావలసిన శక్తిని పొందడానికి ఈ మెటర్నిటీ లీవ్ప్ తప్పనిసరిగా వినియోగించడంతో తల్లి.. బిడ్డకు క్షేమం. ప్రసవం జరిగిన ఒక నెల తర్వాత ఇంటి నుండి పనిచేసే సౌకర్యం ఉంటే అలా వర్క్ చేయడం ఉద్యోగస్తులకు ఒక మంచి ఆలోచనే...

ఆరు నెలలు విరామం? : గైనకాలజిస్టుల ప్రకారం ప్రసవం అయిన తర్వాత తల్లికి తన పనులను చక్కబెట్టుకోవాడనికి ఆరు నెలల బ్రేక్ అవసరం అంటుంటారు. ఒక వేళ సిజేరియన్ డెలివరీ అయితే కనుక కుట్లు మానడానికి కొత్త టైమ్ పడుతుంది. కాబట్టి అటువంటి సమయంలో డాక్టర్ సలహా తప్పక పాటించాలి. పనిచేయడం, ఎక్కువగా నడవడం వంటివి చేస్తే సిజేరియన్ కుట్లు మానక, ఇన్ఫెక్షన్ అయ్యి, విపరీతమైన నొప్పితో బాధపడాల్సి వస్తుంది. చాలా మంది మహిళలు ఇవేవి పట్టించుకోకుండా ఆరు నెలలు ముగయకుండానే పని మొదలు పెట్టేస్తారు. కాబట్టి పని అవసరాన్ని బట్టి ఇంట్లో వారి సహకారంతో వర్క్ చేసుకోవచ్చు.
ఒత్తిడి: ప్రసవం తర్వాత ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని, ఒకటి... రెండు వారాల తర్వాత పనిచేయడం మొదలు పెడితే... పని భారంతో ఒత్తిడి పెరుగుతుంది. దాంతో కొత్తగా తల్లి అయిన వారికి చాలా హానీ కలిగిస్తుంది. కాబట్టి అందుకు తగ్గ ఆహార పదార్థాలను, పండ్లును ఎక్కువగా తీసుకొని, వర్క్ లోడ్ తగ్గించుకోవాలి. ఉద్యోణి ఫిజికల్ గా ఏదైనా చేయాలకున్నప్పుడు తప్పనిసరిగా ఒక నెల రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది.
శిశు పోషణ: ప్రసవం తర్వాత పనిచేయాల్సి వచ్చినప్పుడు ఇంటి నుండి పనిచేయడం ఉత్తమమైన మార్గం ఎందుకంటే. పుట్టిన శిశువుకు తల్లి పాలు పట్టడం వల్ల బిడ్డ ఆరోగ్యానికి, పెరుగుదలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ప్రసవం తర్వాత బిడ్డను చూసుకోవడానికి మరో వ్యక్తిని పెట్టుకొంటారు. అయితే తల్లి తన బిడ్డను చూసుకోవడం బ్రెస్ట్ ఫీడింగ్ తో బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుంది. బుడ్డీ పాలను లేదా స్పూన్ ఫీడింగ్ తో బిడ్డ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇంటి నుండి పనిచేస్తూనే బిడ్డను కాపాడుకోగలరు.
పని గంటలు తగ్గించుకోవడం: ప్రసవం తర్వాత వెంటనే పనిచేయాల్సి వచ్చినప్పుడు, పనిచేసే గంటలు ఎక్కువగా ఉండకుండా మీరు ఎంత మేర శ్రమ పడగలరో అన్ని పనిగంటల మాత్రం చేయాల్సి ఉంటుంది. మెటర్నిటీ సెలవుల వల్ల మీ పని గంటలు కూడా తగ్గుతాయి. ప్రసవం తర్వాత శరీరం పూర్వాస్థితికి మారడానికి కనీసం నాలుగు నుండి ఆరు వారాల సమయం పడుతుంది కాబట్టి ఎక్కువ పనిగంట పనిచేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ప్రసవం తర్వాత పనిచేయాల్సి వచ్చినప్పుడు అందువల్ల కలిగే లాభ.. నష్టాలను గుర్తుంచుకొని అనుకూలంగా మార్చుకొని పనిచేయవచ్చు...



Click it and Unblock the Notifications