Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ప్రసవం తర్వాత శరీర దుర్వాసనను నివారించే చిట్కాలు..!
సాధారణంగా చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమ ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ తీసుకోరు. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు ప్రసవం జరిగిన తర్వాత వారు తీసుకోకపోవడంతో మహిళల్లో పలురకాల ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డెలివరీ తర్వాత స్త్రీలలో ఇన్‌ఫెక్షన్, జ్వరం రావడం, యూరినరీ ప్రాబ్లమ్స్, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, నరాల్లో రక్తం గడ్డ కట్టడం, హార్మోనులలో మార్పుల వల్ల శరీరంలో దుర్వాస వంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ తర్వాత మహిళలు ప్రసవానంతర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భధారణ వల్ల జీవన శైలితో పాటు శరీరంలో అనేక మార్ఫులకు చోటు చేసుకుంటుంది. కానీ ఈ మార్పులు అనేక ఉత్తేజకరమైన మరియు ఆనందించేవై ఉంటాయి. కొందరికి మాత్రం విరుద్దుగా ఉంటాయి. ప్రసవం తర్వాత శరీరంలో అనేక మార్పులు ఏర్పడుతాయి వాటిలో శరీరం నుండి చెడు వాసన రావడం కూడా ఒక సమస్య. గర్భధారణ మరియు ప్రసవం తర్వాత శరీర ఆరోగ్యం మీదే ఈ సమస్య ఆధారపడి ఉంటుంది.
గర్భిణీ స్త్రీలో శరీరంలో వాసనలో మార్పు రావడానికి అనేక కారణాలున్నాయి. ఇటువంటి సమస్యలకు ప్రధాన కారణం హార్మోనుల ప్రభావమే. హార్మోనుల్లో మార్పులు రావడం, మరియు శిశువులకు పాలు పట్టడం వల్ల ప్రసవం తర్వాత స్త్రీలో ఒకరమైనటువంటి వాసనలు వెలువడుతాయి. ప్రసవం తర్వాత ఇలా శరీరం నుండి వాసనలు రావడానికి మరో కారణం చెమటలు పట్టడం, చెమటలు అధికం అవ్వడం. శిశువుకు పాలు పట్టే సమయంలో, గర్భిణీ జీవక్రియల్లో మార్పు రావడం వల్ల శరీరంలో అధిక ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాంతో అధిక చెమటలు పెరగడం, శరీరం నుండి వాసనలు పెరగడం జరుగుతుంది. మరి ఈ సమస్యను నివారించాలంటే కొన్ని సులభమైన నివారణోపాయాలున్నాయి. వాటిని ఫాలో అయితే చాలు ప్రసవం తర్వాత కూడా స్త్రీ తాజాగా మరియు ఆరోగ్యంగా ఉండగలరు.

శుభ్రత పాటించడంలో మీ గురించి మీరు శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం: శరీరం నుండి వెలువడే వాసనకు దూరంగా ఉండాలంటే ప్రతి రోజూ తప్పకుండా స్నానం చేయడం చాలా ముఖ్యం. మీ శిశువు కేర్ తీసుకోవడంలో బిజీగా ఉన్నా, మీకున్న సౌలభ్యం ప్రకారం స్నానానికి షెడ్యూల్ చేసుకోవాలి. శిశువు నిద్రించే టైమ్ లో మీరు స్నానం చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా బిగుతైన దుస్తులను ధరించకూడదు. దాంతో మీ శరీరంలో చెమటలు పట్టవు. గర్భిణీ స్త్రీ ఒక్క సారి ధరించిన దుస్తులు ప్రతి సారి వాష్ చేయడం చాలా అవసరం.
నిమ్మను ఉపయోగించాలి: ప్రసవం తర్వాత గర్భిణీ స్నానం చేసే నీటిలో నిమ్మరసం కొన్ని చుక్కలు కలపడం వల్ల శరీరం నుండు వెలువడే వాసనలు అధిగమించడానికి ఇది బాగా సహాయం చేస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్: చర్మం యొక్క pH స్థాయిని తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా సహాయపడుతుంది. ఇది ప్రసవానంతరం వచ్చే శరీరపు వాసనను తగ్గిస్తుంది.
హోం మేడ్ డియోడరెంట్: శరీర వాసనను నివారించడానికి ఇంట్లోనే డియోడరెంట్ ను తయారు చేసుకోవచ్చు. అందుకు కొన్ని రాడిష్ లలో అర టీస్పూన్ గ్లిసరిన్ మిక్స్ చేసి బాటిల్ నింపుకొని ఉపయోగించుకోవాలి. దీన్ని ఫ్రిజ్ లో పెట్టడం మర్చిపోకండి. లేదా టీ ట్రీ ఆయిల్ ను నేచురల్ డియోడరెంట్ గా ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల ప్రసవం తర్వాత శరీరం నుండి వచ్చే దుర్వాసనను తగ్గించడానికి సహాయపడతుంది. ఒక బాటిల్ లో కొద్దిగా నీళ్ళు పోసి అందులో కొన్ని చుక్కలు టీట్రీ ఆయిల్ వేసి స్ప్రేలా ఉపయోగించుకోవచ్చు.
మింట్ వాటర్: దుర్వాసనను నివారించడంలో పుదీనా ఆకలు అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని పుదీన ఆకులను కొన్ని నీళ్ళలో వేసి బాగా ఉడికించి, చల్లార్చి పెట్టుకోవాలి. ఈ నీటిని ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకొని స్నానం చేస్తే దుర్వాసనుండి బయటపడవచ్చు.
తేనె: నీళ్ళలో ఒక చెంచా తేనెను మిక్స్ చేయాలి. ఈ నీటిని మీ స్నానం పూర్తి అయిన తర్వాత చివరగా శరీరం మీద పోసుకొని రావాలి. ఇది చర్మాన్ని స్మూత్ గా ఉంచడమే కాదు మరియు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. వీటితో పాటు శరీరం నుండి వాసన తగ్గించేందుకు సహాయపడుతుంది.
ఆహారం: శరీర దుర్వాసనకు కారణం అయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యానికి మరియు శిశువు ఆరోగ్యానికి కావల్సిన పోషకాహారాన్ని తీసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, ఆల్కహాల్, కెఫిన్, అధికంగా మాంసాహారం తీసుకోవడం మరియు ఫైబర్ తక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా దుర్వాసనను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications