Latest Updates
-
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే!
శిశువు బొడ్డు తాడును ఇలా పరిరక్షించండి
తల్లి కడుపులో ఉన్న గర్భస్థ శిశువుకి పోషకాహారాలు తల్లి గర్భాశయానికి అతుక్కుని ఉన్న ప్లాసెంటా నుంచి అందుతాయి. గర్భస్థ శిశువు ఎదుగుదలలో బొడ్డు తాడు ప్రధాన పాత్ర పోషిస్తుంది. గర్భస్థ శిశువుకు అవసరమైన పోషకాలు అందేందుకు బొడ్డు తాడు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. శిశువు జన్మించిన తరువాత బొడ్డు తాడు ద్వారా పోషకాలు అందే ప్రక్రియ ఉండదు. శిశువుకు నొప్పి లేని విధంగా బొడ్డు తాడును తీసేస్తారు.
బొడ్డు తాడు ఉండే ప్రాంతంలో స్టంప్ ని ఉంచుతారు. కొద్ది రోజులకు ఎండిపోయి మూడు వారాల తరువాత అది ఊడిపోతుంది. కొన్ని ప్రత్యేక సంరక్షణ పద్దతులను పాటించడం ద్వారా శిశువు బొడ్డు తాడును పరిరక్షించవచ్చు. శిశువు బొడ్డు తాడును పరిరక్షించే బాధ్యతను అత్యంత ప్రాముఖ్యత కలిగిన బాధ్యతగా గుర్తించాలి.

స్నానం చేయించేటప్పుడు: శిశువుకు స్నానం చేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా స్నానం చేయించిన తరువాత తడి ఆరేవరకు తుడవాలి. శిశువుకు స్నానం చేయించాలి అనుకునేటప్పుడు స్పాంజ్ బాత్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. టబ్ బాత్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి. బొడ్డు తాడు మరీ తడిగా మారకుండా జాగ్రత్తలు తీసుకోండి. తడిగా మారిన బొడ్డు తాడు వల్ల శిశువుకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. శిశువుకు అసౌకర్యాన్ని కలిగించకుండా చూడడం మన బాధ్యత కాబట్టి స్నానం చేయించేటప్పుడు అతి జాగ్రత్తగా వ్యవహరించండి.
బొడ్డు తాడును శుభ్రపరిచేటప్పుడు: కొంతమంది బొడ్డు తాడు ఊడిపోయేవరకు శిశువుకు స్నానం చేయించడానికి ఇష్టపడరు. అటువంటి వారు కొద్దిగా నీటిలోని స్పాంజ్ ని ముంచి శిశువు బొడ్డు దగ్గర సున్నితంగా క్లీన్ చేయాలి. శుభ్రమైన దూదితో ఆ ప్రాంతాన్ని తుడవాలి. శిశువుకి అసౌకర్యం కలగకుండా బొడ్డు తాడుని జాగ్రత్తగా పరిరక్షించడంలో ఈ పద్దతి ముఖ్యమైనది.

బట్టలు వేసేటప్పుడు : శిశువుకు వేసే దుస్తులు సౌకర్యవంతంగా కొంచెం వదులుగా ఉండాలి. డైపర్ వేసేటప్పుడు బొడ్డు తాడు కంటే క్రిందకే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే శిశువు హాయిగా ఉంటుంది. బొడ్డు తాడు ఎండి ఊడిపోయే కొద్దీ కొద్దిగా రక్తం చిందే ఆస్కారం ఉంది. అటువంటప్పుడు అందుబాటులో కొన్ని క్లోత్స్ ను ఉంచుకోండి. శిశువు బొడ్డు తాడుకు తీసుకోవలసిన జాగ్రత్తలలో ఇది కూడా ముఖ్యమైనది.
బొడ్డు తాడు ఊడే వరకు : స్నానం చేయించేటప్పుడు, శిశువును శుభ్రపరిచేటప్పుడు, దుస్తులు వేసేటప్పుడు ఇంతకు ముందు చెప్పుకోబడిన జాగ్రత్తలన్నీ శిశువు బొడ్డు తాడు దానంతట అది ఊడిపోవడానికేనని తెలుసుకోండి. శిశువు బొడ్డు తాడు ఊడిపోయే ముందు పసుపుపచ్చతో కూడిన ఆకుపచ్చ రంగు నుంచి బ్రౌన్ కలర్ కి మారి చివరకు నలుపు రంగులోకి మారుతుంది. ఊడిపోయే దశలో ఉన్నప్పుడు కూడా మీరు దానిని గట్టిగా లాగడానికి ప్రయత్నించకండి. దానంతటది పూర్తిగా ఊడిపోయే వరకు వేచి చూడండి.

ఇన్ఫెక్షన్స్ మరియు నివారణలు : హీలింగ్ ప్రాసెస్ కు కనీసం 3 వారాలు పడుతుంది. ఈ సమయంలో బొడ్డు తాడు వద్ద కొంచెం రక్తం కనిపించవచ్చు. ఒకవేళ శిశువుకు జ్వరం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. త్వరగా బొడ్డు తాడును తీసివేసినా రక్తస్రావం కనిపించే అవకాశాలు కలవు.
ఉమ్బిలికల్ గ్రనులోమా : కొన్ని సార్లు, బొడ్డు తాడులో ఎరుపు రంగు మచ్చలు కనిపించి అందులోంచి పసుపురంగులో కూడిన ద్రవం బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి కంగారు పడనవసరం లేదు. దానంతటదే ఒక వారం తరువాత క్యూర్ అయిపోతుంది. ఒక వేళ, సమస్య ఇంకా కొనసాగితే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. అవసరమైన చికిత్సను వైద్యుడు అందిస్తారు. శిశువుతో పాటు శిశువు యొక్క బొడ్డు తాడు పరిరక్షణకు ఇది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.



Click it and Unblock the Notifications
