Latest Updates
-
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.!
పాలిచ్చే తల్లులు తినాల్సినటువంటి అత్యుత్తమ ఆహారాలు
బేబీకి పాలు పట్టడం అనేది ఒక ప్రధానమైన పని. శిశువు కడుపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలలు తల్లితీసుకొనే న్యూట్రీషియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, కొత్తగా తల్లైన వారు, ముఖ్యంగా పిల్లలకు తల్లిపాలను పట్టే వారు, తినే ఆహారం మీద తగినంత శ్రద్ద కలిగి ఉండాలి.
బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మీరు ఏమి తినాలి, ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి, సంప్రధాయ, అలాగే ఆధునికంగా విరుద్ద సలహాలు టన్నుల్లో కనుగొన్నారు. మరియు పెద్దలు చెప్పడం వింటూనే ఉంటారు. కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఈ దశలో మీ శరీరంకు కావల్సిన పోషకాంశాలను అందివ్వడంలో ఏమాత్రం రాజీ పడకండి.
తల్లి ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ ద్వారా మీ శిశువు పూర్తి పోషకాలను పొందుతారు కాబట్టి, పాలిచ్చే తల్లులు పోషకాంశాలు అధికంగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఈ ఆహారాలు తల్లిలో పాలు పడటంతో పాటు, తల్లి, బిడ్డకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
తల్లిలో పాలు బాగా పడాలంటే తినండి 10 బెస్ట్ ఫుడ్స్
శిశువుకు పాలు పట్టే తల్లులు స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. అయితే, మీరు తీసుకొనే ఆహారాల్లో, పాలిచ్చే తల్లిలో పాలు ఉత్పత్తికి సహాయపడే అధనపు క్యాలరీలను అంధించే, తక్కువ కారం ఉన్నఆహారాలను తీసుకోవాలి. పాలిచ్చే తల్లులు కారంగా ఉన్న ఆహారాలను నివారించడం ఉత్తమం. ఎందుకంటే, అదినేరుగా పిల్లల మీద ప్రభావం చూపుతుంది. అది పిల్లల్లో జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈక్రింది స్లైడ్ లో తెలిపిన ఆహారాలను పరిశీలించి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లులు వీటిని తీసుకోవడం ఉత్తమం.

వెజిటేబుల్స్
బేబీకి పాలు పట్టే సమయంలో వెజిటేబుల్స్ ఒక ఉత్తమ ఎంపిక. వెజిటేబుల్స్ లో ముఖ్యంగా బ్రొకోలీ, బెల్ పెప్పర్, స్వ్కాష్ మరియు బీన్స్ వంటివి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు బెస్ట్ డైట్ ఆఫ్షన్స్.

పండ్లు
పాలిచ్చే తల్లులకు మరో ఉత్తమ ఆహారాలు న్యూట్రీషియన్ మరియు ఫైబర్ అధికంగా ఉన్నపండ్లు తీసుకోవడం వల్ల హెల్తీ క్యాలరీలను అంధిస్తుంది. అందుకు ఆపిల్స్, బెర్రీస్, ఆరెంజ్, పీచెస్ వంటివి తినాలి.

తృణధాన్యాలు
తృణధాన్యాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లులకు చాలా అవసరం. కాబట్టి, పాలిచ్చే తల్లులు, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కర్జూరం వంటివి సాంప్రధాకరంగా పాలిచ్చే తల్లుకు అంధించేటటువంటి హై క్యాలరీ పోషకాహారం. డ్రైడ్ ఫ్రూట్ శరీరంలో క్యాలరీ కంటెంట్ పెంచడంలో బూస్ట్ వంటిది. ఇవి కొత్తతల్లిలో పాలను ఉత్పత్తికి సహాయపడుతాయి.

నెయ్యి
పాలిచ్చే తల్లలకు ఇది ఒక ట్రెడిషనల్ ఆహారం. నెయ్యి కూడా క్యాలరీల కౌంట్ ను మరియు ఫ్యాట్ ను పెచుతుంది. ఇది పాలిచ్చే తల్లులకు శక్తిని అంధిస్తాయి.

హెల్తీ డ్రింక్స్
పాలిచ్చే తల్లులు ఏరియేటెడ్ డ్రింక్స్(కార్బోనేటెడ్) ను నివారించాల్సి ఉంటుంది.ఆరోగ్యకరమైన ఫ్రూట్ జ్యూస్ లు మరియు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ద్వారా ఇవి మిమ్మల్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. ఇవి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు చాలా అవసరం.

చేపలు
బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు ఫిష్ ఒక పోషకాహారం. వీటిలో ఎసెన్షియల్ ఫ్యాట్స్ మరియు ఆయిల్స్ ఉంటాయి. ఇవి కొత్త తల్లికి కానీ, శిశువుకు కానీ ఎటువంటి హానీ తలపెట్టవు.కాబట్టి, మసాలా ఎక్కువగా ఉపయోగించకుండా చాలా సింపుల్ డిష్ కు ప్రిఫరెన్స్ ఇవ్వండి.

పాలు మరియు పాల ఉత్పత్తులు
ఆవు పాలను తగినంత తీసుకోవడం మంచిది. మరియు కొన్ని డైరీ ప్రొడక్ట్స్ బట్టర్, చీజ్, పెరుగు వంటివి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

హెర్బల్ టీ
హెర్బల్ టీ కూడా కొన్ని సందర్భల్లో తీసుకోవడం మంచిదే. అందులోనే పిప్పర్మెంట్, చమోమోలిన్, మరియు అల్లం టీ వంటివి పాలిచ్చే తల్లులకు చాలా సురక్షితమైనవి.



Click it and Unblock the Notifications