Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఆ భాగాల్లో వచ్చే సహజ మార్పులు!

ఆ భాగం తేమగా వుండటానికి ద్రవం తయారవుతుంది. దీనినే డిశ్చార్జి అంటారు. అండర్ వేర్ లో పసుపు లేక వైట్ మరకలు కనపడుతూంటే 6 నుండి 18 నెలల కాలంలో మీకు పిరియడ్స్ మొదలవుతాయని చెప్పాలి. డిశ్చార్జి ఎక్కువగానూ వుండవచ్చు. లేదా అతి కొద్దిగా కూడా వుండచ్చు. ఇన్ ఫెక్షన్ కలిగితే చెడు వాసన కలిగి మీకు మంట పుట్టిస్తుంది. కనుక వైద్యుడిని సంప్రదించండి. మొదటి రెండు సంవత్సరాలు మీ పిరీయడ్ క్రమంలో వుండదు. ఈ పిరీయడ్స్ వచ్చే దశను నాలుగు భాగాలుగా చెప్పాలి.
మొదటి భాగం మెన్సెస్ లేదా పిరీయడ్ అవటం. ఈ ధశలో మీ శరీరం దానికవసరంలేని కణాలు వదిలించుకుంటుంది. గర్భాశయంలోని లైనింగ్ పగిలి అనవసరమైన కణాలు యోని ద్వారా రక్తంతోపాటు పోతాయి. రక్తస్రావం అధికమనుకుంటారు కాని అది సుమారు 6 నుండి 9 టేబుల్ స్పూన్ లు వుంటుంది. ఈ స్రావంలో ముక్కలు, గడ్డలు కూడా వచ్చే అవకాశం వుంది.
రెండవ భాగంలో పిరీయడ్ పూర్తయి మీ శరీరం ప్రెగ్నెన్సీకి సిద్ధంగా వుంటుంది. మీ అండాశయం ఒక గుడ్డును తయారు చేస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ గర్భాశయంలోని లైనింగ్ పునర్నిర్మిస్తుంది.
మూడవ భాగంలో హార్మోన్లు గర్భాశయాన్ని గుడ్డును ఫేలోపియన్ ట్యూబులలోకి పంపమని కోరతాయి. ఇదే సమయంలో గుడ్డు ఫలదీకరణ చెందేందుకు గర్భాశయంలోని లైనింగ్ మరింత గట్టిగా తయారవుతుంది. అండోత్సర్గం సాధారణంగా మీ తర్వాత పిరీయడ్ మొదలయ్యే ముందు 14 రోజులలో జరుగుతుంది.
నాల్గవ భాగంలో గుడ్డు కనుక ఫలదీకరణ చెందకపోతే, గర్భాశయం దాని లైనింగ్ ను రిలీజ్ చేయటానికి సిధ్ధం అవుతుంది. ఈస్టరోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ల స్ధాయి పడిపోతుంది మీరు మరో కొత్త మెన్సెస్ పిరీయడ్ కు సిద్ధం అవుతారని చెపుతూ గర్భాశయం లైనింగ్ పడిపోతూ యోని భాగం ద్వారా రక్తస్రావంగా బయటకు వచ్చేస్తుంది.



Click it and Unblock the Notifications
