Latest Updates
-
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే! -
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా? -
వినాయకుడు ఏకదంతుడు ఎందుకు అయ్యాడు? అసలు కథ -
ప్రోటీన్, క్యాల్షియం గని ఈ లడ్డు..రోజుకొక్కటి తింటే మీ శరీరానికి కొండంత బలం! -
లవ్ బైట్ ప్రాణాలు తీస్తుందా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
తక్కువ మటన్ తో ఎక్కువ గ్రేవీ..రుచిలో అదిరిపోయే తెలంగాణ ప్రాచీన వంటకం మటన్ దప్పలం -
భాగస్వామి ఫోన్ ను పదే పదే చెక్ చేయడానికి అసలు కారణాలివే..!
గర్భవతి మహిళలో మలబద్ధకం సమస్యలు!

గర్భవతి సమయంలో ఏర్పడే అజీర్ణం సమస్యలకు కారణాలు
జీర్ణక్రియ ఆలస్యమవుతుంది - శరీరంలో ప్రొజెస్టిరోన్ హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది కనుక అది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా మలబద్ధకం ఏర్పడుతుంది. పెరుగుతున్న బిడ్డ మరోవైపు పేగులపై ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కారణంగా గర్భంపై ఒత్తిడి పెరిగి పేగుల కదలికలను నిదానించి, జీర్ణక్రియ మందగించి, మలబద్ధకం కలిగిస్తుంది.
నీటికొరకు డిమాండ్ అధికం - కడుపులో బేబీ పెరిగే కొలది, ఆమెకు నీటి అవసరాలు పెరుగుతాయి. బేబీ నీటి అవసరం కొరకు తల్లి శరీరంలోని ద్రవాలు బిడ్డకు వెళ్ళిపోతాయి. దానితో తల్లిలో ద్రవాలు కొరత ఏర్పడి మలం గట్టిగా అవుతుంది. దానిని తొలగించాలంటే ఆలస్యమవుతుంది.
సరికాని ఆహారం - గర్భవతి మొదటి త్రైమాసికంలో, సంతులిత ఆహారాన్ని తీసుకోదు. నోటి రుచి మారిన కారణంగా సరిగా తినలేకపోతుంది. మార్నింగ్ సిక్ నెస్ ఏర్పడుతుంది. ఇది కూడా మలబద్ధకాన్ని ఏర్పరుస్తుంది.
చురుకుకాని జీవన విధానం - గర్భవతి అయ్యామనే సరికి స్త్రీలు, సోమరిగా కూర్చోవటం మొదలుపెడతారు. పని అధికంగా చేయరు. ఎల్లపుడూ కూర్చుని లేదా పడుకుని వుంటారు. ఈ రకమైన శారీరక కదలిక లేకపోవటం కూడా మలబద్ధకాన్ని కలిగిస్తుంది. అంతేకాదు ఈ రకమైన జీవన శైలిలో ఆమెకు సాధారణ యోని కాన్పు అయ్యే అవకాశాలు కూడా వుండవు.
ఒత్తిడి - ఒత్తిడి, ఆందోళన కూడా మలబద్ధకాన్ని ఏర్పరుస్తాయి. కనుక ఒత్తిడి, ఆందోళన పరిస్ధితులనుండి దూరంగా వుండాలి.
ఐరన్ మాత్రలు - ఈ సమయంలో డాక్టర్లు ఐరన్ మాత్రలు వేయమంటారు. ఇవి కూడా మలబద్ధకం కలిగిస్తాయి. గతంలో మలబద్ధకంతో బాధపడే మహిళలకు గర్భవతి సమయంలో అది మరింత అధికమవుతుంది.
మలబద్ధకాన్ని ఎలా నివారించాలి?
నీరు తాగండి - నీటిని అధికంగా తాగండి. రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగటం సూచించదగినది. దీనితో మీ మరియు మీ బేబీ నీటి అవసరాలు తీరుతాయి. నీరు మాత్రమే కాక, పండ్లు, కూరల రసాలు, మజ్జిగ, సూప్ లు, కొ్బ్బరి బొండాం నీరు, నిమ్మనీరు, వంటి రసాలు తాగాలి.
ఆహారంలో పీచు - శరీరంలో పీచు ప్రధాన పాత్ర వహిస్తుంది. అది మీ మలానికి అధికంగా ఉంటుంది. తేలికగా బయటకు తెప్పిస్తుంది. పీచు సహజంగా వుండే, పండ్లు, కూరలు, గింజలు తినండి.
వ్యాయామం - ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వుంటే, అది జీర్ణక్రియకు ఎంతో తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కనుక వైద్యుల సలహాపై వ్యాయామాలు చేయండి. వ్యాయామం ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని పెంచి, సహజంగా కాన్పు అయ్యేలా చేస్తుంది. స్విమ్మింగ్, నడక వంటివి వైద్యులు వద్దు అంటే తప్ప, కొనసాగించండి.
ఒత్తిడి తగ్గించుకోండి - ఒత్తిడి, ఆందోళనలకు సాధ్యమైనంత దూరంగా వుండాలి. ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులు పాటించండి. ఇవి మీకే కాక, బేబీ ఎదుగుదలకు కూడా తోడ్పడతాయి.
ఈ చిట్కాలు మీ ఆహారంలోను, జీవన విధానంలోను ఆచరిస్తే, మలబద్ధకం పూర్తిగా తొలగి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.



Click it and Unblock the Notifications