Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భవతులకు పార్టీలలో ఆరోగ్యకర పానీయాలు!

గర్భవతి మహిళకు పార్టీ పానీయాలు
మాక్ టెయిల్స్ - పార్టీ సమయంలో వైన్ గ్లాసులలో మిక్సెడ్ ఫ్రూట్ జ్యూస్ ఆనందాన్నిస్తుంది. వీటిలో ఆల్కహాల్ వుండదు. ఆర్టిఫిషియల్ రంగులు, వాసనలు కూడా వుండవు. సాధారణంగా ఆరెంజి, స్ట్రాబెర్రీ, పైన్ ఆపిల్, లెమన్ వంటివి కలిపి తాగవచ్చు. ఇవి ఆల్కహాల్ కు సురక్షిత ప్రత్యామ్నాయాలు.
లస్సి - పెరుగుతో తయారు చేసే పంజాబి లస్సీలు ఆరోగ్యానికి మంచివి. వీటిలో బెర్రీలు, పైన్ ఆపిల్, కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తే తాగటం ఎంతో ఆనందాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిలో వేసే పండ్లు, ఐస్ ముక్కలు గుటక వేస్తే చాలు మరీ మరీ తాగాలనిపిస్తాయి.
ఫ్రూట్ పంచ్ - పనస, బొప్పాయి తప్ప ఇతర పండ్ల రసాలు మంచి మినరల్ వాటర్ చేర్చి తాగవచ్చు. ఒక్క గ్లాసు తాగితే ఎన్నో పోషకాలు లభిస్తాయి. వెజిటబుల్ రసాలను కూడా తాగవచ్చు.
చల్లటి మజ్జిగ - పండ్లరసాల వంటివి అధికం అనిపిస్తే సహజమైన చల్లటి మజ్జిగ రాత్రి వేళ పార్టీలలో మంచి జీర్ణక్రియను కూడా ఇస్తుంది. దీనిలో కొద్దిపాటి కొత్తిమీర, పుదీనా, అల్లంముక్కలు చేరిస్తే రుచి, వాసనలు బాగా వుంటాయి. రుచికిగాను షుగర్ లేదా సాల్ట్ వేయండి. పొట్టకు చల్లదనం, జీర్ణ సంబంధిత సమస్యలుండవు,
హాట్ చాక్లెట్ - గర్భిణీ స్త్రీ కనుక చాక్లెట్ ఇష్టపడే వారైతే, హాట్ చాక్లెట్ కాఫీ ఇచ్చేయండి. ఆమెకు హుషారు కలిగించటమే కాదు మైండ్ కు విశ్రాంతినిచ్చి, శక్తినిస్తుంది.



Click it and Unblock the Notifications