Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
యోనిద్వారా సహజ జననం చేయాలంటే?

1. గర్భం ధరించింది మొదలు ఆరోగ్యంగా వుండేందుకు ప్రయత్నించండి. బేబీని ప్రసవించడమంటే, 40 ఏనుగులను లాగటం వంటిదని చెపుతారు. కనుక మీలో పోషకాహారలేమి లేకుండా బలంగా ఆరోగ్యంగా వుండేలా చూసుకోండి.
2. బాగా తినండి. సరైన ఆహారాలు భుజించండి. ఆకలి తీరటానికి లేదా కోరింది తినేస్తేనూ చాలదు. మీ వైద్యులు ఇచ్చే ప్రణాళిక మేరకు పూర్తి పోషకావసరాలు కలిగిన ఆహారం తినండి. ప్రెగ్నెన్సీ మీలోని ఐరన్, కాల్షియం రక్తస్రావంలో బయటకు లాగేస్తుంది. అందుకని అధికమైన వీటి మొత్తాలు మీలో కలిగి వుండాలంటే, ఐరన్, కాల్షియం కల ఆహారాలు అధికంగా తినాలి.
3. నీరు అధికంగా తాగండి - మీగర్భసంచిలోని ఉమ్మనీరుకుగాను మీరు నీరు అధికంగా తాగాలి. పుట్టబోయే మీ బేబీ నీటి సంచిలో వుందని గ్రహించండి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి.
4. చురుకుగా కదులుతూ వుండండి - మీరు గర్భవతులని జబ్బుపడ్డవారు కాదని గుర్తించండి. సాధారణ విధులకు హాజరవండి. మీరు ప్రసవించే చివరి రోజు వరకూ కదులుతూ వుండవచ్చు. ఇది సహజ ప్రసవానికి ఎంతో అనుకూలం.
5. వ్యాయామాలు చేయండి. ప్రతిరోజూ మీ కండరాలను సాగదీసే వ్యాయామాలు సహజ ప్రసవానికి అనుకూలంగా వుంటాయి. ప్రత్యేకించి యోని కండరాల సంకోచ వ్యాకోచాలు గర్భంలోని బేబీని బయటకు పంపటానికి సహకరిస్తాయి.
6. శారీరకంగా సిద్ధంగా వుంటే చాలదు. మీరు మానసికంగా కూడా ప్రసవ నొప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. నేటి రోజుల్లో ఆస్పత్రులలో గర్భిణీలకు తరగతులు నిర్వహిస్తున్నారు. వాటికి హాజరై విషయాలను అవగాహన చేసుకోండి. ప్రసవ నొప్పులకు భయపడి వైద్యులను సిజేరియన్ చేయమని కోరవద్దు.
పై చిట్కాలు పాటిస్తే మీకు యోనిద్వారా సహజ జననం అవుతుంది. మీ బిడ్డ ఆనందంగా మీనుండి బయటకు వచ్చేస్తాడు.



Click it and Unblock the Notifications
