Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మహిళ త్వరగా గర్భం ధరించాలంటే?

మీ ఫలదీకరణను తగ్గించే కారణాలు అనేకం ఉంటాయి. ఫలదీకరణను వ్యతిరేకంగా ప్రభావించే కొన్ని చెడు అలవాట్లను మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే ఆచరిస్తూ వుంటాం. వాటిని మనం మార్పు చేసుకోగలిగితే, సంతాన సఫలత కలగటమే కాక పుట్టే సంతానం కూడా ఎంతో ఆరోగ్యకరంగా వుంటారు. సంతాన సఫలతను వ్యతిరేకంగా ప్రభావించే అంశాలు కొన్ని చూడండి.
పొగతాగడం - పొగతాగడం మహిళ శరీరంలోని ఫేలోపియన్ ట్యూబులను, గర్భాశయాన్ని పాడు చేస్తుంది. గర్భవిచ్ఛిన్నాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కనుక పొగతాగేవారైతే, సత్వరమే గర్భం పొందాలనుకుంటే, పొగ తాగడం మానుకోవాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడం, నిద్రను అధికం చేయడం
మహిళలో ఫలదీకరణ మరియు ఒత్తిడి, నిద్రను దూరం చేసుకోవడం అనేవాటికి నేరు సంబంధాలున్నాయి. ఇవి అనేక స్టడీలలో కూడా నిరూపించబడ్డాయి. ఒత్తిడి ఫలదీకరణను వ్యతిరేకంగా ప్రభావిస్తుంది. కనుక ఒత్తిడి తగ్గించే జీవన విధానాలు ఆచరించాలి. మీ రుతుక్రమం సవ్యంగా జరిగేలా చేసుకోవాలి.
ప్రతిరాత్రి మీ నిద్ర గాఢంగా పట్టేలా చేసుకోవాలి. నిద్ర సరిగా లేకుంటే లెప్టిన్ అనే హార్మోన్ కొరతపడి ఫలదీకరణపై ప్రభావం చూపుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా తగినంత నిద్ర అవసరమైనప్పటికి. కనీసం రాత్రి నిద్ర మహిళలకు 6 గంటలు ఏ అడ్డంకి లేకుండా వుండాలి. నిద్ర శరీరాన్ని మరోమారు ఉత్తేజపరిచి, రోజులోని ఒత్తిడిని పూర్తిగా తీసివేస్తుంది.
బరువు తగ్గాలి
అధిక బరువు వుండే మహిళలకు త్వరగా గర్భం రాదు. పొట్టచుట్టూ చేరే కొవ్వు ఫేలోపియన్ ట్యూబులను, అండాలను ప్రభావింపజేసి ఆమె పిరీయడ్స్ సరిగా రాకుండా కూడా చేస్తుంది. బరువున్న మహిళ బరువు తగ్గితే, గర్భం ధరించే అవకాశం అధికంగా వుంటుంది.
విటమిన్లు ఇతర పోషకాలు
గర్భం ధరించాలనుకునే మహిళ పోషక విలువలు కల ఆహారం తింటూ, శరీరానికి తగిన విటమిన్లు, మినరల్స్ వంటివి తీసుకోవాలి. గర్భ విచ్ఛిన్నాలు, పిండం సరిగా ఎదగకపోవడం వంటివి ఏర్పడకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ విటమిన్ సి వుండే తాజా పండ్లు, కూరలు, గుడ్లు, వంటి సహజ ఆహారాలు తినాలి.
ఫలదీకరణ మెరుగుపరచుకోవడం అంటే, అన్ని రకాలుగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొంది బేబీ కొరకు గర్భం ధరించడం. ఆరోగ్యవంతమైన శరీరం, చక్కటి సంతానోత్పత్తి కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications