Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
ఇరవై సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టడం లేదా?

మహిళలో ఫలదీకరణ సమస్యకు ప్రధాన కారణం వయసు. సాధారణంగా 15 నుండి 44 సంవత్సరాల వయసులో ఆమె గర్భం ధరిస్తూ వుంటుంది. నలభై సంవత్సరాల వయసు వచ్చిందంటే, ఆమెలో గర్భం ధరించే అవకాశాలు షుమారుగా 90 శాతం నుండి 67 శాతానికి ఆమెకు 45 సంవత్సరాలు వచ్చాయంటే, మరింత తక్కువగా 15 శాతానికి అవకాశాలు పడిపోతాయి.
అయితే, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ వారి అంచనాల మేరకు, 2002 లో 29 సంవత్సరాల వయసుకంటే తక్కువగా వున్న వివాహిత మహిళలలో 11 శాతం మంది సంతానోత్పత్తి సామర్ధ్యం కలిగి లేరని తెలుస్తోంది. వీరికి సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గటం అంటే, ఒక సంవత్సరంపాటు ప్రయత్నించటం, విఫలత చెందటంగా వారు తెలిపారు.
సాధారణంగా 31 లేదా 32 సంవత్సరాలు వచ్చేటంతవరకు ఫలదీకరణ ఉన్నతంగానే వుంటుంది. మరి ఇరవైలలోనే ఫలదీకరణ సమస్యలంటే, అది విస్మయాన్ని కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు.
ఈ వయసు స్త్రీలలో వచ్చే ప్రధాన సమస్య సాధారణంగా వారి ఫేలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం. అదే పురుషుడైతే, వీర్య కణాల సంఖ్య తక్కువగా వుండటం, ఒక వేళ వీర్య కణాల సంఖ్య సాధారణంగా వున్నప్పటికి, వాటిలో కదలిక ఆశించిన రీతిలో లేకపోవటంగా వుంటుందని, ఈ వయసులో పిల్లలు పుట్టని జంటలలో పురుషులలోనే సాధారణంగా మూడు వంతులమందికి ఈ సమస్య వస్తోందని నేషనల్ ఇన్ ఫెర్టిలిటీ అసోసియేషన్ నివేదికలు తెలుసుతున్నాయి.
సంతానోత్పత్తి విఫలత కారణాలను పరిశీలిస్తే, పర్యావరణ కారణాలు, అంటే, పురుగుమందులు, హెవీ మెటల్స్ కారణంగా కలుషితమయ్యే ఆహారాలు, తాగుడు, పొగతాగుడు, వంటి చెడు అలవాట్లు, అతి తక్కువ వీర్యకణాల సంఖ్యకు వీర్యకణాలలో కదలిక లేకపోవటానికి కారణమవుతున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
పిల్లలు పుట్టని జంటలు తమ సమస్యలకు అసలు కారణాలు కనుగొనలేక టెస్ట్ ట్యూబ్ ఫలదీకరణలవంటివి ఆచరిస్తున్నారు. వాటికి బదులుగా జంటలు తమ ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మార్చుకుని ఆరోగ్యమైన రీతిలో సంతానోత్పత్తి సామర్ధ్యాలను పెంచుకునే అవకాశాలు కలిగి వుండాలి. సంతానం కలిగే అవకాశాలున్న రోజులలో మహిళ తన రుతుక్రమ సైకిల్ పరిశీలించుకొని రతిక్రీడలు ఆచరించాలి. అధిక బరువు, రుతుక్రమం సరిగా రాకపోవటం, మొదలైన సమస్యలను వివాహానికి ముందే పరిష్కరించుకోవాలి.



Click it and Unblock the Notifications
