Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
ధైరాయిడ్ సమస్యతో గర్భం రాదా?
ఒక్కసారి గర్భం ధరిస్తే చాలు అప్పటి వరకు గల జంటల ఆనందోత్సాహాలు మరో మలుపు తీసుకుంటాయి. కుటుంబంలో మార్పులకు రంగం సిద్ధం అవుతుంది. ఆరోగ్య మార్పులతో సహా ఖర్చు పరంగా తాము ఉండే నివాసం లేదా ఇల్లు నుండి పురుషుడి ఆదాయ వ్యయాల వరకు గణనీయ మార్పులు, చోటు చేసుకుంటాయి. గర్భవతి అవ్వాలని కుటుంబాన్ని పెంచుకోవాలనీ నిర్ణయించుకుంటే ముందుగా మీరు మానసికంగా సిద్ధపడాలి. అదే రకంగా మీ పురుషుడు కూడా అందుకు సిద్ధ పడాలి. భార్య గర్భవతి అవుతోందంటే పురుషులు సైతం కొంత ఆందోళన చెందుతారు.
దీనికిగాను పురుషుడిని కూడా మహిళ అన్ని రకాలుగా కొంతవరకు సిద్ధం చేయాలి.

బిడ్డ పుట్టేముందు మీరు మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధం అవుతారో, అతనిని కూడా అదే విధంగా తయారు చేయాలి. బేబీపై అతను కూడా శ్రధ్ధ వహించేలా చేయాలి. అందుకు తగిన అవసరాలను సమకూర్చేలా చేయాలి. గర్భం ధరించాలంటే మీరు కూడా అధిక శ్రమ లేకుండా బిడ్డను కనదగిన వయసేనా అనేది నిర్ణయించుకోవాలి. కొద్ది రోజులు మీరు మీ పురుషుడు కలసి ఇంట్లో ఒక పిల్లాడు వున్నట్లుగానే ఊహించుకోండి. అదే రకంగా ప్రవర్తించి ఆనందించండి. దానితో కొంతవరకు భయాలు తీరిపోతాయి.
మహిళకే కాదు...బిడ్డకూ హాని...?
మహిళకు కొన్ని సమయాలలో ప్రెగ్నెంట్ కాని పరిస్ధితులుంటాయి. ఇవి వైద్యపరంగా, లేదా ఆమెకుగల పరిస్ధితులు, లేదా మానసిక స్ధితి ఫలితంగా వుంటాయి. అటువంటపుడు ఆమె బేబీని పూర్తి కాలంగా తన గర్భంలోనిలుపుకోలేదు. ఆమె జీవితానికే కాక, బిడ్డకు కూడా హాని కలిగే స్ధితి వుంటుంది. వాటిని పరిశీలిస్తే.....
1. హైపో ధైరాయిడ్ - ప్రెగ్నెన్సీకి ముందు ధైరాయిడ్ హార్మోన్ పరీక్ష తప్పక చేయాలి. హైపో ధైరాయిడ్ వుంటే బిడ్డ కు హాని లేదా తీవ్ర జబ్బులు కలుగుతాయి. అసలు గర్భం దాల్చటంలోనే సమస్య రావచ్చు.
2. డయాబెటీస్ - డయాబెటీస్ వ్యాధి వుండి మహిళ గర్భం దాల్చాలననుకుంటే మొదటగా తన షుగర్ లెవెల్ నియంత్రణలోకి తెచ్చుకోవాలి. బ్లడ్ షుగర్ అధికంగా వుంటే, బేబీలు బరువుతక్కువగా వుండి పూర్తి నెలలు నిండక ముందే పుడతారు. లేదంటే పుటకలో కొన్ని వైకల్యాలు సంభవిస్తాయి.
3. హెమోఫిలియా - ఈ స్ధితిలో రక్తం తేలికగా గడ్డకట్టదు. బిడ్డ పుడుతుందంటే మహిళకు రక్తస్రావం అధికంగా వుంటుంది. కనుక ఈ స్ధితి వున్న మహిళలు గర్బందాల్చటానికి పనికిరారు.
4. వంశానుగత వ్యాధులు - కొన్ని అరుదైన వ్యాధులు కుటుంబ సభ్యులనుండి సంక్రమించినవి అంటే మానసికపరమైనవి వుంటాయి. వీటిని పరీక్షలలో తెలుసుకోవడం కూడా కష్టమే. కుటుంబ చరిత్ర వలననే సేకరించటం సాధ్యమవుతుంది.
5. హై రిస్క్ హిస్టరీ - డెలివరీ హై రిస్కు తో కూడి గతంలో మరణం తప్పిందనుకున్నపుడు మరోమారు ఆమె వైద్యపర అనుమతులుంటేగాని గర్భం దాల్చరాదు.
6. మొదటి బిడ్డ - మొదటి బిడ్డకుకనుక సెరిబరల్ పాల్సీ వంటి వ్యాధులు వుంటే మరో మారు గర్భం ధరించాలంటే వైద్యుల అనుమతి తప్పక వుండాల్సిందే.



Click it and Unblock the Notifications
