Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
గర్భవతులు కోరే 5 అవసరాలు?
మహిళ గర్భం ధరించిందంటే ఆమెను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. మహిళకు గర్భం ధరించిన 9 నెలల కాలం ఎంతో ఆదరణ చూపుతారు. ఆమె కోరికలన్నీ తీర్చేస్తారు. అది తిండి కోరిక అయినా సరే లేక ఇతర వస్తువులైనా సరే కోరిన వెంటనే ఆమె ముందుంటాయి. మరోమారు మీ తల్లి మిమ్మల్ని మూడు సంవత్సరాల వయసు పిల్లవలే సాకుతుంది. మరి మీ భర్త మిమ్మల్ని పెళ్ళి అయిన కొత్తలలో చూసినంత అపురూపంగా చూసుకుంటాడు. మీ అత్త, మామలు, ఆడపడుచులు కూడా మిమ్మల్ని స్వంత కూతురువలే చూసుకుంటారు. మరి మీ గర్భవతి దశ మరింత సౌకర్యంగా ఉండేందుకు దిగువ పరికరాలు కూడా కోరి ఆనందించండి.

సుఖాలనిచ్చే గర్భవతి అవసరాలు
1. ప్రెగ్నెన్సీ పిల్లో - ఇది గర్భవతులకు మాత్రమే హాయిగా ఉండటానికి డిజైన్ చేయబడి ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాతి దశలలో హాయిగా నిద్రపోవటమనేది కుదరదు. కనుక అపుడు గరిష్ట సౌకర్యం కలగాలంటే, మెత్తటి గుండ్రటి పిల్లో మీకు అవసరమవుతుంది. ప్రెగ్నెన్సీ పిల్లో లు చాలా వరకు మీ ఉబ్బిన పొట్టకు బలమైన ఆధారాన్ని కలిగించి మీకు హాయిని గొల్పుతాయి.
2. మేటర్నిటీ లెగ్గింగ్ - మీ గర్భవతి దశలో శరీరం బాగా పెరిగినపుడు, పెద్ద సైజు దుస్తులన్ని వేయటం అయిన తర్వాత మీకు ఒక జత మేటర్నిటీ లెగ్గింగ్ కావలసి వస్తుంది. అవి చాలా సౌకర్యాన్నిస్తాయి. పెరిగే పొట్టను, బిడ్డ కదలికలను అది బాగా సౌకర్యవంతం చేస్తుంది. ఇది ఒకటి కొంటే చాలు, మరో రెండు కూడా కొనుగోలు చేసి ఆనందించాలనిపిస్తుంది.
3. ప్రెగ్నెన్సీ కాస్మెటిక్స్ - ప్రెగ్నెన్సీ సమయంలో మీకు కొన్ని ప్రధాన కాస్మెటిక్స్ అవసరమవుతాయి. బాడీ లోషన్ లేదా క్రీమ్ వంటివి మీ నశరీరంపై ఉండే స్ట్రెచ్ మార్కులను పోగొడతాయి. షియా బటర్ లేదా కోకో క్రీమ్ వంటివి స్ట్రెచ్ మార్కులను బాగా తొలగిస్తాయి.
4. ఫుట్ మసాజ్ కిట్ - ప్రెగ్నెన్సీ చివరి భాగంలో మీ పాదాలు అధిక బరువుతో నొప్పులు పెడతాయి. వాటికి మసాజ్ కు గాను మసాజ్ నూనెలతో ఒక కిట్ అవసరపడుతుంది. కనుక మీ పాదాల సుఖం కొరకు ఫుట్ క్రీమ్, ఫుట్ సౌనా, ఆరోమాటిక్ నూనెలు వంటివి వాడి మసాజ్ చేయించుకోండి. తేలికగా ఉంటుంది.
5. బేబీ ఆల్బం - ఈ సమయంలో గర్భవతికి చాలా ఫ్రీ టైమ్ ఉంటుంది. ప్రత్యేకించి నెలలు నిండుతున్న కొద్ది ఆమెకు ఏ పని ఉండక స్వేచ్ఛగా ఉంటుంది. డాక్టర్లు విశ్రాంతిని కావాలంటారు. అటువంటపుడు బేబీల ఆల్బం ఒకటి దగ్గర పెట్టుకొని ఆనందించండి. బేబీ పుట్టిన తర్వాత దానిని అతనికిచ్చి ఆడించండి.



Click it and Unblock the Notifications
