Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
ప్రసవం నాటికి పురుషుడి అవసరం?

దీనికిగాను పురుషుడిని కూడా మహిళ అన్ని రకాలుగా కొంతవరకు సిద్ధం చేయాలి. భాధ్యతలు పెరుగుతున్నాయని భావించే అతనిలో విశ్వాసం పెంచాలి. బిడ్డ పుట్టే సమయానికి కొంత సొమ్ము కూడబెట్టమని తెలుపాలి. వీటికి అతను సిద్ధంగా వుంటే మీ ప్రెగ్నెన్సీ అతను ఆమోదించినట్లే. ఇకపై మీ అనుబంధం మరింత గట్టిపడుతుందని తెలుపాలి. బిడ్డ కలగటమనేది భవిష్యత్తుకు మంచిదని బిడ్డలు ముసలి వయసులో సహకారంగా వుంటారని తెలుపాలి.
బిడ్డ పుట్టేముందు మీరు మానసికంగా, శారీరకంగా ఎలా సిద్ధం అవుతారో, అతనిని కూడా అదే విధంగా తయారు చేయాలి. బేబీపై అతను కూడా శ్రధ్ధ వహించేలా చేయాలి. అందుకు తగిన అవసరాలను సమకూర్చేలా చేయాలి. గర్భం ధరించాలంటే మీరు కూడా అధిక శ్రమ లేకుండా బిడ్డను కనదగిన వయసేనా అనేది నిర్ణయించుకోవాలి. కొద్ది రోజులు మీరు మీ పురుషుడు కలసి ఇంట్లో ఒక పిల్లాడు వున్నట్లుగానే ఊహించుకోండి. అదే రకంగా ప్రవర్తించి ఆనందించండి. దానితో కొంతవరకు భయాలు తీరిపోతాయి.
మీరు సిద్ధపడి, మీ పురుషుడిని ఈ విధంగా సిద్ధం చేసిన తర్వాత బిడ్డ పుట్టే ముందుగానే మీరిరువురూ తగిన పరీక్షలో చేయించుకోవాలి. ఈ పరీక్షలు పుట్టబోయే బిడ్డకు ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధులు కలుగకుండా చర్యలు తీసుకోవడంలో తోడ్పడతాయి. కనుక డాక్టర్ ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ఈ రకమైన జాగ్రత్తలు పురుషుడికి కూడా అవసరమైనప్పటికి, అతనిని అధికంగా బలవంతపెట్టకండి. ఇరువురికి ఈ విషయంలో ఒకే రకమైన అవగాహన, అంగీకారం వుండాలి.



Click it and Unblock the Notifications
