Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
గర్భాధారణ సమయంలో పొట్ట మీద చారలు పొగట్టడం ఎలా...?

చర్మం పొడిబారి నిద్రలేమితో బాధపడుతుంటే కనీసం రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం శ్రేయస్కరం. గ్లాసు అంటే దాదాపు రెండువందల మిల్లీ లీటర్లు. చర్మకణాలు ఉబ్బడం, శరీరం ఎక్కువగా ద్రవపదార్థాలను ఆశించడం వల్ల చర్మం పొడారిపోతుంది. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు సబ్బుల వాడకం తగ్గించడం మంచిది. ముఖ్యంగా ముఖం రుద్దుకునేందుకు సబ్బు వాడకూడదు. శరీరంపై తేమతో కూడిన పరిమళ ద్రవ్యాలు చల్లుకోవాలి. సువాసనలతో కూడిన లవణాలు కలిపిన నీటితో స్నానం చేస్తే శరీరానికి ఎంతో హాయిగా ఉంటుంది. నెలలు నిండుతున్న రోజుల్లో ఇటువంటి నీటిని ఎక్కువగా వాడకూడదు.
పొట్టమీద చారలు: సౌందర్య పిపాశులైన స్త్రీలకు శరీరాకృతిలో తేడా వచ్చినా, చర్మంమీద చారలు ఏర్పడినా చాలా ఆందోళనగా ఉంటుంది. ఈ చారలు పొట్ట, తొడభాగం, వక్షోజాలు ఇంకా ఇతర భాగాలమీద ఏర్పడవచ్చు. ఒకసారి ఈ చారలు ఏర్పడితే వాటిని తొలగించుకోవడం చాలా కష్టం. అందుచేత ఇవి ఏర్పడకుండా ఉండే పద్ధతులు పాటించడం ఉత్తమం. చర్మం మీది కణాలు తెగిపోవడం లేదా విడిపోవడం వల్ల చారలు ఏర్పడతాయి. కణాలు తెగడానికి కారణం శరీర బరువు పెరగడం. అందువల్ల శరీరం కావలసిన దానికన్నా ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అతిగా తినడం విరమించాలి. కొవ్వు పెంచే నూనె పదార్థాలు, తినడానికి పనికి వచ్చే ప్రతి పదార్థం తినకూడదు.
మసాజ్: నూనెతో శరీరాన్ని క్రమం తప్పకుండా మర్దన చేసుకోవాలి. అరచేతిలో నూనె పోసుకుని పొట్టమీద మెల్లగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చారలు ఏర్పడవు. ఇందుకు కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలోనికి బాగా ఇంకిపోయి కణాలను స్టాంగ్ గా ఉంచుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే నుండే ఈ ఆయిల్ మసాజ్ ను మొదలు పెట్టడం మంచిది. పెరుగులో పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని పొట్టమీద క్రమం తప్పకుండా రాసుకుంటే... గర్భం ధరించినప్పుడు పొట్టమీద ఏర్పడ్డ చారలు తగ్గిపోతాయి.
బాడీలోషన్: బాడీలోషన్ చేతులు, భుజాలకు మాత్రమే కాదు, శరీరం మొత్తానికి, పొట్టకు, చెస్ట్ కూడా అప్లై చేసి మర్ధన చేసుకోవాలి. చారలను వచ్చిన తర్వాత పోగొట్టడం కంటే రాకుండా నివారించడానికి డెలివరీకి ముందునుండి ఈ బాడీలోషన్ అప్లై చేయడం చాలా మంచిది. బాడీలోషన్ ప్రతి రోజూ ఉదయం పూట రాయడం చాలా మంచిది. తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా బాడీ లోషన్ ను అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
నీళ్ళు: నీళ్ళు తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రతి రోజూ శరీరానికి తగినంత నీటిని తాగడం వల్ల చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడమే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం మీద చారలు ఏర్పడకుండా చేస్తుంది.
బరువు పెరగడం: మీ ఎత్తుకు తగ్గ బరువు పెరగడం సహజం అయితే ప్రెగ్నెన్సీ సమయంలో 12 నుండి 14 కేజీల వరకూ బరువు పెరుగుతారు. ఒక వేళ మీ ఎత్తుకు తగ్గ బరువుల లేకుంటే, మరి కొంత బరువు పెరగాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఆల్ రెడీ ఓవర్ వెయిట్ కలిగి ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications