Latest Updates
-
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే!
గడువుకు ముందే ప్రసవం? అడ్డుకోవడానికి మంచి ఉపాయాలు....!
ప్రసవసం ఒత్తిడితో మరియు బాధాకరమైన వ్యవహారం రండింటితో కూడుకొన్నది . చాలా మంది మహిళలు ముందుగానే డెలివరీ ప్లాన్ తెలుసుకోవడానికిఇష్టపడతారు. అందులో భాగంగా మెటర్నిటీ లీవ్ మరియు హాస్పిటల్ క్యాబిన్ బుక్ చేసుకోవడం వంటివి. అయితే అనుకోకుండా డెలివరీ డేట్ ఇచ్చిన తేదికంటే ముందుగా నొప్పులు రావడం మొదలైతే ప్లాన్ అంతా వృదాయే. అంటే నెలలు పూర్తిగా నిండకుండా అపక్వ క్రియలో శిశువుకు జన్మనివ్వడం జరుగుతుంది. అలా శిశువు జన్మించడమే కాదు, తల్లిని కూడా అత్యవరసర పరిస్థితులలో ఉంచాల్సి వస్తుంది. అది మీ బిడ్డకోసం కూడా కావచ్చు.
అలా నెలలు పూర్తిగా నిండకుండా ఇచ్చిన తేదికీ ముందుగానే ప్రసవించిన బిడ్డను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఇంక్యుబేటర్ అమర్చి ఉండాలి. గర్భం ధరించి పూర్తిగా నెలలు నిండకు రెండు మూడు నెలల ముందే ప్రసవిస్తే ఆ బిడ్డ పూర్తిగా అభి అభివృద్ధి చెంది వుండడు. అయితె ఎప్పుడైతే తల్లి ప్రీమెచ్యుర్ పెయిన్(అకస్మికంగా సంభవించే నొప్పులు)వచ్చినప్పుడు బరువుతక్కువగా లేదా శిశువు అభి అభివృద్ధి చెందిన బిడ్డ పుడుతుంది. దాంతో ఇలా ముందుగా ఇచ్చిన గడువుకు ముందే పుట్టడం కారణంగా శిశుమరణాల సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.
కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇలా ప్రీమెచ్చుర్ డెలివరీ(నెలలు పూర్తి కాకుండా అకస్మిక ప్రసవం) నుండి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అందులో ముఖ్యంగా కొన్ని ఆహారాలను..పైనాపిల్ తినకుండా ఉండటం మంచిది. పైనాపిల్ తినడం వల్ల కూడా ఇచ్చిన గడువుకంటే ముందే ప్రసవం అయ్యే అవకాశం ఉంది. సరైన మోతాదులో ఒమేగా 3ఫ్యాటియాసిడ్స్ లేకపోవడం వల్ల కూడా ఇలా అకాలప్రసవంతో బిడ్డ పుట్టడానికి కారణం కావచ్చు.
మరి మీరు గర్భవతి అయితే ఇటువంటి ప్రీమెచ్యుర్ డెలివరీ(అకాల ప్రసవం)పొందకుండా ఉండేందుకు కొన్నా జాగ్రత్తలు మీకోసం...

ప్రీనేటల్ విటమిన్స్: గర్భంధరించిన తర్వత డాక్టర్ పర్యవేక్షణలో ప్రీనేటల్ విటమిన్స్ అంటే క్యాల్షియం, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ వంటివి తరచూ తీసుకుంటుండాలి. పోషకాహార లోపం కూడా ఇలా ప్రీమెచ్యుర్ డెలివరీకి గల కారణాల్లో ఇది కూడా ఒకటి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: గర్భిణీ స్త్రీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగినంత ఉంటే గర్భాశక గోడల్లో రక్త గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

గమ్ డిసీజ్: గర్భధారణ సమయంలో చిగుళ్ళ వ్యాధులు ఉన్నాకూడా ఇలా ప్రీమెచ్యుర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గర్భం దాల్చినప్పుడు ఏవైనా దంత సమస్యలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

ఎక్కువ నీరు త్రాగాలి: గర్భధారణ సమయంలో నీరు ఎక్కువగా దాహం వేస్తుంది. కాబట్టి తరచూ నీరు త్రాగుతుండాలి. శరీరంలో డీహైడ్రేషన్ వల్ల కూడా ప్రీమెచ్యుర్ డెలివరీ అయ్యే చాన్స్ ఉంది. కాబట్టి నీరు ఎక్కువగా తీసుకుంటుండాలి.

టాయిలెట్ కు తరచూ వెళ్ళాలి: గర్భాధరణ సమయంలో టాయిలెట్ కు వెళ్ళే అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తరచూ టాయిలెట్ కు వెళ్ళాలనిపించినప్పుడు వెంటనే వెళ్ళాలి. లేదంటే గర్భాశయ ఒత్తిడి యూట్రస్ మీద పడుతుంది.

రోజులో అప్పుడప్పుడు తింటుండాలి: గర్భాధరణ సమయంలో ఎంత తిన్నా సరిపోదు. కాబట్టి సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోవాలి. భోజనం కాకుండా ఆకలిగా అనిపిస్తే అరగంట, గంట వ్యవధికాలంలో ఏదైనా పోషకాహారాన్ని అతి తక్కువగా తీసుకోవడం వల్ల కడుపు బారంగా, లేదా ఉబ్బడం వంటివి ఉండవు. దాంతో గర్భాశయం మీద ఒత్తిడికూడా పడదు.

మీరు తినే ఆహారం మీద శ్రద్ద తీసుకోండి: బొప్పాయి, పైనాపిల్ వంటివి గర్భణీ స్త్రీలు అసలు తీసుకోకూడదు. వీటిలో ఉండే రసాయనాలు గర్భాశయ సంకోచాలను కలిగిస్తుంది. శిశువు ఎదుగుదలను అడ్డుకుంటుంది.

అధిక బరువులు ఎత్తకూడదు: అధిక బరువులు ఎత్తడం వల్ల ప్లాసంటా మీద ఒత్తిడి పెరుగుతుంది. గర్భం ధరించిన ప్రారంభ దశలో ఈ ప్లాసంటా వల్ల గర్భస్రావం కావచ్చు.

ఉబ్బుకోవడం: అధికంగా బరువు ఎత్తడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. శరీరం కూడా అధిక బరువున్నప్పుడు యూట్రస్ మీద ఒత్తిడి పెరుగుతుంది.



Click it and Unblock the Notifications