Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
గర్భిణీ హైహీల్స్ ధరించడం వల్ల ఎదురయ్యే సమస్యలు
అందాన్ని పెంచేవి దుస్తులేకాదు, మీరు తొడిగే దుస్తులకు మేచింగ్‌గా వేసుకునే పాదరక్షలు కూడా మీ అందాన్ని యినుమడింప చేస్తాయి. పూర్వం పాదరక్షలని యెందుకన్నారంటే పాదాన్ని రక్షించేది కనక పాదరక్షలు అన్నారు. ప్రస్తుతం పాదరక్షలు అన్న పదానికి పాదములకు అందమునిచ్చేవి అని అర్థం చెప్పుకోవాలి. ఆభరణాలు, దుస్తులు ఏ విధంగా వ్యక్తికి అందాన్నిస్తాయో చెప్పులు, బూట్లు కూడా వ్యక్తికి అదేవిధంగా ఒక స్టేచర్‌ని కల్పిస్తాయి.
పాదరక్షలలోకూడా అనేక రకాలున్నాయి. ఒక్కొక్క రకం పాదరక్షలను ఒక్కొక్క రకమైన ఫంక్షన్సుకు వుపయోగిస్తారు. ఫంక్షన్సుకు వేసుకునే దుస్తులకు సరి పోయే పాదరక్షలనే వాడాలి. పాదరక్షలు సాధారణ సమయంలో ఎలా వేసుకొన్నా, గర్భధారణ సమయంలో మాత్రం సురక్షితమైనవాటిని ఎంపిక చేసుకోవాలి. కొంత మంది గర్భిణీ స్త్రీలు, గర్భధారణ సమయంలో హై హీల్స్ ను ధరిస్తుంటారు. అయితే ఇది కడుపులో పెరిగే శిశువకు అంత మంచిది కాదు. కొన్ని నెలల క్రితం బ్రిటీష్ యువరాని కేట్ మిడిల్టన్ కూడా తన గర్భదారణ సమంలో హైహీల్స్ ను వేసుకోవడాన్ని మనం గుమనించే ఉంటాం. అలాగే సెలబ్రెటీ కిమ్ కర్ధాషియన్.

అయితే, నిపుణుల ప్రకారం గర్భణీ స్త్రీలు హై హీల్స్ ధరించడం వల్ల అందుకు వైద్యపరమైన కారణాలేవీ లేనట్లు వారు తెలుపుతున్నారు. అయితే గర్భదారణ సమయంలో హైహీల్స్ వేసుకొని నడవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది . ముఖ్యంగా గర్భం ధరించిన మహిళ 2వ లేదా3వ నెలలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. కానీ కొంత మంది మహిళల్లో ఎటువంటి సమస్య కనబడదు. గర్భదారణ ప్రారంభ దశలో కాళ్ళుకు ఎటువంటి వాపులు, మార్పులు ఉండవు కాబట్టి, ప్రారంభలో సమస్య ఉండదు. కానీ, హైహీల్స్ ధరించడం వల్ల అసౌకర్యంతో పాటు ప్రమాధవశాత్తు, హైహీల్ స్లిమ్ అయితే, గర్భస్రావం(అబార్షన్)జరిగే అవకాశం ఉంటుంది.
గర్భిణీ స్త్రీ రెండవ త్రైమాసికంలోకి చేరగానే, గర్భిణీ స్త్రీలో రిలాక్సిన్ అనే హార్మోనులు పెరగడం ప్రారంభం అవుతుంది. ఈ హార్మోనులు లిగ్మెంట్స్ ను వదులు చేసి పెల్విక్ ద్వారా శిశుసు సులభంగా ముందుకు జరగడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో గర్భిణీ హైహీల్స్ ను ఉపయోగించడం వల్ల గర్భిణీ స్త్రీ వెన్నునొప్పికు గురికావల్సి వస్తుంది.
గర్భిణీ స్త్రీలు హైహీల్స్ ధరించడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ క్రింది విధంగా:
1. గర్భధారణ సమయంలో గర్భిణీ హైహీల్స్ ధరించడం వల్ల ఇవి కాళ్ళ యొక్క కండరాలను బిగుతుగా చేస్తుంది, ఇది ఒక బాధకరమైన కాళ్ళనొప్పులకు దారితీస్తుంది.
2. గర్భదారణ సమయంలో హైహీల్స్ ధరించడం వల్ల క్రింది బాగం పోస్ట్ డెలివరీకి కారణం అవుతుంది . గర్భంలో శిశువు పెరుదలకుతో బరువు క్రమంగా నడుము దగ్గర ఉన్న ఎముకలు పై నుండి క్రింది వత్తడం (జరపడం) జరుగుతుంది. ఈ సమయంలో హైహీల్ ధరించడం వల్ల శరీరం పైభాగం నుండి క్రింది భాగం కాళ్ళవరకూ బరువు పెరగడంతో పోస్ట్ డెలివరీకి కారణం అవుతుంది.
మరియు ఇది గర్భిణీ స్త్రీ యొక్క భంగిమ మీద ప్రభావం చూపుతుంది , గర్భధారణ సమయంలో హైహీల్స్ ధరించడం వల్ల ఇది మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పెల్విక్ ముందుకు జరగడం వల్ల లోయర్ బ్యాక్ భంగిమ అసౌకర్యంగా మారుతుంది. దాంతో నడవడానికి కూడా ఇబ్బంది కరంగా మారుతుంది. శరీర బరువంతా పాదాలపై పడటం వల్ల పాదాల నొప్పి తప్పదు. వీటిని ఎక్కువ సమయం ధరిస్తుంటే.. కొన్నాళ్లలో నడుం, వెన్నునొప్పులు బాధిస్తాయి. ఎత్తు మడమల చెప్పులు శరీరం బరువుని అటూఇటూ మారుస్తుంటాయి. దీంతో శరీరాన్ని నియంత్రించుకునే సమయంలో వెన్నెముక మీద చాలా అదనపు భారం పడుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.
గర్భధారణ సమయంలో హైహీల్స్ ను ధరించడానికి ఇవి ప్రధాన కారణాలు. ఈ సమస్యలను నివారించాలంటే గర్భదారణ సమయంలో పూర్తిగా హైహీల్స్ ను నివారించాలి .



Click it and Unblock the Notifications











