Latest Updates
-
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
గర్భిణీ స్త్రీలు పెరుగు తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు క్యాల్షియం ఫుడ్ ను ఎక్కువగా తీసుకోమని సలహాలిస్తుంటారు. ముఖ్యంగా తల్లి గర్భంలో పెరిగే శిశువులో దంతాలు, ఎముకలలు మరియు కండరాల ఏర్పాటుకు పెరుగు చాలా అవసరం అవుతుంది . కాబట్టి, పాలను పాల ఉత్పత్తులను తీసుకోమని ఎక్కువ సలహాలిస్తుంటారు.
అయితే పాలు ఇష్టపడి లేదా పాలు పడని వారి కోసం మరో ఆప్షన్. పెరుగు రూపంలో తీసుకోవడమే. అయితే ఇక్కడ ఒక సందేహం? గర్భణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం సురక్షితమేనా?
Read more at: శిశువు తెల్లగా పుట్టాలంటే:ఈ బెస్ట్ ఫుడ్స్ తినండి
గర్భిణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది మరియు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది . గర్భధారణ సమయంలో శరీరానికి అవసరం అయ్యే క్యాల్షియం మరియు ప్రోటీన్స్ ను పెరుగు అందిస్తుంది. ఇవి బేబీ పెరుగుదలకు చాలా అవసరం అవుతాయి.
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలకు క్యాల్సియం సంవ్రుద్దిగా లేనట్లైతే వెంటనే క్యాల్షియం తీసుకోవడం ప్రారంభించండి. డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యకరం.
Read more at: త్వరగా గర్భం పొందడానికి సహాయపడే 21 ఆహారాలు
ముఖ్యంగా పెరుగులో మంచి బ్యాక్టీరియా(ప్రోబయోటిక్స్)అధికంగా ఉంటుంది. ఇది మనశరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది . గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల వ్యాధినిరోధకత పెంచడానికి సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలు పెరుగు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు...

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
గర్భిణీ స్త్రీలు తీసుకొనే ఆహారం మొత్తాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది అలాగే , జీర్ణం అయిన ఆహారం నుండి ప్రోటీనులను గ్రహిస్తుంది. అందువల్ల మాల్ న్యూట్రీషియన్ ప్రెగ్నెన్సీకి గురి కాకుండా ఉంటుంది. గర్భధారణ సమయంలో పెరుగు తినడం చాలా ఆరోగ్యకరమైనది.

శరీరంను చల్లబరుస్తుంది:
స్పైసీ ఫుడ్ తో పాటు పెరుగు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం చల్లబడుతుంది . గర్భధారణ సమయంలో స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు, పెరుగు తినడం వల్ల ఎసిడిటి, హార్ట్ బర్న్ నివారించవచ్చు.

క్యాల్షియంకు మూలం:
పెరుగులో బేబీ పెరుగుదలకు అవసరం అయ్యే క్యాల్షియం ముఖ్యంగా ఎముకలు, కండరాలు, దంతాలు ఏర్పటాకి ఇవి చాలా సహాయపడుతాయి. అలాగే గర్భధారణ సమయంలో తల్లిలో క్యాల్షియం కోల్పోకుండా సహాయపడుతుంది. పెరుగు వల్ల ఇది ఒక ఉత్తమ ఆరోగ్య ప్రయోజనం.

హైబ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది:
గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవుతుంది . గర్భధారణ సమయంలో హైబ్లడ్ ప్రెజర్ ప్రమాధం ఉండటం వల్ల పెరుగు హైబిపి తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో హార్ట్ డిసీజ్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరి హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడుతుంది. పెరుగు మీలోని వ్యాధినోధకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది .

ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది:
గర్భధారణ కాలంలో పెరుగు తినడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుకోవచ్చు. పెరుగు ఒత్తిడి తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో మొదడు చురుకుగా పనిచేయడం వల్ల భావోద్వేగాలకు గురి చేస్తుంది. ఈ సమస్య నివారించుకోవడానికి పెరుగు గ్రేట్ గా సహాయపడుతుంది.

స్కిన్ పిగ్మేటేషన్ మరియు డ్రై స్కిన్ నివారిస్తుంది:
గర్భధారణ సమయంలో స్కిన్ పిగ్మేంటేషన్ మరయిు పొడి చర్మం చాలా సాధారణ సమస్య . గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల మీ చర్మంను హెల్తీగా ఉంచడంతో పాటు పిగ్మెంటేషన్ నివారిస్తుంది. పెరుగులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.

బరువు కంట్రోల్ చేస్తుంది:
గర్భధారణ సమయంలో బరువు పెరగడం ఆరోగ్యానికి మంచిది. అయితే అదనపు బరువు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు . పెరుగు శరీరంలో హార్మోనల్ కార్టిసోల్ ను పెంచుతుంది. దాంతో హార్మోనుల అసమతౌల్యం ఏర్పడుతుంది మరియు బరువు పెరుగుతారు . డాక్టర్ సలహా మేరకు పెరుగు తినడం వల్ల గర్భధారణ సమయంలో బరువు తగ్గించుకోవచ్చు.

కండరాల పెరుగుదలకు:
పెరుగులో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది బేబీలో కండరాల ఏర్పాటుకు, అభివ్రుద్దికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో పెరుగు తినడం వల్ల బేబీ హెల్తీగా బొద్దుగా పుడుతారు . ఇవన్నీ కూడా గర్భధారణ సమయంలో పెరుగుతినడం వల్ల పొందే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే,. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా నిరభ్యరంతంగా పెరుగు తినండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.



Click it and Unblock the Notifications