Latest Updates
-
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి!
గర్భిణీ స్త్రీలలో మార్నింగ్ సిక్ నెస్ ను నివారించే ఎఫెక్టివ్ టిప్స్
గర్భం పొందిన ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య మార్నింగ్ సిక్ నెస్. మార్నింగ్ సిక్ నెస్‌లో పేరుకు తగ్గట్టుగానే ఉదయం లేచిన వెంటనే కడుపులో వికారం, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాంతి కూడా అవుతుంది. ఉదయమే కాకుండా మిగిలిన వేళల్లో కూడా వాంతులవుతాయి. ఈ వాంతులు పసరు కలిగి ఉంటాయి. ఈ వాంతుల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. సుమారు మూడు నెలల పాటు ఈ వాంతుల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. రెండో రకం అంతే తీవ్రమైన వాంతులలో ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుందట.
గర్భవతుల్లో సుమారుగా 50 శాతం మహిళలు మార్నింగ్ సిక్ నెస్ లేదా ఉదయ వేళ వికారంతో బాధ పడుతూంటారు. వికారం, చూపు మందగించుట, ఆకలి లేకపోవుట దీని లక్షణాలు. గర్భవతులకు మొదటి త్రైమాసికంలో ఇది వస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ ఒక్కోసారి డీహైడ్రేషన్ కూడా కలిగించి కడుపులో వున్న బేబీకి హాని కలిగించగలదు. మార్నింగ్ సిక్ నెస్ అనేది చాలా సాధారణ సమస్య . దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు.
గర్భం ధరించినపుడు ఆమెలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తాయి. హెచ్ సిజి అనే హార్మోన్ ఈ వికారం కలిగిస్తుంది. దీనిని హ్యూమన్ గొనడోట్రోపిన్ హార్మోన్ అని పిలుస్తారు. ఇది రిలీజ్ అయితే వికారం కలుగుతుంది. అండాశయం ఈస్ట్రోజన్ విడుదల చేస్తుంది.
ప్రొజెస్టిరోన్ హార్మోన్ గర్భవతిలో గర్భాశయంలోని కండరాల సడలింపుకు సహకరిస్తుంది. ఇది బేబీ ఎదురుదల మరియు పుటుకలకు తేలికగా వుంటుంది. అదే సమయంలో ఆమె పొట్ట మరియు పేగులను కూడా రిలాక్స్ చేసి అధిక జీర్ణ ఆమ్ల రసాలను ఉత్పత్తి చేసి గుండె మంట వంటివి కలిగిస్తుంది. ప్లాసెంటా ద్వారా ఎనర్జీ పోయినపుడు లో బ్లడ్ షుగర్ స్ధాయి అంటే హైపోగ్లైసీమియా ఏర్పడుతుంది. ఇది కూడా ఆమెలో వికారం కలిగిస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు . తల్లలిలో డీహైడ్రేషన్ , వీక్ నెస్ కు గురిచేస్తుంది. కాబట్టి, మార్నింగ్ సిక్ నెస్ ను నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి .

టిప్ # 1
గర్భిణీలు తినే ఆహారం క్వాంటిటి తక్కువగా ఉండాలి. తక్కువ క్వాంటిటీని ఎక్కవు సార్లు తీసుకోవాలి. ఎక్కువ ఆహారాన్ని ఒకే సారి తీసుకోవడం కంటే ఇలా రెండు మూడు సార్లు తీసుకుంటే ఎసిడిటిని దూరం చేస్తుంది. వికారం తగ్గిస్తుంది.

టిప్ # 2
గర్భదారణ సమయంలో ఆహారం మీద కోరికలు ఎక్కువగా ఉంటాయి, అలాగని ఏవి పడితే అవి, లేదా ఎక్కువ మోతాదులో ఆహారాలను తినడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ కు కారణమవుతుంది. కాబట్టి, హెల్తీ ఫుడ్ ను లిమిట్ గా తీసుకోవాలి.

టిప్ # 3
రోజూ తీసుకునే ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్, పెరుగు, చేర్చుకోవాలి. ఇది పొట్టకు కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది, బాడీ హీట్ వల్ల మార్నింగ్ సిక్ నెస్ మరింత పెరుగుతుంది. కాబట్టి , సాధ్యమైనంత వరకూ బాడీని కూల్ గా ఉంచుకోవాలి.

టిప్ # 4
రాత్రి నిద్రించడానికి ముందు ప్రోటీన్స్ మరియు కార్బో హైడ్రేట్ అధికంగా ఉన్న ఆహారాల ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు , ముసిల్స్ మొదలగు ఆహారాలు తినడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తాయి.

టిప్ # 5
ర్భినీలు మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వారు ఫ్రూట్ జ్యూసులు మరియు వాటర్ ను రూమ్ టెంపరేచర్ కు తగ్గట్టుగా తీసుకోవాలి. , అందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే మార్నింగ్ సిక్ నెస్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

టిప్ # 6
నిమ్మరసం, ఆరెంజ్, మోసంబి వంటి విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలు, మార్నింగ్ సిక్ నెస్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి . సిట్రస్ ఫ్రూట్స్ పుట్టబోయే బిడ్డకు ఆరోగ్యానికి కూడా మంచిది.

టిప్ # 7
వికారంగా అనిపించినప్పుడు పిప్పర్ మింట్ ఆయిల్ ను దగ్గర పెట్టుకుని వాసన చూస్తుండాలి.పిప్పర్ మింట్ ఆయిల్ వికారంను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications