Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీ స్త్రీలు స్టార్ ఫ్రూట్ తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్..!
స్టార్ ఫ్రూట్ ను కరోంబాల అని కూడా పిలుస్తారు. పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. స్టార్ ఫ్రూట్ మలయన్ పెనిన్సులాలో ఎక్కువగా పండిస్తారు. సౌత్ ఏసియా, ఐస్ లాండ్ మరియు చైనాలో వీటిని వ్యవసాయం ఎక్కువ. అయితే ఈ ఫ్రూట్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయినది.
వేసవిలో అరుదుగా కనిపించే పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి. స్టార్ ఫ్రూట్ గా మనమంతా పిలుచుకునే ఈ పండు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా విరివిగానే దొరుకుతున్నదిజ . నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు రసభరితంగా తినడానికి రుచిగా బాగుంటుంది. అందుకే దీన్నినేరుగా తింటుంటారు . ద్రాక్ష మాదిరిగానే వీటిమీద కూడా మైనపు పూత ఉండి మెరుస్తుంటాయి. బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. ఎక్కడో పులుపు తగులుతుంటుంది. అయితే వీటి రుచి ఇది అని చెప్పడం కష్టం. యాపిల్, పియర్, సిట్రస్ పండ్లు కలగలిసిన రుచితో ఉంటుందని కొందరంటే, బొప్పాయి, నారింజ, గ్రేప్‌ఫ్రూట్ కలగలసిన రుచిలో ఉంటుందని మరికొందరంటారు.
అదే పచ్చి స్టార్ ఫ్రూట్ అయితే కాస్త పుల్లగా గ్రీన్ యాపిల్ మాదిరిగా ఉంటుంది. సాధారణంగా ఇందులో తియ్యగా ఉండేవీ, కాస్త పుల్లగా ఉండేవీ రెండు రకాలున్నాయి. తియ్యనివి వేసవి నుంచి శీతాకాలం వరకూ కాస్తే పుల్లనివి వేసవి చివర నుంచి చలికాలం మధ్య వరకూ మాత్రమే కాస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్- సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కామెర్లనీ తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి వేడిని తగ్గించి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. పాలిచ్చే తల్లులు తింటే పాలు బాగా పడతాయి. కళ్ల మంటల్నీ తగ్గిస్తాయి. అలసటనీ అజీర్తినీ జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి. కోకమ్, పేషన్ పండ్ల మాదిరిగానే ఊబకాయాన్ని తగ్గించడానికీ దోహదపడుతుంది. అయితే మూత్రపిండవ్యాధులతో బాధపడేవారు మాత్రం దీన్ని తినకపోవడమే మంచిది. స్టార్ ఫ్రూట్స్ ను సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, గర్భిణీలు కూడా తినవచ్చు. గర్భిణీలు స్టార్ ఫ్రూట్ తినడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకంుదాం...

విటమిన్ ఎ:
స్టార్ ఫ్రూట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్బిణీతో పాటు, కడుపులో పెరిగే బొడ్డకు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గర్భిణీలో ఆకిలిన పెంచుతుంది. విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు గర్భినీలు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది.

విటమిన్ సి :
స్టార్ ఫ్రూట్ నుండి పొందే విటమిన్ సి నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ . ఇది గర్భిణీలు వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ సహాయపడుతుంది. . ఇది శరీరంలోని బ్యాక్టీరియా మరియు వైరస్ వంటివి అటాక్ కాకుండా నివారిస్తుంది. . యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ నివారిణిగా సహాయపడుతాయి . అలాగే శరీరంలో మలినాలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాలరీలను తగ్గిస్తుంది:
గర్భిణీ స్త్రీల రెగ్యులర్ డైట్ లో చేర్చుకున్నా ఎలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల అదనపు క్యాలరీలు శరీరంలో చేరవు .

నేచురల్ ఫైబర్ :
స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్దకం నివారిస్తుంది, ప్రేగులను శుభ్రం చేస్తుంది. కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా నివారిస్తుంది. కోలన్ క్యాన్సర్ నివారిస్తుంది,. ప్రేగులో మ్యూకస్ మెంబరెన్స్ ఏర్పడకుండా సహాయపడుతుంది. టాక్సిన్స్ తొలగిస్తుంది.

పెక్టిన్ :
స్టార్ ఫ్రూట్ లో ఉండే పెక్టిన్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఆకలి తగ్గిస్తుంది.

పొటాషియం :
స్టార్ ఫ్రూట్ లో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది దాంతో హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటివి నివారించబడుతాయి .

ఐరన్ :
స్టార్ ఫ్రూట్ లో ఉండే ఐరన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పాటుకు సహాయపడుతుంది. గర్భిణీల్లో అనీమియా సమస్యను నివారిస్తుంది.

క్యాల్షియం:
పుట్టబోయే బిడ్డలో ఎముకలను మరియు దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. మరియు గర్భిణీలో కండరాలను , ఎముకలను బలోపేతం చేస్తుంది . గర్భధారణ సమయంలో ఎముకల సమస్యలు(ఓస్టిరియోఫోసిస్)లకు గురికాకుండా నివారిస్తుంది .



Click it and Unblock the Notifications