Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గర్భం పొందిన 4 వారాల్లో గర్భస్రావ లక్షణాలు ఎలా ఉంటాయి
గర్భధారణ సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం. .మహిళ జీవితంలో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ గర్భధారణ సమయంలో కొద్దిగా అసౌకర్యంగాను మరియు గర్భస్రావం జరిగినప్పుడు కొన్ని అనుభవాలను ఎదుర్కోవల్సి వస్తుంది. రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధన ద్వారా 20 శాతం ప్రెగ్నెన్సీ మహిళలు 4 వారాల్లో గర్భస్రావం ఎక్కువగా జరిగినట్టు కనుగొన్నారు . అలాగే ఫస్ట్ 20 వారాల్లో కూడా గర్భస్రావం జరగడం సహజం.
గైనకాలజిస్టుల ప్రకారం, చాలా మంది మహిళలు పీరియడ్స్ తప్పిన రోజు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలన్న అవగాహణ లేకపోవడమే అందుకు ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. పీరియడ్స్ తప్పినా కూడా కొంత మంది వారు గర్భ ధరించామన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు !
నేచురల్ పద్దతుల్లో అబార్షన్ కు కారణం అయ్యే ఆహారాలు
ఈరోజు, డాక్టర్ల సలహాల ప్రకారం, మహిళలు గర్భం పొందిన మొదట సెమిస్ట(మొదటి మూడు నెలలు)చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు .
అంతే కాదు, నాలుగు వారాల్లో జరిగే గర్భస్రావానికి కొన్ని ప్రారంభ సంకేతాలు కూడా ఉన్నాయి . అందుకు గర్భం పొందిన మహిళ ఎమోషనల్ గా మరియు ఫిజికల్ గా అనేక మార్పులను చోటు చేసుకుంటుంది. ఇలాంటి లక్షణాల్లో ఎలాంటి మార్పులు గమనించినా వెంటనే గర్బస్రావానికి ప్రారంభ సంకేతాలుగా గుర్తించాలి.ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలాఅవసరం. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల బేబీతో పాటు, తల్లి ప్రమాధంలో పడినట్టే...
అబార్షన్ కోసం ఇంట్లోనే ప్రయత్నించగలిగే కొన్ని పద్దతులు
అందువల్ల, గర్భ పొందిన 4 వారాల్లో గర్భస్రావం జరిగేట్లైతే కొన్ని ప్రారంభ సంకేతాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. ఈ ప్రారంభ సంకేతాలను గుర్తుంచుకొన్నట్లైతే ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే డాక్టర్ కలవడానికి తగిన చికిత్సలకు ఇవి సహాయపడుతాయి . ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లికి మరింత సీరియస్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి.

హెవీ బ్లీడింగ్ :
నాలుగో వారంలో బ్లీడింగ్ అవ్వడం లేదా, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది . నిజంగా గర్భస్రావం జరగబోతున్నదని గ్రహించినప్పుడు బ్లడ్ హెచ్ సిజి లెవల్స్ ను గుర్తించాలి. బ్లడ్ లో హార్మోన్ లెవల్స్ డ్రాప్ అయినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది.

బ్రీతింగ్ రేట్
4వారాల్లో మిస్కరేజ్ కు లక్షణాల్లో ఒకటి బ్రీతింగ్ ప్రాబ్లెమ్. గర్భం పొందిన మహిళ ఎక్కువ శ్వాస తీసుకోవడం లేదా ఒక్కొక్క సందర్భంలో బ్రీత్ తీసుకోవడంలో కూడా ఇబ్బందిని ఎదుర్కోవల్సి వస్తుంది . ఎక్కువ స్ట్రెస్ కు మరియు భయానికి గురైనప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది . కాబట్టి ఈ పరిస్థితిని తెచ్చుకొక్కుండా ఉండాలి. సాద్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవాలి

క్రాంప్స్
పొట్ట ఉదరంలో నొప్పి లేదా క్రాంపింగ్ మరో లక్షణంగా గుర్తించాలి . పొట్ట ఉదరంలో కంట్రోల్ చేసుకోలేని విధంగా ఆబ్డోమినల్ పెయిన్ మరియు తిమ్మెరిగా అనిపించినప్పుడు వెంటనే గైనిక్ ను సంప్రదించాలి . అలాగే, ఇది ఖచ్చితమైన కారణం కాకోపోయుండొచ్చు కూడా కొంత మంది మహిళల్లో ఈ లక్షణం గర్భధారణ కాలం మొత్తం ఉంటుంది . కానీ క్రాంపింగ్ తో పాటు బ్లీడింగ్ ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

వైజినల్ డిశ్చార్జ్
వైజనల్ డిశ్చార్జ్ లో బ్రౌన్ డిశ్చార్జ్ అయితే అది మిస్కరేజ్ యొక్క లక్షణంగా గుర్తించిన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను కలవాలి . ఇది కాఫీ కలర్లో డిశ్చార్జ్ అవుతుంది . ఇది పాత రక్తం యూట్రస్ లో ఉండిపోయినా నిధానంగా బటయకు వస్తుంటుంది.

టిష్యు డిశ్చార్జ్
ఈ డిశ్చార్జ్ తో పాటు వైజినా నుండి లిక్విడ్ పాస్ అవుతుంటుంది. ఇది కేవలం టిష్యు డిశ్చార్జ్ మాత్రమే. ఇది కూడా 4 వారల్లో కనబడుతుంది..

జ్వరం
నొప్పిలు, తిమ్మెర్లు కారణంగా, కొంత మంది మహిళల్లో ఫీవర్ కూడా వస్తుంది . ఈ సమయంలో జ్వరానికి సంబంధించిన మందులను చాలా తక్కువగా తీసుకోవాలి . దాంతో టెంపరేచర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

మిస్క రేజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది
గర్భస్రావం జరిగిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం 2 వారాల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. క్రాంపింగ్ మరియు బాడీ పెయిన్స్ ను పెయిన్ కిల్లర్స్ ద్వారా తగ్గించుకోవచ్చు .



Click it and Unblock the Notifications
