Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
గర్భధారణలో తినాల్సినటువంటి అమేజింగ్ పవర్ ఫుడ్స్
ప్రెగ్సెన్సీ మహిళలు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భపొందిన కొన్ని వారాల వరకూ చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది . గర్భం పొందిన ప్రారంభ దశలో ఫొల్లెట్, ఫైబర్, ఐరన్ మరియు విటమిన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఇవన్నీ బేబీ పెరుగుదలకు చాలా అవసరం. ముఖ్యంగా గర్భిణీలు తీసుకొనే ఆహారాల మీద ప్రత్యేక శ్రద్ద కలిగి ఉండాలి. అలా శ్రద్ద తీసుకోకపోతే బేబీ ఎదుగుదల మీద మరియు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
పిల్లలు లేని వారు త్వరగా కన్సీవ్ అవ్వాలంటే...?
గర్భిణీ స్త్రీలు తీసుకొనే ఆహారాలు ప్లేసాంటా ద్వారా పిండం వ్రుద్దికి, ఆరోగ్యానికి సహాయపడుతుంది. కాబట్టి, అసురక్షితమైన ఆహారాలు తీసుకోవడం వల్ల బేబీ హెల్త్ కు ప్రమాధం. అందువల్ల హెల్తీ ఫుడ్స్ తింటూ హెల్తీగా ఉండటం చాలా అవసరం. అసురక్షితమైన ఆహారాలు తీసుకోవడం నివారించాలి . గర్భధారణ సమయంలో తీసుకోవల్సిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి .
గర్భధారణ సమయంలో 10 వ్యక్తిగత సంరక్షణకు టాప్ 10 చిట్కాలు
ఈ ఆహారాలు, గర్భిణీ స్త్రీలకు కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తాయి. ఇవి బేబీ మరియు తల్లి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి, గర్భధాణ సమయంలో తల్లి తీసుకోవల్సిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాల లిస్ట్ ఈ క్రింది విధంగా...

లీన్ మీట్:
గర్భధారణ సమయంలో న్యూట్రీషియన్స్ ఎక్కువగా అవసరం అవుతాయి . అందువల్ల ఐరన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవడం చాలా అవసరం. లీన్ మీట్ లో ఐన్, ప్రోటీన్లు అధికంగా ఉన్నాయి . ఇవి బేబీ ఆరోగ్యానికి, ఎదుగుదలకు మరియు బేబీలో రెడ్ బ్లడ్ సెల్స్ ను డెవలప్ చేయడంలో గ్రేట్గా సహాయపడుతాయి . గర్భధారణ సమయంలో అనీమియా చాలా సాధారణ సమస్య.

గుడ్లు:
ప్రోటీనులకు ప్రత్యామ్నాయం గుడ్లు. గర్భధారణ సమయంలో ప్రోటీనులతో పాటు అమినో యాసిడ్స్ ఎక్కువ అసరం అవుతాయి. అవి గుడ్లలో పుష్కలంగా ఉన్నాయి . గుడ్లలో ఉండే న్యూట్రీషియన్స్ బేబీ పూర్తి ఆరోగ్యం మెరుగుదలకు మరియు బ్రెయిన్ డెవలప్ మెంట్ కు అవసరం అవుతాయి .

ఓట్ మీల్ :
ఓట్ మీ దినచర్యను మొదలు పెట్టడానికి ఒక ఉత్తమ మార్గం. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది పొట్టను ఫుల్ చేస్తుంది . దీర్గకాలంలో ఆకలిని కోరికలను కంట్రోల్ చేస్తుంది . దాంతో ప్రెగ్నెన్సీ సమయంలో కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి . కాబట్టి, గర్బణీ డైట్ లో ఇది ఒక తప్పనిసరి ఆహారం.

పెరుగు:
గర్భధారణ సమయంలో తల్లితో పాటు బేబీకి కూడా క్యాల్షియం అధికంగా అవసరం అవుతుంది. ముఖ్యంగా క్యాల్షియం బేబీ యొక్క ఎముల డెవలప్ మెంట్ తల్లిలో ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది. గర్భధారణ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల నాడీవ్యవస్థ పనితీరుబాగుంటుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పొట్టలో మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుది.

సాల్మన్:
సాల్మన్ ఫిష్ లో ఫ్యాట్ యాసిడ్స్ ఫుష్కలంగా ఉంటాయి . ఇది ప్రీనేటల్ డిప్రెషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ మరియు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది .ఇంకా మెటబాలిజంకు మరియు సోలబుల్ విటమిన్స్ కు గ్రేట్ గా సాహాయపడుతుంది.

అవొకాడో:
అవొకాడోలో ఫొల్లెట్, పొటాషియం, విటమిన్ సి మరియు బి6 పుష్కలంగా ఉంటాయి . ఇది బేబీ టిష్యుకు మరియు బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు ఇది మార్నింగ్ సిక్ నెస్ ను నివారిస్తుంది . గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అవసరం అయ్యే విటమిన్స్ ను అందిస్తుంది.

అరటిపండ్లు:
అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. మరియు వెంటనే ఎనర్జీని అందిస్తుంది . ఇవి గర్భధారణ సమయంలో అలసటని తగ్గిస్తుంది. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications