Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.!
పురుషులు స్పెర్మ్ ను మెరుగుపరుచుకోవడానికి సాధారణ మార్గాలు
వేగంగా మారుతున్న నగర జీవనం, జీవన విధానాలు, ఒత్తిడి, అలసట, మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి. వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు.
ఇన్ఫెర్టిలిటీ అనేది ఇప్పుడు సాధారణంగా వినిపిస్తున్న సమస్య. దీనికి చాలా కారణాలున్నాయి. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ అని చెప్పవచ్చు. వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, పొగత్రాగడం, పనిలో ఒత్తిడి.. ఇవన్నీ ప్రత్యుత్పత్తి లేకపోవడానికి కారణాలు.
పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించే సైలెంట్ కిల్లర్స్..?
ఇలాంటి కేసులు పెరగడానికి మరో కారణమేంటంటే.. పోషకాహారం తీసుకోకపోవడం. జింక్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ బావుంటుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఎక్కువ వాడటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తో పాటు క్వాలిటీ తగ్గిపోవడానికి కారనమవుతున్నాయి.
మగవాళ్లు, ఆడవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి నిత్యం తీసుకుంటున్న కెమికల్ ఫుడ్సే కారణమని తెలుస్తోంది. కాబట్టి బయట ఫుడ్ తీసుకోవడం మానేయాలి. అంతేకాదు కూరగాయలు, పండ్లు తినేముందు శుభ్రం చేయడం చాలా అవసరం.
స్పెర్మ్ కౌంట్ జీవనశైలి అలవాట్ల మీద ఆదారపడి ఉంటుందా?
మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్ల కారణంగానే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్మోకింగ్ మేల్ ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతోందని తాజాగా మాంచెస్టర్ యూనివర్సిటీ రీసెర్చ్ లో తేలింది. స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ క్వాలిటీ బాగుండాలంటే.. ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

బరువు:
పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనలో చాల మంది ఒబేసిటీ కి బానిసలూ అవుతున్నారు. ఉబకాయం వల్ల చాల సమస్యలు ఉన్నాయి అందులో ఈ సెక్స్ సమస్య కూడా ఒకటి. ఉబకయం ఉన్నవారిలో సెక్స్ గ్లాండ్స్ పని తీరు చాల నెమ్మదిగా ఉంటుంది. ఇది ఆడవారిలో ఉబకయం హర్మోనే పెరగటం అదే మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటం జరుగుతుంది. అనేక పరిశోధనలు లో ఒబేసిటీ వల్ల పురుషులు వృషణాల ఫంక్షన్ మరియు వీర్యకణాల సంఖ్య తగ్గినట్టు కనుగొన్నారు.

ఫొల్లెట్ :
ఫొల్లెట్ అనేది మహిళలకు మాత్రమే అవసరం అయినది కాదు, పురుషులకు కూడా అవసరమే . మన శరీరంలో ఫొల్లెట్ మంచిగా ఉంటుంది. ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తోనే శరీరానికి అందుతుంది . దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ తో క్యాలిక్యులేట్ చేస్తారు . ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నప్పుడు స్మెర్మ్ లో అసాధారణ క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి, ఫొల్లెట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

బ్యాడ్ హ్యాబిట్స్:
ఇప్పుడు మీరు ఈ విషయాన్నీ పదేపదే చెప్పిఉ౦టారు, కానీ మీరు దీన్ని గురించి పట్టించుకోకుండా ఉండడమే మంచిది. పొగత్రాగడం DNA వీర్యకణాలపై ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుంది, వీర్యకణాల అసమానతలను కలిగిస్తుంది. అరుదుగా పొగత్రాగడం వల్ల ప్రమాదం లేదని మీరు అనుకుంటే, మీరు మీ దురభిప్రాయాన్ని తొలగించుకోవడం చాలా అవసరం. మీరు బార్ లకు వెళ్ళినపుడు అన్నివైపుల నుండి వచ్చే ధూమపానాన్ని మీరు పీల్చడం వల్ల బిడ్డను కనే అవకాశాలను పోగొట్టుకుంటారు.పురుషుల వీర్యకణాలు తగ్గడానికి ముఖ్యకారణం పొగత్రాగడం. పొగత్రాగడం వల్ల వీర్యకణాలు జీవం కోల్పోవడం లేదా చురుకుగా ఉండకపోవటం జరగుతుంది. దాంతో పురుషుల్లో వంధ్యత్వానికి కారణం అంతుంది. కాబట్టి స్మోకింగ్ కూడా మనిషిని నపుంసకుడుని చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలకు కలగడానికి స్త్రీలైనా పురుషులైనా పొగత్రాగడం మానేయం చాలా మంచిది.

ఆల్కహాల్ కు దూరంగా :
మీరు ధూమపానం అనేది వీర్యకణాల సంఖ్యను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు. కానీ ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. అతిగా మద్యపానం సేవించిన కూడా సాధారణ స్పెర్మ్ కౌంట్ యొక్క స్థిరత్వంను పాడుచేసింది. ఎవరైతే పిల్లలు కావాలని అనుకుంటారో వారు మద్యం తాగటం మానివేయాలి. మద్యం తాగడం వల్ల మగవారిలో టెస్టో స్టిరాన్ లెవల్స్ తగ్గిపోతాయి. దాంతో మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మగవారిలో వంద్యత్వానికి ఇది ఒక ప్రాధాన కారణం. మద్యం వల్ల శరీరం జింక్ శోషణ చేయలేదు . జింక్ అనేది స్పెర్మ్ సెల్ ఏర్పడటానికి ఎంతో అవసరం.

ఒత్తిడి లేకుండా :
ముఖ్యంగా స్ట్రెస్ అనేది అనేక ఆరోగ్య సమస్యలతో పాటు స్పెర్మ్ కౌంట్ ను కూడా తగ్గిస్తుంది.నేడు జీవితం అంతా బిజీగా మారిపోయింది. ఇల్లు, ఆఫీసు మరియు ప్లేగ్రౌండ్ ఎక్కడైనా ఒత్తిడి ఉంటుంది. మీరు ఒత్తిడికి గురి అయినప్పుడు, ఒత్తిడి హార్మోన్స్ మీ స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావం చూపుతుంది. అలాగే మీ జీవనశైలి మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా ఒత్తిడి కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ఒత్తిడి వల్ల మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతియ్యడమే కాదు, ఒత్తిడి పురుషుల్లో వంధ్యత్వం సమస్యలకు దారితీస్తుంది.

మెడిసిన్:
కొన్ని రకాల మందులు స్మెర్మ్ క్వాలిటీ మరియు క్వాంటిటీ మీద ప్రభావం చూపుతుందన్న విషయం మీకు తెలుసా ? మీరు ఇదివరికే ఏదైనా ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్న మందుల ప్రభావాన్ని మీ డాక్టర్ వద్ద ప్రస్తావించాలి . ముఖ్యంగా పిల్లలకోసం ప్రయత్నించే వారికి ఇది అవసరం.

టాక్సిక్ ఎన్విరాన్ మెంట్:
టాక్సిక్ కెమికల్స్ చాలా హానికరమైనవి మరియు ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది . టాక్సిక్ మెటల్స్ కెమికల్స్ సాల్వెంట్స్ బాడీలో స్పెర్మ్ డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల టాక్సిక్ కాంపోనెంట్స్ కు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications