మీ శరీరం ప్రెగ్నెన్సీకు సిద్ధంగా ఉందని తెలిపే చిహ్నాలు

మీ శరీరం ప్రెగ్నెన్సీకు సిద్ధంగా ఉందని తెలిపే చిహ్నాలు

మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక ముఖ్యమైన మైలురాయని చెప్పుకోవచ్చు. మాతృత్వపు ఆనందాన్ని పొందాలని ప్రతి మహిళ కలలు కనడం సహజం.

కొంతమంది మహిళలు మాతృత్వాన్ని పొందడాన్ని ముఖ్యమైన విషయంగా భావిస్తారు. నిజానికి, జీవితపు లక్ష్యంగా భావిస్తారు. మరికొంతమంది, కెరీర్ కోసం మాతృత్వాన్ని కొన్నాళ్లు వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు. పరిస్థితులేవైనా, సమయం వచ్చినప్పుడు మాతృత్వానికి శరీరం సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పదకొండు నుంచి పదహారు సంవత్సరాల వయసులో ఆడపిల్లలు యుక్తవయస్సుకు వస్తారు. ప్రతి నెలా నెలసరి ఎదురవుతుంది. గర్భం దాల్చేందుకు అనువుగా ఉందని తెలిపే చిహ్నమిది.

Signs That Your Body Is Ready For Pregnancy

యవ్వన దశకు చేరిన అమ్మాయి, శారీరకంగా గర్భం దాల్చేందుకు సిద్ధంగా ఉందని అర్థం. అయితే, అమ్మాయి అతి పిన్న వయసులో శారీరకంగా అలాగే మానసికంగా గర్భం దాల్చేందుకు సిద్ధంగా ఉండదని గమనించాలి.

మెన్స్ట్రువల్ సైకిల్ లో ఒవ్యులేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓవరీస్ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది స్పెర్మ్ తో కూడితే మగువ గర్భంలో ఒక ప్రాణం పోసుకుంటుంది.

గర్భం దాల్చాలని అనుకుంటున్న వారు అలాగే ప్రెగ్నెన్సీని కొన్నాళ్ళు వాయిదా వేయాలని భావిస్తున్న వారు తామెప్పుడూ ఒవ్యులేట్ అవుతున్నారో తెలుసుకోవాలి.

ఈ రోజు, మెన్స్ట్రువల్ సైకిల్ ఫెర్టైల్ పీరియడ్ కి సంబంధించిన లక్షణాల గురించి తెలుసుకుందాం. గర్భం దాల్చాలని మీరు భావించినప్పుడు, ఈ సమయంలో ఇంటర్ కోర్స్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. గర్భం దాల్చడాన్ని కొన్నాళ్ళు మీరు వాయిదా చేయాలని భావిస్తున్నప్పుడు ఈ దశలో దగ్గరవ్వడాన్ని అవాయిడ్ చేయండి. మరిన్ని విషయాలకు ఈ ఆర్టికల్ ను చదవండి.

• సెర్వికల్ మ్యూకస్:

• సెర్వికల్ మ్యూకస్:

సెర్వికల్ మ్యూకస్ అనేది వెజీనా నుండి అయ్యే డిశ్చార్జ్. సెర్వికల్ మ్యూకస్ కి సంబంధించిన టెక్స్చర్ మరియు కన్సిస్టెన్సీ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ సమయంలో మారుతూ ఉంటుంది. మీరు ఫెర్టైల్ కానప్పుడు, సెర్వికల్ మ్యూకస్ అనేది పేస్ట్ లా మారుతుంది.

మీరు ఫెర్టైల్ అయినప్పుడు, డిశ్చార్జ్ అనేది కాస్తంత తక్కువ మందంగా ఉంటుంది. సాగదీసినట్టు, జిగటగా అలాగే ఎగ్ వైట్ లా ఉంటుంది. అందువలన దీన్ని ఎగ్ వైట్ సెర్వికల్ మ్యూకస్ అని కూడా అంటారు. ఈ మ్యూకస్ అనేది మీరు ఫెర్టైల్ గా ఉన్నప్పుడు స్పెర్మ్స్ ని ఎగ్ వరకు తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది.

• శరీర ఉష్ణోగ్రతలో మార్పు:

• శరీర ఉష్ణోగ్రతలో మార్పు:

శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనించడం మంచిది. ఈ పద్దతి ద్వారా మీ ఫెర్టైల్ పీరియడ్ ని మీరు అంచనా వేయగలుగుతారు. ఒవ్యులేషన్ కు రెండు రోజుల ముందు శరీర ఉష్ణోగ్రత తగ్గడాన్ని మీరు గమనించవచ్చు. ఒవ్యులేషన్ జరిగిన తరువాత, ఉష్ణోగ్రత మళ్ళీ పెరుగుతుంది. సాధారణ టెంపెరేచర్ కంటే ఎక్కువగా నమోదవుతుంది. నార్మల్ గా మారడానికి ముందు కొన్ని రోజుల వరకు టెంపరేచర్ లో ఈ విధమైన మార్పులను గమనించవచ్చు.

• ఫెర్టైల్ పీరియడ్ లో సెక్స్ పై ఆసక్తి పెరుగుతుంది:

• ఫెర్టైల్ పీరియడ్ లో సెక్స్ పై ఆసక్తి పెరుగుతుంది:

మెన్స్ట్రువల్ సైకిల్ లోని అత్యంత ఫెర్టైల్ గా ఉండే ఈ దశలో మీకు సెక్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీ శరీరం గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని మీకు తెలియచేస్తుంది.

• బ్రెస్ట్స్ మరింత సెన్సిటివ్ గా అలాగే టెండర్ గా మారవచ్చు:

• బ్రెస్ట్స్ మరింత సెన్సిటివ్ గా అలాగే టెండర్ గా మారవచ్చు:

సెన్సిటివ్ మరియు టెండర్ బ్రెస్ట్స్ అనేవి పీరియడ్స్ రావడానికి సూచికగా వ్యవహరిస్తాయి. ఐతే, ఒవ్యులేట్ అవడానికి కూడా ఇవి సూచికగా ఉంటాయి. అయితే, బ్రెస్ట్ లోని టెండర్ నెస్ మరియు సెన్సిటివిటీను సాధారణంగా పీరియడ్ కి ముందు వచ్చే లక్షణాలుగా భావిస్తారు. శరీరంలోని ప్రొజెస్టెరోన్ స్థాయి పెరగడం వలన ఇలా జరుగుతుంది. బ్రెస్ట్స్ కాస్తంత వాచుతాయి కూడా.

• సెర్విక్స్ పొజిషన్ లో మార్పు:

• సెర్విక్స్ పొజిషన్ లో మార్పు:

సెర్విక్ పొజిషన్ అనేది మెన్స్ట్రువల్ సైకిల్ ఒవ్యులేషన్ ఫేజ్ లో మార్పుకు గురవుతుంది. మీ శరీరం గర్భం దాల్చేందుకు సిద్ధంగా ఉందనేందుకు ఇది ఒక ముఖ్యమైన చిహ్నం. ఒవ్యులేటింగ్ ఫేజ్ లో జరిగే ఈ మార్పు ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉంటుంది.

మీ వేళ్ళను ఉపయోగించుకుని సెర్విక్స్ లో మార్పును గమనించవచ్చు. సెర్విక్స్ ఎంతో మృదువుగా మారి హైయర్ పొజిషన్ కు మారుతుంది. స్పెర్మ్స్ ఎంట్రెన్స్ సులభంగా ఉండేందుకు ఈ పొజిషన్ తోడ్పడుతుంది.

• తేలికపాటి నొప్పి:

• తేలికపాటి నొప్పి:

ఒవ్యులేషన్ సమయంలో తేలికపాటి నొప్పిని గమనించడం సహజం. ఈ నొప్పి అనేది పీరియడ్స్ కి సంబంధించిన నొప్పి కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. కొంతమంది మహిళలు ఈ నొప్పిని గమనించలేరు. ఒవ్యులేషన్ క్రామ్ప్స్ లేదా మిడ్ పెయిన్స్ ను మీరు పొత్తికడుపు కుడివైపున గాని లేదా ఎడమ వైపున గాని గుర్తించగలుగుతారు.

ఆ నొప్పులు కూడా సడెన్ గా మొదలవుతాయి. షార్ప్ గా ఉంటాయి. ఒవ్యులేషన్ సమయంలో పెయిన్ఫుల్ క్రామ్ప్స్ అనేవి వైద్యుల దృష్టికి తీసుకురావాలి.

• బ్లోటింగ్:

• బ్లోటింగ్:

పీరియడ్స్ రావడానికి ముందుగా మీరు కాస్తంత బ్లోటింగ్ ను గుర్తించగలుగుతారు. ఈ బ్లోటింగ్ అనేది ఒవ్యులేట్ అవడానికి ముందుగా జరుగుతుంది. ఉప్పగా అలాగే స్పైసీగా ఉండే వాటిని మీరు క్రేవ్ చేస్తారు. క్రేవింగ్స్ కి మీరు బానిసైతే మరింత బ్లోటింగ్ సమస్య వేధిస్తుంది. శరీరం ఒవ్యులేట్ అవుతున్నప్పుడు ఏర్పడే హార్మోనల్ చేంజెస్ వలన బ్లోటింగ్ సమస్య ఎదురవుతుంది.

• స్పాటింగ్:

• స్పాటింగ్:

కొంతమంది మహిళల్లో, ఒవ్యులేషన్ వలన కొంత స్పాటింగ్ లేదా చిన్నపాటి బ్లీడింగ్ కనిపిస్తుంది. అండర్ వేర్ ను వైప్ చేసినప్పుడు ఈ విషయాన్ని గుర్తించగలుగుతారు. దీన్నే మిడ్ సైకిల్ స్పాటింగ్ అంటారు. ఒవ్యులేషన్ బ్లీడింగ్ అనేది ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు జరుగుతుంది.

ఓవరీలోని బరస్ట్ అయిన ఎగ్ వలన బ్లీడింగ్ జరుగుతుంది. హార్మోన్స్ తో పాటు వాటి వలన ఎదురయ్యే మార్పులు కూడా మిడ్ సైకిల్ బ్లీడింగ్ కు దారితీస్తాయి. ప్రెగ్నన్సీ వలన ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ సమయంలో ఇలా జరుగుతుంది. స్పాటింగ్ ను గుర్తిస్తే కొన్ని రోజుల వరకు మీరు వెయిట్ చేయాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా నిర్ధారణకు రావాలి.

• తలనొప్పి:

• తలనొప్పి:

ప్రతినెలా ఒకే సమయంలో తలనొప్పి వేధిస్తే ఇది మీ శరీరం గర్భం దాల్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పే చిహ్నం. మీరు గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉన్నారని ఈ లక్షణం తెలుపుతోంది. పీరియడ్స్ రావడానికి ముందు ఇలా తరచూ అవుతున్నప్పుడు, మీరు ఫెర్టైల్ అవుతున్నారని ఇది సూచికగా వ్యవహరిస్తోంది.

• పింపుల్స్:

• పింపుల్స్:

కొంతమంది మహిళల్లో, పీరియడ్స్ రావడానికి కొన్నిముందు పింపుల్స్ దర్శనమిస్తాయి. ఒవ్యులేషన్ సమయంలో ఈ లక్షణాన్ని గ్రహించవచ్చు. శరీరంలోని జరిగే హార్మోనల్ ఛేంజెస్ వలన చర్మం ఆయిలీగా మారుతుంది. దాంతో పింపుల్స్ సమస్య వేధిస్తుంది. మీ శరీరం గర్భం దాల్చడానికి సిద్ధంగా ఉందనేందుకు ఇది చిహ్నం.

ఈ లక్షణాలన్నిటినీ మీరు గమనించడం ద్వారా గర్భం దాల్చేందుకు శరీరం సిద్ధంగా ఉన్న సమయాన్ని మీరు గుర్తించగలుగుతారు.

Desktop Bottom Promotion