Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం!
గర్భవతులకు చేసే ఎన్‌ఐపీటీ టెస్ట్ అంటే ఏంటి..?
గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో ఎన్నో మెడికల్ పరీక్షలను చేస్తారు. గర్భధారణ నుంచి ప్రెగ్నెన్సీ వరకు అటు బిడ్డకు ఇటు తల్లికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి శిశువు ఆరోగ్యంగా జన్మించడానికి సమస్యలుంటే ముందుగానే పరిష్కరించడానికి వైద్యులు తల్లికి కొన్ని డయగ్నాస్టిక్ టెస్టులను చేయిచుకోమంటారు. వీటిలో ఎన్‌ఐపీటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఎన్‌ఐపీటీ అంటే నాన్ ఇన్వేసివ్ ప్రీనాటల్ టెస్ట్.

ఎన్‌ఐపీటీ పరీక్షను ఎప్పుడు, ఎందుకు చేస్తారు..?
గర్భిణీలకు మొదటి త్రైమాసికంలో డబుల్ మార్కర్ అనే రక్తపరీక్షను చేస్తారు. ఇది గర్భసంచి, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్ష. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్‌లో రిస్క్ ఫ్యాక్టర్‌లు ఉంటాయ్. లో రిస్క్, ఇంటర్మీడియటరీ రిస్క్, మాడరేట్ రిస్క్, హైరిస్క్ ఉంటాయ్. ఇంటర్మీడియటరీ రిస్క్ ఉన్నా సరే వైద్యులు ఎన్‌ఐపీటీ పరీక్షను చేయించుకోమంటారు. తల్లికి నుంచి బిడ్డకు ఏవైనా జన్యుపరమైన సమస్యలు వెళ్తున్నాయా లేదా అని విషయాలను ఈ ఎన్‌ఐపీటీ ద్వారా వైద్యులు తెలుసుకుంటారు.
బిడ్డ క్రోమోజోములు
గర్భిణీలందరూ ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్‌ను ఖచ్చితంగా చేసుకోవాలని నియమం లేదు. కాని వైద్యులు కొంతమందికి మాత్రమే ఈ టెస్ట్‌ను చేయించుకోమంటారు. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్ చేస్తారు. తల్లికి 30 ఏళ్లకు మించి ఉంటే బిడ్డకు క్రోమోజోముల సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఇతర జన్యుపరమైన లోపాలు బిడ్డకు ఉండే అవకాశముంది. బిడ్డకు అలాంటి జన్యుపరమైన లోపాలను తెలుసుకోవడానికి గర్భిణీలకు ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్ చేస్తారు.
కడుపులో ఉండే బిడ్డ డీఎన్‌ఏ తల్లి రక్తంలో కలుస్తుంది. తల్లి రక్తపరీక్ష ద్వారా బిడ్డ డీఎన్‌ఏను స్టడీ చేసే అవకాశముంది. ఈ పరీక్షను 10వ వారం నుంచి 25వ వారం వరకు చేసుకోవచ్చు. ఈ ఎన్ఐపీటీ పరీక్ష వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యం, తల్లి ఆరోగ్యానికి సంబంధించిన మూడు సిండ్రోమ్‌ల గురించి తెలుసుకోగలుగుతాం. మొదటిది డైన్ సిండ్రోమ్, రెండవది ఎడ్వర్డ్స్ సిండ్రోమ్, ఇక మూడవది పాటవు సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్‌లో హైరిస్క్ ఉంటే బిడ్డకు జన్ముపరమైన సమస్య ఉందని ఓ అంచనాకు వస్తారు. ఈ సమస్య కుటుంబంలో ఎవరికైనా అంతకు ముందే ఉండవచ్చు లేదంటే పుట్టిన మొదటి బిడ్డకు ఉండవచ్చు.
ఎన్‌ఐపీటీ టెస్ట్‌లో ఏమి చేస్తారు
తల్లి చేతి నుంచి రక్త పరీక్ష కోసం రక్తాన్ని సేకరిస్తారు. గర్భసంచిలో ఉండే బిడ్డ రక్తకణాలు తల్లి రకంలో కలుస్తాయ్. ఈ ఎన్‌ఐపీటీ టెస్ట్ ద్వారా బిడ్డ క్రోమోజోముల విశ్లేషణ ఆరోగ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పరీక్షలో అన్ని క్రమోజోములను ఒక్కో క్రోమోజోమును విశ్లేషించుకుంటూ వచ్చి సమస్య ఏదైనా ఉందానని తెలుసుకొని ఎన్‌ఐపీటీ రిపోర్ట్ ఇస్తారు.
ఎన్‌ఐపీటీ టెస్ట్ ధర ఎంత ఉంటుంది ?
ఆసుపత్రులను, డయగ్నాస్టిక్ సెంటర్లను బట్టి ఈ నాన్ ఇన్వేసివ్ ప్రీ నాటల్ టెస్ట్ (ఎన్ఐపీటీ) ధర ఉంటుంది. కనీసం రూ.12,000 నుంచి రూ.16,000ల వరకు ఈ ఎన్ఐపీటీ పరీక్ష ఉంటుంది. ఇది కొంచం ఖరీదైన టెస్ట్‌గా చెప్పుకోవచ్చు. రిపోర్ట్ రావడానికి వారం సమయం పడుతుంది. పరీక్ష కోసం శరీరం నుంచి 10 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు.



Click it and Unblock the Notifications











