Latest Updates
-
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.!
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఉదయాన్నే లంచ్ బాక్స్ కి ఏం చేయాలి అని తల బద్దలు కొట్టుకుంటున్నారా? ఎప్పుడూ తినే వంటకాలు కాకుండా సరికొత్తగా లంచ్ బాక్స్ కి ఏం వండాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే వెల్లుల్లి సోయా రైస్(గార్లిక్ సోయా రైస్)బెస్ట్ ఆప్షన్. దీని వాసనకే మీకు కడుపు నిండిపోతుంది. ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ టేస్ట్ కన్నా కూడా ఇంకా రుచిగా ఉంటుంది.
జస్ట్ 10 నిమిషాల్లోనే వెల్లుల్లి సోయా రైస్ ని తయారుచేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, పిల్లలకు లంచ్ బాక్స్ కి అయినా కూడా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని ద్వారా మనకు టేస్ట్ తో పాటు శరీరానికి అవసరమైన అనేక పోషకాలు కూడా అందుతాయి. ఇంట్లోనే ఈజీగా గార్లిక్ సోయా తయారుచేసరుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

వెల్లుల్లి సోయా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పుదీనా
-కొత్తిమీర
-వెల్లుల్లి
-షాజీరా
-నల్ల మిరియాలు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-మీల్ మేకర్
-బాస్మతి రైస్
-క్యాప్సికమ్
-ఉప్పు
-ఆయిల్
-దాల్చిన చెక్క
-కరివేపాకు
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
వెల్లుల్లి సోయా రైస్ తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యం వండుకొని పక్కన పెట్టుకోండి.
-మీల్ మేకర్ ను కూడా నీటిలో నానబెట్టుకోండి
-తర్వాత మిక్సీ జార్ లో పుదీనా, కొత్తిమీర, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, గరం మసాలా(నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా)వేసి బాగా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు, క్యాప్సికమ్ చీలికలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి.
-అవి వేగాక అందులో ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ వేయండి,ఇందులో పసుపు వేసి బాగా కలపాలి. పెద్ద మంట మీద బాగా వేయిస్తే క్రంచీగా అవుతుంది. అప్పుడు అందులో ఉప్పు వేసి మెత్తం పట్టేలా బాగా కలుపుకోండి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మిశ్రమం వేసి బాగా కలిపి మూతపెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో బాస్మతి రైస్ వేసి మసాలా అంతా రైస్ కి పట్టేలా నిదానంగా కలపాలి.
-చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేయండి.
-అంతే వెల్లుల్లి సోయా రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
