Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
కార్తీక మాసం స్పెషల్: కర్ణాటక స్టైల్ మసాలా చిత్రాన్నం..10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ
మసాలా చిత్రాన్నం అనేది దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన, రుచికరమైన, సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. దీనిని ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంలో లేదా ఉపవాసాల సమయంలో కూడా తయారుచేస్తారు. లంచ్ బాక్స్ రెసిపీగా చాలా ప్రసిద్ధి. తక్కువ సమయంలో, సులభంగా, పోషకాలు అందిస్తూ రుచిగా ఉండే వంటకాన్ని తినాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.
సాధారణ చిత్రాన్నం(లెమన్ రైస్)కంటే మసాలా చిత్రాన్నంలో కొబ్బరి, మసాలాలను కలిపి తయారుచేసే ప్రత్యేకమైన పేస్ట్ ఉపయోగించడం వలన దీనికి మరింత ఘాటైన, ప్రత్యేకమైన రుచి వస్తుంది. కార్తీక మాసం సందర్భంగా ఉల్లి,వెల్లుల్లి లేకుండానే మసాలా చిత్రాన్నం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-కరివేపాకు
-కొత్తిమీర
-వేరుశెనగపప్పు
-పచ్చిశెనగప్పు
-మినపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-లవంగాలు
-అల్లం తురుము
-దాల్చిన చెక్క
-పచ్చికొబ్బరి
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-నూనె
-ఉప్పు
-పసుపు
-ఇంగువ
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒకటింపావు కప్పు కడిగిన బియ్యం, రెండుంపావు కప్పుల నీరు, 1 టీస్పూన్ నూనె,కొంచెం ఉప్పు వేసి అన్నాన్ని వండుకున్నట్లుగా వండుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత చిత్రాన్నం పేస్ట్ తయారీకోసం..మిక్సీ గిన్నెలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ అల్లం తురుము, 1 రెబ్బ కరివేపాకు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, పిడికెడు కొత్తిమీర కాడలతో సహా వేసి కొంచెం నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు వేసి చిట్లనిచ్చాక ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, అరటేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి వేసి వేయించాలి.
-తాలింపు బాగా వేగిన తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకు, చిటికెడు ఇంగువ, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేపాలి.
-వేగిన తాలింపులోనే గ్రైండ్ చేసిన చిత్రాన్నం పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. పేస్ట్ లోని చెమ్మ ఆరిన తర్వాత ఇందులో అర టీస్పూన్ పసుపు వేసి 1 నిమిషం వేయించాక ఇందులో ఉడికించి పూర్తిగా చల్లారిన అన్నం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-చివర్లో కావాలనుకుంటే కొంచెం నిమ్మరపం కూడా కలుపుకోవచ్చు. అంతే మసాలా చిత్రాన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





