Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే..
మారుతున్న కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా బాగా మారాయి. నేటి యువత, ముఖ్యంగా అబ్బాయిలు ఫిట్ నెస్ మీద అమితమైన శ్రద్ధ చూపుతున్నారు. జిమ్ లో గంటల తరబడి కష్టపడుతూ, డైట్ ఫాలో అవుతుంటారు. ఈ టైంలో పంచదారతో చేసిన సాధారణ స్వీట్లు ఇస్తే తినడానికి కాస్త వెనుకడుగు వేస్తారు. అయితే ఇలాంటి వాళ్ల కోసం ఉన్న ఒక అద్భుతమైన స్వీట్ పీనట్ బటర్ లడ్డూ.
ఈ లడ్డూల తయారీకి ఎక్కువ సమయం పట్టదు. చక్కెరతో పనిలేకుండా, పూర్తిగా ప్రోటీన్ తో నిండి ఉండే ఈ లడ్డూలను చాలా ఈజీగా మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పీనట్ బటర్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
తురిమిన ఎండు కొబ్బరి - ఒకటిన్నర కప్పు
సన్నగా తరిగిన జీడిపప్పు - పావు కప్పు
పీనట్ బటర్ (పల్లీల వెన్న) - 3/4 కప్పు
సన్నగా తరిగిన బాదం పప్పులు - పావు కప్పు
సన్నగా తరిగిన పిస్తా పప్పులు - పావు కప్పు
బిస్కెట్ పొడి - అర కప్పు
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
పీనట్ బటర్ లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో తురిమిన ఎండు కొబ్బరిని వేసి సన్నని మంటపై దోరగా, పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
-వేయించిన కొబ్బరి తురుమును ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. అందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు అసలైన పదార్థం పీనట్ బటర్ ను ఈ మిశ్రమంలో వేసి, అన్నీ కలిసేలా చేతితో బాగా మిక్స్ చేయాలి.
-డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, పీనట్ బటర్ అన్నీ కలిసిపోయి మెత్తని ముద్దగా (బైండింగ్ అయ్యేలా) మారే వరకు బాగా కలపాలి.
-ఇప్పుడు మీ అరచేతులకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో గుండ్రని లడ్డూల్లా చుట్టుకోండి.
-ఇప్పుడు ఒక ప్లేట్ లో బిస్కెట్ పొడిని తీసుకుని, తయారుచేసుకున్న లడ్డూలను ఆ పొడిలో అటూ ఇటూ దొర్లించండి. ఇలా చేయడం వల్ల లడ్డూలకు బయట మంచి క్రంచ్ వస్తుంది.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ప్రోటీన్ రిచ్ పీనట్ బటర్ లడ్డూలు రెడీ. వాటి పైన కొన్ని పిస్తా పలుకులతో గార్నిష్ చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
