Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తిన్న బెంగాల్ స్పెషల్ ఝల్ మురి..5 నిమిషాల్లోనే చేసుకోండిలా..
సాయంత్రం పూట లేదా టీ తాగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా ఏదైనా కారంగా, పుల్లగా, కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. కానీ వంటగదిలో గంటల తరబడి కష్టపడటం, నూనె వంటకాలు చేయడం ఇష్టం ఉండదు. అలాంటి సమయాల్లో వెంటనే గుర్తొచ్చే, అత్యంత సులభంగా చేసుకోగలిగే అద్భుతమైన చిరుతిండి ఝల్ మురి.
బెంగాల్ వీధుల్లో, ముఖ్యంగా కోల్ కతా నగరంలో దొరికే ఈ ఝల్ మురి రుచికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తాజాగా తన బెంగాల్ ఎన్నికల ప్రచార సమయంలో ఓ షాపు దగ్గర ఆగి ఝల్ మురి కొనుక్కొని తిన్నారు. దీని తయారీకి ఎలాంటి ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. మన ఇంట్లో నిత్యం ఉండే సాధారణ పదార్థాలతోనే దీనిని చాలా వేగంగా తయారు చేసుకోవచ్చు. బెంగాలీ స్టైల్ ఝల్ మురి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బెంగాలీ స్టైల్ ఝల్ మురి తయారీకి కావలసిన పదార్థాలు
కరకరలాడే మరమరాలు - 2 కప్పులు
బంగాళదుంప - 1
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
సన్నగా తరిగిన టమాటో - 1
వేయించిన పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
వేయించిన శనగలు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి ముక్కలు - కొద్దిగా
పచ్చిమిర్చి - 1
తాజా కొత్తిమీర - కొద్దిగా
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్) - 1 టేబుల్ స్పూన్
ఉప్పు-రుచికి సరిపడా
కారం, వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్ చొప్పున
చాట్ మసాలా - అర టీస్పూన్
బెంగాలీ స్టైల్ ఝల్ మురి తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటో ముక్కలు, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి స్పూన్ తో బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమంలో కరకరలాడే మరమరాలను వేయండి. మరమరాలు విరిగిపోకుండా చాలా సున్నితంగా కలపాలి.
-ఆ తర్వాత, ఝల్‌మురికి అసలైన వీధి రుచిని తీసుకొచ్చే ఆవ నూనెను పైన చల్లండి. దీంతో పాటు ఉప్పు, నల్ల ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మసాలాలన్నీ మరమరాలకు పట్టేలా పైకి కిందకి ఎగురవేస్తూ కలపండి.
-చివరగా ఈ మిశ్రమంపై తాజా నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లండి. అంతే నోరూరించే స్పైసీ బెంగాలీ ఝల్ మురి సిద్ధం.
-ఝల్ మురి కరకరలాడుతూ ఉండాలంటే నిమ్మరసం, మరమరాలు ఎప్పుడూ తినే ముందు మాత్రమే కలపాలి. ఆవనూనె వాడటం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే దాని ఘాటు వల్లే ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. మరింత క్రంచీగా కావాలంటే పైన సన్నటి కారప్పూస (సేవ్) చల్లుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
