For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూమటర్ గ్రేవీ రెసిపీ: ఇంట్లోనే ఆలు బఠానీ రెసిపీని ఎలా తయారు చేయాలి?

Posted By: Ashwini Pappireddy
|

పంజాబ్ రాష్ట్రం నుండి వచ్చిన ఆలు మటర్ గ్రేవీ ఒక ఫేమస్ వంటకం. ఇది కేవలం పంజాబ్ లోనే కాకుండాఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాల లో ప్రాముఖ్యం పొందింది. మటర్

ఆలుమటర్ గ్రేవీ ని ముఖ్యంగా రొటీస్ తో మరియు రైస్ కి సైడ్ డిష్ గా తయారుచేస్తారు. దీనిని ఆలో, బఠానీలను కొన్ని టమోటా లతో మరియు కొన్ని మసాలాలతో కలిపి ఈ రెసిపీ ని తయారుచేస్తారు. తరువాత దీనిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించి బాగా ఉడికిన తరువాత కొత్తిమీర ఆకుల తో గార్నిష్ చేస్తారు అంతే అందరికి ఎంతో ఇష్టమైన ఆలు మటర్ గ్రేవీ రెడీ!

అంతేకాకుండా, ఆలు మటర్ గ్రేవీ లో మనందరం ఎంతో ఇష్టపడే బంగాళదుంపలు మరియు బటానీలను కలిగి ఉంటుంది. సిల్కీ మరియు స్పైసి రిచ్ గ్రేవీతో పాటు తీపి ని అందించే బఠాణి మరియు బంగాళాదుంప ని ప్రతి ఒక్కరూ మరింత కావాలని అడిగి మరీ తింటారు.

ఆలు మటర్ గ్రేవీ సాధారణంగా రెస్టారెంట్ల లో ఎక్కువగా సర్వ్ చేస్తుంటారు. కానీ మీరు కూడా మీఇంటిలో ఈ వంటకాన్ని ప్రయత్నించాలనుకుంటే, ఆ వీడియోను చూసి చిత్రాలతో సహా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేర్చుకోండి.

ఆలూ మటర్ గ్రేవీ వీడియో రెసిపీ| అలు గ్రేవీని ఎలా సిద్ధం చేయాలి? పొటాటో పీస్ గ్రేవీ రెసిపీ| ఆలూ
మటర్ కర్రీ రెసిపీ | బంగాళాదుంప ఆలు మటర్ గ్రేవీ రెసిపీ | ఆలు మటర్ గ్రేవీ ని సిద్ధం చేయడం ఎలా| బంగాళాదుంప బఠానీ గ్రేవీ రెసిపీ | బంగాళాదుంప బఠానీ కరివేపాకు రెసిపీ
Prep Time
10 Mins
Cook Time
30M
Total Time
40 Mins

Recipe By: మీనా భండారీ

Recipe Type: సైడ్ డిష్

Serves: 3-4 వక్తులకి సరిపోతుంది

Ingredients
 • ఉల్లిపాయ - 1 కప్పు (తరిగినవి)

  టమోటా - 2 టమోటాలు (పొడవుగా కట్ చేసినవి)

  నూనె - 1 టేబుల్ స్పూన్ + 2½ టేబుల్ స్పూన్లు

  వెల్లుల్లి లవంగాలు - 4 (ఒలిచినవి)

  అల్లం - 1 స్పూన్ (తురిమిన)

  పచ్చి మిరపకాయలు - 1 స్పూన్ (తరిగినవి)

  బంగాళ దుంపలు - 3

  గ్రీన్ పీస్ - 1 కప్

  జీరా - 1 స్పూన్

  ఉప్పు - 2 స్పూన్

  పసుపు పొడి - ¼ టీస్పూన్

  ఎర్ర కారం పొడి - 2 స్పూన్

  ధనియ పౌడర్ - 2 స్పూన్

  నీరు - 1 కప్

  గరం మసాలా - ½ స్పూన్

  జీరా పౌడర్ - ½ స్పూన్

How to Prepare
 • 1.మొదట ఒక పాన్ ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెని జతచేసి వేడిచేయండి.

  2. ఇప్పుడు తరివుంచిన ఉల్లిపాయలను జోడించండి.

  3. వాటిని బంగారు గోధుమ రంగులోకి మారేంతవరకు వేయించండి.

  4. ఇప్పుడు కట్ చేసుకొని సిద్ధంగా ఉంచిన టమోటాలను జోడించండి మరియు ఒక నిమిషం పాటు బాగా కలపండి.

  5. దానికి తురుముకున్న అల్లం మరియు 4 వెల్లుల్లి పాయలను కలపండి.

  6. ముందే తరిగిన మిరపకాయలను వేసి, ఒక నిమిషం పాటు బాగా కలపండి.

  7. టమోటాలు చర్మం ఊడిపోవడం ప్రారంభమవుతుంది.

  8. ఇప్పుడు దీనిని 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి.

  9. ఇంతలోపు, శుభ్రంగా కడిగిన 3 బంగాళాదుంపలను తీసుకొని పైన వున్న తొక్కుని తొలగించండి.

  10. అంతేకాక, వాటిని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ ల కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి.

  11. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని పైన వేయించి ఉంచిన టమేటా మిశ్రమాన్ని నింపండి

  12. ఒక మృదువైన పేస్ట్ వచ్చేదాకా దీనిని గ్రైండ్ చేసుకొని దానిని పక్కన పెట్టుకోండి.

  13. ఇప్పుడు, 2½ టేబుల్ స్పూన్ల నూనెను ఒక వంట పాత్రలో తీసుకొని వేడి చేయండి.

  14. దానికి జీరాని కూడా జోడించి కాసేపు వేడి అవడానికి అనుమతించండి.

  15. ఈ మిశ్రమానికి ఇందాక కట్ చేసుకొని ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలపండి. దీనిని

  కొన్ని నిముషాల పాటు ఉడికించనివ్వండి.

  16. కాసేపటి తరువాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి.

  17. ఇప్పుడు ఉప్పు మరియు పసుపు పొడిని కూడా జత చేయండి.

  18. తరువాత ఎర్ర కారం పొడి మరియు ధనియ పొడి మిగిలిన మసాలాలు జతచేసి బాగా కలపండి.

  19. ఆకుపచ్చ బటానీలను వేసి మళ్లీ కలపాలి.

  20. ఇంకా, ఒక కప్పు నీటిని కలపండి.

  21. మూత మూసివేయండి మరియు 3 విజిల్స్ వరకు ఉడికించండి.

  22. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ని ఆపేసి, ప్రెషర్ తగ్గేవరకూ ఉండనివ్వండి.

  23. ఇప్పుడు, మూత తెరిచి గరం మసాలా మరియు జీరా పొడిని దానిపై చల్లండి.

  24. చివరగా, కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి.

  25. వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.

Instructions
 • - బంగాళాదుంపలను ఉడకబెట్టే ముందు కచ్చితంగా కడిగేలా చూసుకోండి. - వేయించని ఉల్లిపాయలు మరియు టమోటాలను చేర్చడానికి మరియు వేయించిన ఉల్లిపాయలు మరియు టమోటాల ను కలపడానికి చాలా వేరియేషన్ ఉంటుందని గమనించాలి. - అన్నింటిని ముందే వేయించాము కాబట్టి ఎక్కువసేపు బాగా వేయించాల్సిన అవసరం లేదు. - కనీసం 3 విజిల్స్ వచ్చేదాకా దీనిని ఉడికించేలా చూసుకోండి.
Nutritional Information
 • సెర్వింగ్ సైజు - 1 కప్
 • కేలరీలు - 123cal
 • కొవ్వు - 3.7 గ్రా
 • ప్రోటీన్ - 4.11 గ్రా
 • కార్బోహైడ్రేట్లు - 20.6 గ్రా
 • షుగర్ - 3.94 గ్రా
 • ఫైబర్ - 5.1 గ్రా

1.మొదట ఒక పాన్ ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనెని జతచేసి వేడిచేయండి.

2. ఇప్పుడు తరివుంచిన ఉల్లిపాయలను జోడించండి.

3. వాటిని బంగారు గోధుమ రంగులోకి మారేంతవరకు వేయించండి.

4. ఇప్పుడు కట్ చేసుకొని సిద్ధంగా ఉంచిన టమోటాలను జోడించండి మరియు ఒక నిమిషం పాటు బాగా కలపండి.

5. దానికి తురుముకున్న అల్లం మరియు 4 వెల్లుల్లి పాయలను కలపండి.

6. ముందే తరిగిన మిరపకాయలను వేసి, ఒక నిమిషం పాటు బాగా కలపండి.

7. టమోటాలు చర్మం ఊడిపోవడం ప్రారంభమవుతుంది.

8. ఇప్పుడు దీనిని 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి.

9. ఇంతలోపు, శుభ్రంగా కడిగిన 3 బంగాళాదుంపలను తీసుకొని పైన వున్న తొక్కుని తొలగించండి.

10. అంతేకాక, వాటిని చిన్న చిన్న ముక్కలుగా క్యూబ్స్ ల కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి.

11. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని పైన వేయించి ఉంచిన టమేటా మిశ్రమాన్ని నింపండి

12. ఒక మృదువైన పేస్ట్ వచ్చేదాకా దీనిని గ్రైండ్ చేసుకొని దానిని పక్కన పెట్టుకోండి.

13. ఇప్పుడు, 2½ టేబుల్ స్పూన్ల నూనెను ఒక వంట పాత్రలో తీసుకొని వేడి చేయండి.

14. దానికి జీరాని కూడా జోడించి కాసేపు వేడి అవడానికి అనుమతించండి.

15. ఈ మిశ్రమానికి ఇందాక కట్ చేసుకొని ఉంచుకున్న బంగాళదుంపలను వేసి బాగా కలపండి. దీనిని

కొన్ని నిముషాల పాటు ఉడికించనివ్వండి.

16. కాసేపటి తరువాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి.

17. ఇప్పుడు ఉప్పు మరియు పసుపు పొడిని కూడా జత చేయండి.

18. తరువాత ఎర్ర కారం పొడి మరియు ధనియ పొడి మిగిలిన మసాలాలు జతచేసి బాగా కలపండి.

19. ఆకుపచ్చ బటానీలను వేసి మళ్లీ కలపాలి.

20. ఇంకా, ఒక కప్పు నీటిని కలపండి.

21. మూత మూసివేయండి మరియు 3 విజిల్స్ వరకు ఉడికించండి.

22. 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ని ఆపేసి, ప్రెషర్ తగ్గేవరకూ ఉండనివ్వండి.

23. ఇప్పుడు, మూత తెరిచి గరం మసాలా మరియు జీరా పొడిని దానిపై చల్లండి.

24. చివరగా, కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేయండి.

25. వేడి వేడి గా సర్వ్ చేసుకోండి.

[ 3.5 of 5 - 111 Users]