Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఆలూ పన్నీర్ కోఫ్తా రిసిపి : వీడియో..
ఉత్తరభారత సంప్రదాయ స్నాక్ ఆలూ పన్నీర్ కోఫ్తాను బంగాళదుంపలు మరియు పన్నీర్ తో తయారుచేస్తారు. దీన్ని పండగలు, పార్టీలు, ఉత్సవాలప్పుడు తయారుచేస్తారు. దీన్ని టీతో పాటు ఆనందంగా తింటారు.
కానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే పండగలప్పుడు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని వాడరు. మిగతాసమయాలలో వాటిని కూడా వాడతారు.
ఆలూ పనీర్ కోఫ్తాను ఉడికించిన పనీర్, ఆలూను, రకరకాల దినుసులతో కలిపి ఓవల్ ఆకారపు ముద్దల్లో వేయించి చేస్తారు. దీన్ని టమాటా సాస్ లేదా ఏదన్నా చట్నీతో కలిపి తింటారు. పుదీనా చట్నీ దీంతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.
స్టెప్ బై స్టెప్ విధానంతో కూడిన వీడియో రెసిపిని చూసి నేర్చుకోండి.

Recipe By: మీనా బంఢారి
Recipe Type: చిరుతిళ్ళు
Serves: 6 ముక్కలు
-
ఉడికించిన బంగాళదుంపలు (చెక్కుతీసినవి) - 2
పన్నీర్ - 100గ్రాములు
రాళ్ళ ఉప్పు - 2చెంచాలు
పాలపొడి -1చెంచా
పొడిచేసిన నల్ల మిరియాలు - 2చెంచాలు
ఎర్ర కారం - 1చెంచా
పచ్చిమిర్చి (బాగా తరిగినది) - 1చెంచా
కొత్తిమీర (సన్నగా తరిగినది) - 1చెంచా
మొక్కజొన్న పిండి -2చెంచాలు + కోటింగ్ కి
డ్రైఫ్రూట్ల మిశ్రమం (తరిగినవి) -1/4వ కప్పు
నూనె - వేయించటానికి
-
1. ఉడికించిన బంగాళదుంపలను ఒక కలిపే గిన్నెలో వేయండి.
2. పన్నీర్ ను వేసి బాగా ఉండలుకట్టకుండా కలపండి.
3. రాళ్ళ ఉప్పు, పాలపొడిని జతచేయండి.
4. పొడిచేసిన నల్ల మిరియాలు, ఎండుకారాన్ని వేయండి.
5. ఇంకా, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేయండి.
6. రెండు చెంచాల మొక్కజొన్న పొడిని వేసి బాగా కలపండి.
7. ఈ మిశ్రమాన్ని రెండుగా విభజించి చేతులతో ముద్దలుగా చేయండి.
8. మధ్యలో మీ వేలితో గుంటను చేయండి.
9. డ్రై ఫ్రూట్ల మిశ్రమాన్ని ఒక చెంచాడు అందులో వేయండి.
10. దాన్ని మూసేసి ఓవల్ ఆకారంలో ముద్దగా వత్తండి.
11. ఒక పళ్ళెంలో మొక్కజొన్న పిండిని కోటింగ్ లా రాయండి.
12. కోఫ్తాపై కూడా ఈ పిండిని రాయండి.
13. తర్వాత కోఫ్తాలను ఫ్రిజ్ లో అరగంట ఉండనివ్వండి.
14. నూనెను వేయించడానికి బాండీలో వేడిచేయండి.
15. ఈ కోఫ్తాలను ఒకదాని తర్వాత మరొకటి వేయించండి.
16. రెండు వైపులా బాగా వేగనివ్వండి.
17. గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి బయటకి తీయండి.
18. వేడిగా వడ్డించండి.
- 1.పాల పొడి బదులు ఎండుకొబ్బరి వేసి కోఫ్తాను మరింత రుచికరం చేయవచ్చు.
- 2. నచ్చిన డ్రైఫ్రూట్ ను వాడవచ్చు.
- 3.మామూలు రోజుల్లో వండేటట్లయితే ఉల్లి, వెల్లుల్లి వాడవచ్చు.
- వడ్డించే పరిమాణం - ఒకటి
- క్యాలరీలు - 208 క్యాలరీలు
- కొవ్వు - 20గ్రాములు
- ప్రొటీన్ - 10 గ్రాములు
- కార్బొహైడ్రేట్లు - 40గ్రాములు
- ఫైబర్ - 3గ్రాములు
స్టెప్ బై స్టెప్ - ఆలూ పన్నీర్ కోఫ్తా ఎలా చేయాలి
1. ఉడికించిన బంగాళదుంపలను ఒక కలిపే గిన్నెలో వేయండి.

2. పన్నీర్ ను వేసి బాగా ఉండలుకట్టకుండా కలపండి.

3. రాళ్ళ ఉప్పు, పాలపొడిని జతచేయండి.

4. పొడిచేసిన నల్ల మిరియాలు, ఎండుకారాన్ని వేయండి.

5. ఇంకా, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేయండి.

6. రెండు చెంచాల మొక్కజొన్న పొడిని వేసి బాగా కలపండి.

7. ఈ మిశ్రమాన్ని రెండుగా విభజించి చేతులతో ముద్దలుగా చేయండి.

8. మధ్యలో మీ వేలితో గుంటను చేయండి.

9. డ్రై ఫ్రూట్ల మిశ్రమాన్ని ఒక చెంచాడు అందులో వేయండి.

10. దాన్ని మూసేసి ఓవల్ ఆకారంలో ముద్దగా వత్తండి.

11. ఒక పళ్ళెంలో మొక్కజొన్న పిండిని కోటింగ్ లా రాయండి.

12. కోఫ్తాపై కూడా ఈ పిండిని రాయండి.

13. తర్వాత కోఫ్తాలను ఫ్రిజ్ లో అరగంట ఉండనివ్వండి.

14. నూనెను వేయించడానికి బాండీలో వేడిచేయండి.

15. ఈ కోఫ్తాలను ఒకదాని తర్వాత మరొకటి వేయించండి.

16. రెండు వైపులా బాగా వేగనివ్వండి.

17. గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి బయటకి తీయండి.

18. వేడిగా వడ్డించండి.

Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.

Click it and Unblock the Notifications