Latest Updates
-
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.! -
నెలసరి సమయంలో చేసే పొరపాట్లు.. శానిటరీ ప్యాడ్లో ఇది ఉందో లేదో చెక్ చేసుకుంటున్నారా.? -
జలుబు, దగ్గుని ఒక్కరోజులో మాయం చేసే పాతకాలంనాటి ఘాటైన రసం.. ఐదే నిమిషాల్లో రెడీ -
రోడ్డుపై పెరిగే బిచ్చగాళ్ల పిల్లలు వ్యాక్సిన్లు లేకపోయినా.. హెల్తీగా, స్ట్రాంగ్ గా ఎందుకు కనబడతారు?
Ambani laddu: అంబానీ లడ్డూ..తినాలంటే అదృష్టం ఉండాలి..ఎలా చేయాలో వీడియో చూడండి
స్వీట్లు అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. స్వీట్లలో బోలెడు రకాలు ఉంటాయి. కొంతమంది అయితే మార్కెట్ లో దొరికే అన్నిరకాల స్వీట్లను ట్రై చేసి కొత్తగా ఏదైనా ఉందా అని అడుగుతుంటారు. అలాంటివారి కోసం ఓ కొత్త స్వీట్ వచ్చేసింది. సోషల్ మీడియాలో ఈ కొత్త డెజర్ట్(new dessert) వైరల్ అవుతోంది.
ఇషిక సాహు అనే ఫుడ్ కంటెంట్ క్రియేటర్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ రెసిపీ ఇప్పుడు తెగ వైరల్ అయింది. ఆ రెసిపీకి ఆమె పెట్టిన పేరు అంబానీ లడ్డూ(Ambani laddu). ఫుడ్ లవర్స్ ఈ అంబానీ లడ్డూ విపరీతంగా ఆకర్షిస్తోంది. బాదం,జీడిపప్పు,పిస్తా వంటి అనేక ఇతర నట్స్ తయారుచేసిన అంబానీ లడ్డూ చూస్తుంటునే నోరూరిపోతుందంటూ ఒక్క ముక్క తిన్నా స్వర్గమే అంటూ ఫుడ్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇన్ స్ట్రామ్ లో వైరల్ గా అంబానీ లడ్డూ చేయడం చాలా సింపుల్. టేస్ట్ విషయానికొస్తే ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నా ఆహాహా అనాల్సిందే మరి. మరి అసలు అంబానీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
అంబానీ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాదంపప్పు
-జీడిపప్పు
-పిస్తా పప్పు
-విత్తనాలు లేని ఖర్జూరం
-ఎండిన ఆప్రికాట్స్
-అంజీర్(మేడిపండు),నువ్వులు,మఖానా
అంబానీ లడ్డు తయారీ విధానం
-అంబానీ లడ్డూ చేయడానికి ముందుగా బాదం, జీడిపప్పు పిస్తాలను ఒక పెద్ద గిన్నెలో తీసుకుని మెత్తగా కట్ చేసుకోవాలి. ఈ మూడు పదార్థాల మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మఖానాను(Makhana) మిక్సీలో ముతకగా గ్రైండ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. దీంతో మీ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉంటాయి.
-ఇప్పుడు ఓ బాండీలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు మీడియం మంట మీద తేలికపాటి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత పిస్తా వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. బాదంపప్పులు లేత బంగారు రంగులోకి మారినప్పుడు వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి.
-ఇప్పుడు ఖర్జూరం,ఎండిన ఆప్రికాట్లు, అంజీర్ వేడి చేయాలి. సువాసన వచ్చేవరకు వేయించిన తర్వాత దానికి డ్రై ఫ్రూట్స్ మిక్సర్ వేయాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేస చల్లారిన తర్వాత సులభంగా లడ్డూలను తయారు చేసి నువ్వుల పిండికి అద్ది పక్కన పెట్టుకోండి. కొద్ది సేపటి తర్వాత ఈ లడ్డూ తింటే అబ్బబ్బా అంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications