Latest Updates
-
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం!
అసిడిటీకి చెక్ పెట్టే, గట్ హెల్త్ పెంచే హెల్తీ స్నాక్..ఈ బ్రాహ్మణ స్టైల్ అరటిపువ్వు వడ ట్రై చేయండి!
తమిళనాడులో దాదాపుగా సంప్రదాయ పంక్షన్స్ లో అరటిపువ్వు వడను వడ్డిస్తుంటారు. వర్షకాలం సాయంత్రాలకు పర్ఫెక్ట్ స్నాక్ ఇది. . చాలా తక్కువ నూనె పీల్చుతాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి, ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కార్బ్స్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒక్కసారి అయినా దీనిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల గట్ హెల్త్ కి మేలు జరుగుతుంది. ముఖ్యంగా అసిడిటీ సమస్య ఉన్నవాళ్లకు అయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనిని చాలా తీరులుగా చేస్తుంటారు. అయితే బ్రాహ్మణ స్టైల్ లో అరటిపువ్వు వడ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

అరటిపువ్వు వడ తయారీకి కావాల్సిన పదార్ధాలు
-అరటిపువ్వు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-ఉప్పు
-పచ్చి శెనగపప్పు
-కరివేపాకు
-జీలకర్ర
-పసుపు
-ఉల్లిపాయ
-నూనె
అరటిపువ్వు వడ తయారీ విధానం
-ముందుగా 2 కప్పుల పచ్చి శెనగపప్పుని గంట సేపు నీటిలో నానబెట్టుకోండి.
-అరటిపువ్వు సన్నని తరుగుని మజ్జిగలో కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
-1 గంట తర్వాత మిక్సీ జార్ లో నానబెట్టుకున్న పచ్చి శెనగపప్పు, అరకప్పు లేత అరటిపువ్వు, 5 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, నానబెట్టిన అరటిపువ్వు సన్నని తరుగు, ఉప్పు వేసి నీళ్లు అతి మితంగా వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఇందులో 2 పచ్చిమిరపకాయల సన్నని ముక్కలు వేసి చేతులతో బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇందులో కావాలనుకుంటే అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవచ్చు.
-ఇప్పుడు అరటి ఆకుని తీసుకొని తడి చేసుకొని దానిమీద కలుపుకున్న జామకాయంత పిండి ముద్దను పెట్టి కాస్త పలుచగా వడల్లా వత్తుకోవాలి. వడ మధ్యలో చిన్న రంధ్రంలా పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. వేడెక్కిన ఆయిల్ లో వత్తుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసుకోండి.
-వడలు వేసిన వెంటనే గరిటతో కదపకూడదు. ఒక నిమిషం తర్వాత వాటిని రెండో వైపుకు తిప్పుకోవాలి.
-మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి, వడలు లోపల వరకు ఉడికి, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ (బంగారు గోధుమ రంగు) వచ్చి కరకరలాడే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి.
-వడలు క్రిస్పీగా మారి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. బాగా వేగిన వడలను జల్లి గరిటెతో తీసి, అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే అరటిపువ్వు వడలు రెడీ. వీటిని వేడిగా ఉన్నప్పుడే నచ్చిన చట్నీతో తిన్నా లేదా ఉత్త వడలే తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
