Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే!
భోజనం చేసేటప్పుడు ఇంట్లో కూర ఏమీ లేకపోయినా, లేక నోటికి ఏదీ రుచించనప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది కమ్మటి పొడులు. అందులోనూ ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం పొడి గురించి ఎంత చెప్పినా తక్కువే.
వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, ఈ పొడి కలుపుకుని తింటే ఆ రుచి అద్భుతం, అమృతం. సాధారణ భోజనాన్ని సైతం మరో స్థాయికి తీసుకెళ్లే ఈ కొబ్బరి కారం పొడిని ఇంట్లోనే సులభంగా, ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కొబ్బరి కారం తయారీకి కావల్సినవి
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు (100 గ్రాములు)
పచ్చి శెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మినపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
తెల్ల నువ్వులు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
పొడవాటి ఎండుమిర్చి - 8 నుంచి 10
కరివేపాకు - ఒక గుప్పెడు
వెల్లుల్లి రెబ్బలు - 6 నుంచి 8
ఉప్పు - 1 టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
పోపు (తాలింపు) కోసం
ఆవాలు - అర టీస్పూన్
పచ్చి శెనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
పల్లీలు (వేరుశెనగ గుళ్లు) - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - పావు టీస్పూన్
ఇంగువ - ఒక చిటికెడు
కరివేపాకు - కొద్దిగా
నూనె - 1 టీస్పూన్
కొబ్బరి కారం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోవాలి. అందులో పచ్చి కొబ్బరి తురుమును వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. కొబ్బరిలోని తేమ పూర్తిగా పోయి, కాస్త పొడిపొడిగా అయ్యేవరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో 2 టీస్పూన్ల నూనె వేసి పచ్చి శెనగపప్పు, మినపప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు వచ్చే కమ్మటి వాసన ఇల్లంతా పరుచుకుంటుంది. ఇవి మాడిపోకుండా చూసుకుని, ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి.
-వేయించిన దినుసులన్నీ ఒక పళ్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ దినుసులను మిక్సీ జార్ లో తీసుకుని, అందులోనే వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు, ముందుగా వేయించిన కొబ్బరి వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లా కాకుండా కాస్త బరకగా ఉంటేనే అన్నంలో పంటికి తగులుతూ రుచిగా ఉంటుంది.
-ఇప్పుడు ఒక చిన్న కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. చివరగా కరివేపాకు, పసుపు, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.
-ఈ కమ్మటి పోపును మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే గుమగుమలాడే కారం పొడి రెడీ. సుమారు 200 నుంచి 250 గ్రాముల కొబ్బరి కారం పొడి తయారవుతుంది.
-ఇందులో మనం పచ్చి కొబ్బరి వాడాము కాబట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా చేస్తే 7 నుంచి 10 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
