Latest Updates
-
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే?
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే!
తెలంగాణలో సందర్భం ఏదైనా పంక్షన్ అంటే బగారా రైస్ ఉండి తీరాల్సిందే. పంక్షన్ లోనే కాదు. చాలామంది తరచుగా తమ ఇళ్లల్లో దీనినే ఎక్కువగా తయరుచేసుకుంటుంటారు. సరైన పద్ధతిలో చేయాలే కానీ దీని ముందు ఏ బిర్యానీలు, పులావ్ లు పనికరావు. అంత రుచిగా ఉంటుంది.
ఇక ఈ బగారా రైస్ కి పనీర్ కర్రీ తోడుంటే ఇక ముద్ద నోట్లో పెట్టుకుంటే స్వర్గంలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ స్టైల్ లో టేస్టీ బగారా రైస్, పనీర్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పనీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉప్పు
-నెయ్యి
-లవంగాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-పనీర్
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయలు
-టమాటోలు
-జీడిపప్పు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-జీలకర్ర పొడి
-కసూరి మేథీ
-గరం మసాలా
-కొత్తిమీర
బగారా రైస్ తయారీకి కావాల్సినవి
-బాస్మతి బియ్యం
-నెయ్యి
-నూనె
-లవంగాలు
-దాల్చిన చెక్క
-రాతి పువ్వు
-బిర్యానీ ఆకు
-అనాస పువ్వు
-షాజీరా
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కొత్తిమీర
-పుదీనా
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు!
పనీర్ కర్రీ, బగారా రైస్ తయారీ విధానం
-ముందుగా బగారా రైస్ చేసుకునేందుకు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్(500-600 గ్రాములు) వేసుకోండి. ఇందులో నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి.
-బియ్యం నానేలోగా పనీర్ కర్రీ చేసుకోండి. ఇందుకోసం..200 గ్రాముల పనీర్ ని ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత ఒక బౌల్ లో నీళ్లు పోసి అందులో 1 టీస్పూన్ ఉప్పు వేసి కలపండి. ఈ నీళ్లల్లోనే కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేసి ఒకసారి కడగండి. ఉప్పు నీటిలో కడిగిన పనీర్ ముక్కలను తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోండి.
-తర్వాత 2 ఉల్లిపాయ బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో 3 లవంగాలు, 2 యాలకలు, అర ఇంచు దాల్చిన చెక్క వేసి మసాలా దినుసులను లైట్ గా వేగనివ్వాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసి వెయ్యండి. మంటను మీడియంలో పెట్టి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగేలోగా..మిక్సీ గిన్నెలో 2 బాగా పండిన టమాటోల ముక్కలు, 10 జీడిపప్సులు వేసి మెత్తాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో ఈ గ్రైండ్ చేసుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ ను వేసి బాగా కలుపుకుంటూ వేయించాలి.

-టమాటో పేస్ట్ బాగా వేగి అందులో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో అందులో 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాక అందులోనే పావు టీస్పూన్ పసుపు, ఒకటిన్నర టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా అన్నీ కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి అందులో కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేసుకోండి. ఇందులోనే ఒక టీస్పూన్ కసూరి మేథీ, 1 టీస్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి కలుపుకోండి.
-పనీర్ వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించకూడదు. చివరగా అందులో కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి. పనీర్ కర్రీ రెడీ.
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ!
-ఇప్పుడు బగారా రైస్ తయారీ కోసం..స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక అందులో 5 లవంగాలు, కొద్దిగా రాతి పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 4 యాలకలు, కొద్దిగా దాల్చిన చెక్క, అర టీస్పూన్ షాజీరా వేసి వేయించాలి. ఇవన్నీ లైట్ గా వేగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి.
-జీడిపప్పు ముక్కలు కలర్ మారిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా తరుగు వేసి వేయించాక అందులో 4 గ్లాసుల నీళ్లు పోసి, అందులో రుచికిసరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూతపెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టుకున్న బియ్యం వేసి పెద్ద మంట నీళ్లు సగం అయ్యేదాకా ఉడికింయాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్లీ మూతపెట్టి తక్కువ-మీడియం మంట మీద ఉడికించాలి.
-రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి 5 నిమిషాల తర్వాత మూత తీయండి.
-అంతే బగారా రైస్ రెడీ. వేడి వేడి బగారా రైస్ ను పనీర్ కర్రీతో తింటుంటే మస్త్ మజా వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
